• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కోడుమూరు రాజవర్ధన్ రెడ్డి కుటుంబానికి భారీ పరిహారం

KRNL: మాజీ MPP రాజవర్ధన్‌రెడ్డి రోడ్డు ప్రమాద మృతి కేసులో ఆయన కుటుంబానికి రూ. 2.25 కోట్లు నష్టపరిహారం 7.5% వడ్డీతో చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. 2022 ఏప్రిల్ 20న జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు. పిటిషన్‌పై విచారణ అనంతరం లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.

February 20, 2026 / 12:04 PM IST

మానత్వం చాటుకున్న ఎస్ఐ నరేష్

వనపర్తి జిల్లా నర్సింగయ్య పల్లి డిగ్రీ కాలేజ్ వద్ద శుక్రవారం ఉదయం రెండు బైకులు ఢీ కొని ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని సరైన సమయంలో అంబులెన్స్ అందుబాటు లేకపోవడంతో గతంలో గోపాల్పేట ఎస్సైగా విధులు నిర్వహించిన నరేష్ తన బైక్‌పై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలు శభాష్ పోలీస్ అని కొనియాడారు.

February 20, 2026 / 12:03 PM IST

టమాటా కేజీ ధర రూ.5 మాత్రమే..!

AKP: నర్సీపట్నం కాయగూరలు మార్కెట్లో కేజీ టమాటా ధర దారుణంగా పడిపోయింది. కేజీ కేవలం రూ.5 మాత్రమే ఉండడంతో దారుణంగా నష్టపోతున్నామని పలువురు రైతులు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని పేర్కొన్నారు. రైతు బజార్లో కనీసం కేజీ రూ.10లకు అమ్ముకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

February 20, 2026 / 12:01 PM IST

మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డి

CTR: పులిచెర్ల మండలం మంగళంపేటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి మహా సంప్రోక్షణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణలత, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. వారు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

February 20, 2026 / 12:01 PM IST

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ELR: బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ మనేంద్ర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యర్ధాల నిర్వహణ క్రమ పద్ధతిలో చేయాలని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను బాధ్యతారహితంగా పడేయకూడదని వాటి వాడకం తగ్గించాలని సూచించారు.

February 20, 2026 / 12:00 PM IST

అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న MLA

ASF: పెంచికల్ పేట్ మండలం బొంబాయి గూడ గ్రామంలో నూతనంగా నిర్మితమైన అభయాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి MLA హరీష్ బాబు శుక్రవారం హాజరయ్యారు. వేద పండితులు బాచంపల్లి కమలాకర్ శర్మ ఆధ్వర్యంలోప్రతిష్టాపన జరిగింది. యాగశాలను సందర్శించిన MLAకు వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు.

February 20, 2026 / 12:00 PM IST

చింతలపూడిలో విద్యార్థులకు అవగాహన సదస్సు

ELR: చింతలపూడిలోని PMSHRI ZP హైస్కూల్లో శుక్రవారం పోలీసులు విద్యార్థినీ, విద్యార్థులకు, మత్తు పదార్థాల నివారణ కొరకు, సైబర్ క్రైమ్, పోక్సో యాక్ట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, డయల్ 112 లేదా స్థానిక పోలీస్ అధికారులను నేరుగా, ధైర్యంగా సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్సై సతీష్ కుమార్ పాల్గొన్నారు.

February 20, 2026 / 11:59 AM IST

హుస్నాబాద్‌లో ప్రార్థన మందిరం కూల్చివేత

SDPT: హుస్నాబాద్‌లో ఓ క్రైస్తవ ప్రార్థన మందిరాన్ని అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నిర్వాహకుల ప్రకారం దాదాపు 200 మంది సభ్యులు ఇక్కడ ఆరాధనలు నిర్వహిస్తున్నారు. స్థల వివాదంపై గతంలో కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందన్నారు. ఇప్పటికే పలుమార్లు ధ్వంసం చేసిన మందిరాన్ని మళ్లీ కూల్చివేశారని వాపోయి, బాధ్యులను శిక్షించాలన్నారు.

February 20, 2026 / 11:56 AM IST

ప్రభాస్‌తో సంతోష్ శోభన్ స్పెషల్ మూమెంట్..!

సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన రెబెల్ స్టార్ ప్రభాస్, చిత్ర బృందాన్ని కలిసి ప్రత్యేకంగా అభినందించాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను కలిసిన సంతోష్ శోభన్ ఆ ఫొటోను SMలో షేర్ చేస్తూ.. మొదటి నుంచి తనకు అండగా నిలుస్తున్నందుకు డార్లింగ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.

February 20, 2026 / 11:56 AM IST

మహా సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి

CTR: పలమనేరు శ్రీ భూనీల కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థాన మహా సంప్రోక్షణ పూజల్లో పలమనేర్ శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి సతీమణి శ్రీమతి రేణుకా రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన నూతన విమాన గోపుర రాజగోపుర మహా కుంభాభిషేక, స్వామి వారి నవీకరణ జీర్ణోద్ధారణ, అష్ట బంధన పూజల్లో ఆమె పాల్గొన్నారు.

February 20, 2026 / 11:54 AM IST

సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన టీడీపీ నేతలు

KRNL: పెద్దకడబూరు మండలం కల్లుకుంటలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను టీడీపీ నాయకులు తాయన్న, దాసప్ప రెడ్డి, నరసింహులు, వలి తాతా శుక్రవారం జేసీపీతో ప్రారంభించారు. హరిశ్చంద్రప్ప కాలనీలో వేమారెడ్డి ఇంటి నుంచి తారాపురం నరసింహులు ఇంటి వరకు, లక్ష్మన్న ఇంటి నుంచి బెల్లం బాషా ఇంటి వరకు రెండు రోడ్లను రూ. 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు.

February 20, 2026 / 11:54 AM IST

ఆపిన ఆగని బస్సు.. స్థానికుల ఆవేదన

KMM: మధిర మండలంలోని జాలిముడి మల్లారం వద్ద మధిర డిపోకు చెందిన ఒక ఆర్టీసీ బస్సు ఆపమని సంకేతాలు ఇచ్చినా ఆగకపోవడం స్థానికుల్లో ఆవేదన కలిగిస్తుందని స్థానికులు శుక్రవారం తెలిపారు. వయసు మళ్లిన వృద్ధులు బస్సు ఎక్కేందుకు చేతులు ఊపుతూ ఆపమని సూచించినప్పటికీ, బస్సు కొంత దూరం వెళ్లిపోయిందని అక్కడి ప్రజలు తెలిపారు.

February 20, 2026 / 11:50 AM IST

ఆమదాలవలసలో ప్రజా దర్బార్ కార్యక్రమం

SKLM: ఆమదాలవలసలో ఇవాళ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

February 20, 2026 / 11:49 AM IST

పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

ATP: గుత్తి మండలం బసినేపల్లికి చెందిన సులోచన అనే మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే వైద్య సేవలు అందించారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 11:48 AM IST

పొలాల్లో గాలి మరలు.. పనులు వేగవంతం

KRNL: ఆస్పరి మండలం చిన్న హోతూరు గ్రామ పొలాల్లో గాలి మరల (ఫ్యాన్లు) పనులు ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మరలు నిర్మించేందుకు అన్ని అనుమతులు వచ్చినందుకు పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే కొన్ని గాలి మరలు పూర్తయ్యాయని, వ్యవసాయానికి అనుగుణంగా వాటిని నిర్మిస్తున్నామని కాంట్రాక్టర్ తెలిపారు.

February 20, 2026 / 11:46 AM IST