• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ALERT: మూడు రోజులపాటు వర్షాలు

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు అదే ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడొచ్చని తెలిపింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శని, ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు పలు ప్రాంతాల్లో పొగ మంచు కురుస్తుందని చెప్పింది.

February 20, 2026 / 06:01 AM IST

హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

KKD: డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కష్టాలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసి గురువారం సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కాకినాడ ఎన్డీపీఓ మనీశ్ దేవరాజు పాటిల్ ఈ కేసులో అనంతబాబు భార్యను A-2గా చేర్చారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది

February 20, 2026 / 06:01 AM IST

మంత్రి లోకేశ్ నివాసంలో ఆత్మీయ విందు

BPT: ఉండవల్లిలోని మంత్రి లోకేశ్ నివాసంలో జరిగిన ఆత్మీయ విందులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి సతీమణికి లోకేశ్ మంగళగిరి పట్టుచీరను బహూకరించారు. ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ పరిధిలోని నేతల కలయికతో ఈ భేటీ సందడిగా సాగింది. రాజకీయ అంశాలతో పాటు వ్యక్తిగత అనుబంధాలను ఈ సమావేశంలో పంచుకున్నారు.

February 20, 2026 / 06:00 AM IST

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

కృష్ణా: ఉంగుటూరు గ్రామ శివారులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎస్‌ఐ యు. గోవిందు తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4,210 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

February 20, 2026 / 06:00 AM IST

తాడేపల్లిలో వ్యక్తి ఆత్మహత్య

GNTR: తాడేపల్లిలోని సీతానగరం బోట్ యార్డ్ వద్ద గల బకింగ్ హమ్ కాలువ సమీపంలోని చెట్లల్లో ఓ వ్యక్తి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.మృతుడు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన తిరుమల కొండలు (45)గా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

February 20, 2026 / 06:00 AM IST

‘స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు’

AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్‌రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్‌ను నియమించినట్లు తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ నియామకం పట్ల సీఎం చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

February 20, 2026 / 05:54 AM IST

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

KDP: సింహాద్రిపురం మండలం హిమకుంట్ల ZP పాఠశాలలో గురువారం విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా SI అనిల్ కుమార్ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి, మత్తు మందులు, గుట్కాలు ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. బ్యాంకు ఖాతా, ఏటీఎం పిన్ నంబర్లు, ఓటీపీ వివరాలను ఎవరికీ చెప్పొద్దని, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని విద్యార్థులకు సూచించారు.

February 20, 2026 / 05:54 AM IST

‘బార్ అండ్ రెస్టారెంట్‌కు అనుమతులు రద్దు చేయాలి’

అనకాపల్లి పట్టణం నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఫోరం ఫర్ బెటర్ ఇండియా అధ్యక్షుడు జి.సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్‌కు వినతి పత్రం అందజేశారు. కనీసం పార్కింగ్ ఏర్పాటుకు స్థలం కూడా లేని ప్రాంతంలో బారు నిర్వహణకు ఎలా అనుమతులు మంజూరు చేశారని ప్రశ్నించారు.

February 20, 2026 / 05:53 AM IST

రోడ్డుకు ఇరువైపులా చెట్ల కొమ్మల తొలగింపు

PDPL: పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలో సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం కొత్త గేట్ వద్ద నుంచి పాత గేట్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్టు కొమ్మలను జేసీబీ సహాయంతో తొలగించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రధాన రహదారులు, రైల్వే గేట్లగుండా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.

February 20, 2026 / 05:47 AM IST

అదుపు తప్పి కారు పల్టీ.. వ్యక్తికి గాయాలు

SRPT: శుభకార్యానికి వెళ్లివస్తూ అదుపు తప్పి కారు పల్టీ కొట్టిన ఘటన గురువారం సాయంత్రం నడిగూడెం,ఆర్సీపురం రహదారిలో చోటుచేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్సై గంధమల్ల అజయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 20, 2026 / 05:47 AM IST

షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన

NZB: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్లో గురువారం షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్నప్పుడు డయల్ 100, టీ-సేఫ్ యాప్లను ఎలా ఉపయోగించాలో వివరించారు. మహిళల హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఆత్మరక్షణలో ధైర్యంగా ఉండాలని అధికారులు సూచించారు.

February 20, 2026 / 05:47 AM IST

ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాటు పూర్తి..!

NLG: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 57,353 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 103 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

February 20, 2026 / 05:46 AM IST

నేడు ఎంపీ పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం ఉదయం 8 గంటలు వరకు ఎంపీ క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు టీడీపీ జిల్లా కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అనంతరం మధ్యాహ్నం నుంచి పార్లమెంట్ పరిధిలో పలు రకాల కార్యక్రమంలో పాల్గొంటారని ఎంపీ కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.

February 20, 2026 / 05:41 AM IST

ఘనంగా రాటకొండ రాజేష్ జన్మదిన వేడుకలు

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాష్ట్ర ఐటిడిపి ఉపాధ్యక్షులు రాటకొండ రాజేష్ జన్మదిన వేడుకలు గురువారం రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పూలమాలలు, శాలువాలతో సన్మానించి, పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

February 20, 2026 / 05:35 AM IST

ఘనంగా రాటకొండ రాజేష్ జన్మదిన వేడుకలు

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాష్ట్ర ఐటిడిపి ఉపాధ్యక్షులు రాటకొండ రాజేష్ జన్మదిన వేడుకలు గురువారం రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పూలమాలలు, శాలువాలతో సన్మానించి, పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

February 20, 2026 / 05:35 AM IST