• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వీధి బల్బుల సమస్యను పరిష్కరించిన నూతన కార్పొరేటర్

మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21 డివిజన్ ఉరగుట్ట చెరువు రోడ్డు ప్రాంతంలో వీధి బల్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. విషయాన్ని స్థానికులు నూతన కార్పొరేటర్ గుండా సంతోష్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన గురువారం రాత్రి నూతన బల్బులను ఏర్పాటు చేయించారు. వాటిని ఆ ప్రాంత వాసులతో కలిసి ప్రారంభించగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

February 20, 2026 / 09:20 AM IST

అదుపుతప్పి ఢీకొన్న ఇసుక టిప్పర్లు

KDP: శుక్రవారం కమలాపురం మండలం గొల్లపల్లి బ్రిడ్జి సమీపంలో కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రగుంట్ల వైపు నుంచి వెళ్తున్న రెండు ఇసుక టిప్పర్లను వెనుక నుంచి వస్తున్న ఒక వాహనం బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం, గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

February 20, 2026 / 09:20 AM IST

బస్టాండ్‌లలో దుకాణాల కేటాయింపునకు టెండర్లు

SS: జిల్లాలోని వివిధ బస్టాండ్‌లలో ఖాళీగా ఉన్న దుకాణాలను టెండర్ ప్రక్రియ ద్వారా కేటాయించనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. స్వయం ఉపాధి పొందాలనుకునే యువత, చిన్న వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత డిపో కార్యాలయాలను సంప్రదించి టెండర్ నిబంధనలు, దరఖాస్తు గడువు వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 09:19 AM IST

బస్టాండ్‌లలో దుకాణాల కేటాయింపునకు టెండర్లు

SS: జిల్లాలోని వివిధ బస్టాండ్‌లలో ఖాళీగా ఉన్న దుకాణాలను టెండర్ ప్రక్రియ ద్వారా కేటాయించనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. స్వయం ఉపాధి పొందాలనుకునే యువత, చిన్న వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత డిపో కార్యాలయాలను సంప్రదించి టెండర్ నిబంధనలు, దరఖాస్తు గడువు వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 09:19 AM IST

అల్లర్ల కేసులో మరికొంత మందిపై కేసు

MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ , వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు మందమర్రి సీఐ పర్స రమేశ్ ప్రకటనలో తెలిపారు. ఇందులో సుమన్, మూల రాజిరెడ్డి, అనిల్, లక్ష్మి కాంతులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారంతా పరారీలో ఉన్నారని సీఐ వెల్లడించారు.

February 20, 2026 / 09:17 AM IST

బొల్లారంలో ఆగనున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్

HYD: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో నడిచే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారం రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మక నిలుపుదల కల్పించారు. ఈరోజు నుంచి తదుపరి సూచనలు వచ్చేవరకు ఈ స్టాప్ అమల్లో ఉండనుంది. దీంతో స్థానిక ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ లభించనుంది.

February 20, 2026 / 09:17 AM IST

ప్రముఖ నటుడు కన్నుమూత

హాలీవుడ్ నటుడు ఎరిక్ డేన్ (53) Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధితో కన్నుమూశాడు. ‘Grey’s Anatomy’, ‘Euphoria’ వంటి సిరీస్‌లతో పాటు ‘X-Men’, ‘Bad Boys’ సినిమాలతో ఆయన గుర్తింపు పొందాడు. కండరాల బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగించే ఈ ప్రాణాంతక వ్యాధి రావడానికి కచ్చితమైన కారణం లేదు. అభిమానులు తమ అభిమాన నటుడికి నివాళులర్పిస్తు...

February 20, 2026 / 09:17 AM IST

‘ రేపు జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి’

CTR: చిత్తూరు మెప్మా-నిపుణ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నాగయ్య కళాక్షేత్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటలకే మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు అర్హులని అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 8121212873 నంబర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 20, 2026 / 09:17 AM IST

మురికి కాలువలు శుభ్రం చేపిస్తున్న కౌన్సిలర్ ముజాహిద్

KMR: బిచ్కుంద పట్టణంలోని ఏడవ వార్డులో మురికికాలువల్లో నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కౌన్సిలర్ ముజాహిద్ పర్యటించి కార్మికులను అప్రమత్తం చేశారు. అనంతరం నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ప్రజలు అంటురోగాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరని కౌన్సిలర్ ముజాహిద్ అన్నారు.

February 20, 2026 / 09:16 AM IST

కత్తితో తండ్రిపై కుమారుడి దాడి.. MGMతరలింపు

MHBD: పెద్దవంగర మండలం పడమటి తండాకు చెందిన ధరావత్ సోమన్న తన కుమారుడు విజయ్ మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. గురువారం క్షణికావేశంలో తండ్రి గొంతుపై కుమారుడు కత్తితో దాడి చేశారు. గాయపడిన వ్యక్తిని కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపారు.

February 20, 2026 / 09:15 AM IST

దొంగతనం నెపం.. మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

VSP: బుచ్చయ్యపేట మండలం కొత్త కొండెం పూడిలో పదో తరగతి విద్యార్థి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు కొంతమంది వెండి పట్టీలు దొంగతనం చేశారని నెపం మోపడంతో మనస్తాపం చెంది చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కాలనీ వాసులు తెలిపారు. కుమారుడి మృదేహాన్ని చూసి తల్లిదండ్రులు తలారి మంగపతి, భవాని కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 20, 2026 / 09:15 AM IST

కనకదుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే కాలవ

ATP: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుక్రవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని, రాయదుర్గం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 09:14 AM IST

పాఠశాలకు జాతీయ నాయకుల చిత్రపటాల అందజేత

JGL: బీర్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దాతలు జాతీయ నాయకుల చిత్రపటాలు, పోడియం, అలారం క్లాక్‌లను గురువారం బహూకరించారు. మండల విద్యాధికారి సిరుప నాగభూషణం దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జూపాక సుదర్శన్, దాతలు గంధం రమేశ్, చెట్పెల్లి శ్రీధర్, ఏఏపీసీ ఛైర్మన్ సముద్రాల శ్రీలత, మాజీ సర్పంచ్ కోటపల్లి గంగాధర్ పాల్గొన్నారు

February 20, 2026 / 09:13 AM IST

ఈ నెల 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ

TPT: వెంకటగిరి ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి ఈనెల 23వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ తులసి జ్యోతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ద్వారా మార్చి 31వ తేదీ వరకు అర్జీలు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్షలు, 27 ఫలితాలు, మెరిట్ లిస్టు, ఎంపిక జాబితాను ప్రకటిస్తామని ఆమె తెలిపారు.

February 20, 2026 / 09:12 AM IST

ఆత్మకూరులో ఈనెల 26న మెగా జాబ్ మేళా

NDL: ఈ నెల 26న ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి ఇవాళ తెలిపారు. 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని 1,250 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన 18–30 ఏళ్ల వయసు గల యువత అర్హులన్నారు. సర్టిఫికెట్లతో నేరుగా హాజరుకావాలని సూచించారు.

February 20, 2026 / 09:10 AM IST