సిరిసిల్ల పట్టణం B.Y నగర్ లోని యశ్వసిన్ మండప్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశభక్తి, పరాక్రమం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.
మలయాళ నటులు అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విషాక్ నాయర్ కలిసి నటించిన మూవీ ‘చథా పచ్చ’. FEB 13న రిలీజైన ఈ మూవీ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. WWE తరహా రెజ్లింగ్ క్లబ్‌ను స్థాపించే ముగ్గురు సోదరుల కథతో ఈ మూవీ దర్శకుడు అద్వైత్ నాయర్ తెరకెక్కించాడు.
KRNL: పత్తికొండ మండలంలో రైతు విశిష్ట సంఖ్య ఉంటేనే కిసాన్ పథకం వర్తిస్తుందని మండల వ్యవసాయ అధికారి వెంకట్రాముడు బుధవారం తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన 2,143 మంది రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించినట్లు చెప్పారు. నమోదు లేని రైతులు వెంటనే తమ గ్రామ రైతు సేవా కేంద్రాలను సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు.
CTR: సోమల మండలం కందూరు, చౌడేపల్లి వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బైకులు ఢీ కొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు చౌడేపల్లిగా స్థానికుల చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సాక్షి మీడియా సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తనకు వ్యతిరేకంగా, తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలు రాశారని పేర్కొన్నారు. ఇందిరా టెలివిజన్ MD భారతీరెడ్డి, ఎడిటర్ బ్యూరో చీఫ్, బోర్డు డైరెక్టర్లకు లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణ చెప్పి.. నష్టపరిహారంగా రూ.కోటి చెల్లించాలని, ఆడబ్బును అమరావతి రైతులకు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
కృష్ణా: యనమలకుదురు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. 82 రోజుల కాలానికి హుండీ ఆదాయం మొత్తం రూ.23,40,500గా వచ్చినట్లు ఆలయ ఈవో ఎన్. భవాని తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు, గ్రామస్థులు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు యనమలకుదురు శాఖ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్: గండీడ్ మండలం వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో 6-10 తరగతుల్లో దరఖాస్తులను ఆహ్వానించారు అని ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7-10 తరగతుల్లో ఖాళీలు ఉన్నాయని, ఈ నెల 28లో https://tgms.telangana.gov.inలో దరఖాస్తు చేయాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న ఉంటుందని పేర్కొన్నారు.
శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘విష్ణు విన్యాసం’ ఈనెల 28న విడుదల కానుంది. తాజాగా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని, అందరినీ అలరిస్తుందని అన్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ యువతకు బాగా నచ్చుతుందని, థియేటర్లలో అందరూ హాయిగా నవ్వుకుంటారని ధీమా వ్యక్తం చేశాడు.
AP: విజయవాడ నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు బయలుదేరారు. ఆయన బయలుదేరే ముందు పోలీసులు నోటీసులు ఇచ్చి సంతకం చేయించుకున్నారు. నోటీసులు ఇవ్వడంపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వడం సరికాదని, సంఘీభావం తెలిపేందుకు కార్యకర్తలు వస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో తమకు సంఘీభావం తెలపకుడదా? 18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే నిర్బంధాలు ఏంటని మండిపడ్డారు.

NLG: నకరేకల్ మండలం గోరింకలపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సంఘం భవనానికి ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులను ప్రారంబించారు.

BHPL: గణేష్ పల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి స్థానిక ఆరే కుల సంక్షేమ సంఘం నేతలు, గ్రామస్థులు నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడుస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని జిల్లా నాయకులు తిప్పారపు బాపూరావు, మాజీ సర్పంచ్ తిప్పారపు యుగంధర్ అన్నారు.

CTR: జిల్లాలో ముస్లింలు ఇవాళ ఉదయం నుంచి రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభించారు. నిన్న సాయంత్రం నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలు ప్రారంభిస్తున్నట్లు మత పెద్దలు వెల్లడించారు. నెల రోజులపాటు కఠోర దీక్షలు చేపట్టనున్నారు. మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీక్షలు నిర్వహించే వారి కోసం గంట ముందే వెళ్లేలా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.