CTR: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, రోడ్డు భద్రత, ధైర్య స్పర్శ చొరవపై దృష్టి సారించాయి. సురక్షితమైన ఆన్‌లైన్ పద్ధతులు, ట్రాఫిక్ నియమాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం వంటి క్రమశిక్షణ లక్షణాలు కలిగి ఉండాలన్నారు.
WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో కాంట్రాక్టర్ రాజ్యం నడిచిందని ఆరోపిస్తూ, ప్రస్తుతం ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పై పార్టీ మార్పులు, కమిషన్ ఆరోపణలతో విమర్శలు గుప్పించారు.
RR: ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామ పరిధిలో గల మోల్లోన్ గడ్డ తండాలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమాన్ని ఆదివాసి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శీను నాయక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాధ్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల సంక్షేమం సాధ్యమని పేర్కొన్నారు.
కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ లోని రికార్డులను డీఐజీ పరిశీలించి,రికార్డు నిర్వహణ ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని, కేసుల పరిష్కారంలో జాప్షం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డీఎస్పీ ధీరజ్ వినిల్, పాల్గొన్నారు.
GNTR: రాష్ట్ర ప్రభుత్వం జనన, మరణాల నమోదుపై జీవోఎంఎస్ 28 ద్వారా కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు కమిషనర్ మయూర్ అశోక్ బుధవారం తెలిపారు. జనన లేదా మరణం జరిగిన 21 రోజుల్లోపు ఉచితంగా నమోదు చేసుకోవచ్చని, ఆ తర్వాత నిర్ణీత ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ 21 రోజులు దాటితే, రూ. 25 అపరాధ రుసుముతో 30 రోజులలోపు నమోదు చేసుకోవచ్చని వివరించారు.
ప్రకాశం: చీమకుర్తిలో తూర్పు బైపాస్ రోడ్డు కూడలి నందు బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ మీద వెళుతున్న రాజేశ్, కోటయ్యలను ఢీకొంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రాంతంలో రోడ్డు బాగా దెబ్బ తినటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.
బాపట్లలో టీడీపీ కార్యాలయ నిర్మాణానికి ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ బుధవారం వెల్లడించారు. ఇదే వేదికపై బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎంపికైన రాజశేఖర్ బాబు ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ఈ రెండు కీలక కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
PLD: ఉపాధిహామీ పథకంపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి రానున్నారు. ఈ మేరకు వినుకొండ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రామాంజనేయులు వివరాలు వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాలపై భారం మోపుతోందని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన విమర్శించారు.
GNTR: ఫిరంగిపురం మండలంలోని నుదురుపాడు గ్రామాన్ని గుంటూరు జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు ఎం. పద్మావతి సందర్శించి ,రైతు సేవా కేంద్రం ద్వారా రైతుల విశిష్ట నమోదు సంఖ్య నమోదు ప్రక్రియను పరిశీలించారు. పొలం ఉన్న రైతు ఈ నెలాఖరు లోపు రైతు సేవా కేంద్రాల వ్యవసాయ సహాయకుల ద్వారా ఏపీ ఎఫ్.ఆర్ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
KMM: మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ డైరీని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
కోనసీమ: అత్రేయపురం(మం) పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యులు బుధవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు.
MHBD: తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, TPCC వైస్ ఛైర్మన్ ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.
KMM: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా నేత భూక్యా వీరభద్రం బుధవారం డిమాండ్ చేశారు. నేడు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పోడు భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, సీతారామ ప్రాజెక్ట్ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు.
కోనసీమ: అమలాపురంలోని APSRTC బస్ డిపో వద్ద ఏవి డ్రైవింగ్ స్కూల్ నందు 12వ బ్యాచ్‌కు సంబంధించిన 16 మంది అభ్యర్థులు 32 రోజుల శిక్షణను పూర్తి చేసుకున్నారు. వారికి అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు సర్టిఫికెట్లు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్లు భాస్కర్ రావు, శర్మ, అధికారులు పాల్గొన్నారు.
BHPL: జిల్లా నాచారం గ్రామంలో గ్రామ యువత ఆధ్వర్యంలో బుధవారం క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హాజరై, మాట్లాడారు. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగకరమని, యువతలో క్రమశిక్షణ, స్నేహభావం, జట్టు భావన పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో TRP నేతలు, క్రీడాకారులు ఉన్నారు.