CTR: పలమనేరులో ఈనెల 19వ తేదీన ఛత్రపతి శివాజీ శోభాయాత్రను నిర్వహించనున్నట్లు హిందూ సంఘాల సభ్యులు తెలిపారు. ఈ శోభాయాత్ర పలమనేరు లయన్స్ క్లబ్ నుంచి ప్రారంభమై, రెక్కమాను సర్కిల్, జిలాని సర్కిల్, పెట్రోల్ బంక్, యంబీటి రోడ్డు, జవిలి వీధి మీదుగా తిరిగి లయన్స్ క్లబ్ వద్దకు చేరుకుంటుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి హిందూ బంధువులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
KMR: జిల్లాలోని రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ విద్యా బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని రికార్డులు, స్టోర్ రూమ్, ల్యాబ్ రూమ్ పరిశీలించి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని స్థానిక వైద్యాధికారి డాక్టర్ సురేష్‌కు సూచించారు.
నెదర్లాండ్స్‌పై డకౌట్‌తో అభిషేక్ శర్మ చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. T20 WCలో విండీస్ ప్లేయర్ ఆండ్రీ ఫ్లెచర్(2009) తర్వాత వరుసగా 3 సార్లు డకౌట్ అయిన 2వ ఆటగాడిగా నిలిచాడు. అలాగే క్రిస్ శ్రీకాంత్(1996 వన్డే WC) తర్వాత ఒకే ICC టోర్నీలో అత్యధికంగా 3 సార్లు డకౌట్ అయిన భారత్ 2వ ప్లేయర్‌గానూ అవతరించాడు. కాగా ఈ టోర్నీలో అభి ఆడిన 3 మ్యాచుల్లోనూ డకౌట్ అయ్యాడు.
నమీబియాతో జరుగుతున్న నామమాత్రపు మ్యాచులో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. దీంతో టీమిండియా 69 పరుగులకే ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లను కోల్పోయింది. తొలుత అభిషేక్(0) డకౌట్ కాగా.. ఆ తర్వాత ఇషాన్(18), తిలక్(31) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. 10 ఓవర్ల ఆట ముగిసేసరికి భారత్ స్కోర్ 74/3 కాగా.. క్రీజులో సూర్య(22), దూబే(2) ఉన్నారు. నెదర్లాండ్స్ బౌలర్ ఆర్యన్ 2 వికెట్లు పడగొట్టాడు.
KMM: తహసీల్దార్ ఉషా శారదను ఎర్రుపాలెం సర్పంచ్ నండ్రు అశ్వని, ఆత్మ కమిటీ డైరెక్టర్ కంచర్ల వెంకట నరసయ్య బుధవారం గ్రామ రెవెన్యూ సంబంధిత సమస్యలపై చర్చించారు. భూసంబంధిత పెండింగ్ దరఖాస్తులు, పట్టాదారుల నమోదు, రికార్డుల సవరణ అంశాలను ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
BHPL: జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ ఉన్నత పాఠశాలల నుంచి 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఇందిరా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు మార్చి 25వ తేదీ లోపు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సులభతర విధానాన్ని పరిచయం చేసింది. డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం ఆన్‌లైన్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. బ్యాంకు ఖాతాదారులు మరణించిన సందర్భాల్లో కుటుంబసభ్యులు, వారి వారసులు బ్యాంకును సందర్శించకుండానే ఈ డెత్‌క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
HYD: డా. బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇరిగేషన్ & సివిల్ సప్లైస్ శాఖలపై ప్రీ-బడ్జెట్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్య కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, ఆహార భద్రతకార్డు, ఉచిత సన్న బియ్యం పథకం, తదితర వాటిపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
MDCL: మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య, క్రీడా, మౌలిక సదుపాయాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మాను చౌదరిని కలిసి నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వినతి పత్రాలను సమర్పించారు.
MDK: నర్సాపూర్ నియోజకవర్గంలోని పంట పొలాలకు సాగునీరు అందించేందుకు కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి హల్దీ ప్రాజెక్టుకు వెంటనే నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కోరారు. ఈ విషయమై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆమె ఫోన్లో మాట్లాడి అధికారిక లేఖను పంపారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.
GNTR: కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం తెనాలిలో విస్తృతంగా పర్యటించారు. బుర్రిపాలెంలోని టిడ్కో లేఔట్‌ను పరిశీలించి, నిర్మాణంలో ఉన్న 2,880 ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డ్, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రంతో పాటు మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు.
E.G: కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొవ్వూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ భావన రత్నకుమారి, 3, 5, 19, 20వ వార్డు YCP కౌన్సిలర్లు బుధవారం టీడీపీలోకి చేరారు. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి రాష్ట్ర TDP అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం సీఐటీయూ మండల కన్వినర్ నరేంద్ర ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. నరేంద్ర మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ ఏర్పాటు చేసి మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించే విధానం చేయాలన్నారు.
కోనసీమ: ఆలమూరు(మం) లంక గ్రామాలకు ఎంతో ప్రయోజనకరమైన చెముడులంక వంతెన అప్రోచ్ రోడ్డుకు రూ. 30 లక్షలు మంజూరయ్యాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ నిధులను మంజూరు చేయించారు. ఏటిగట్టు అవతల ఉన్న బడుగువానిలంక గ్రామ ప్రజలతో పాటు, చెముడులంక, మడికి, పొట్టిలంక తదితర రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
KMM: రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను బుధవారం హైదరాబాద్ సెక్రటేరియట్ నందు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం జిల్లాలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన రూ. 5 కోట్ల నిధుల జీవో త్వరగా వచ్చేందుకు అన్ని విధాలుగా సహకరించిన సందర్భంగా ఆయనకు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.