• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సీఎం కప్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

JGL: రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీల్లో రాయికల్ మండలం అల్లీపూర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అథ్లెటిక్స్ పోటీలలో టీ. అనూష,శేషి ప్రియ, నితీషా, బాస్కెట్ బాల్ పోటీలకు ఎన్. షర్మిల ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు పోరండ్ల కిరణ్, పీడీ క్రిష్ణ ప్రసాద్‌లు తెలిపారు.ఈ నెల 20-22 వరకు హనుమకొండ, నిజామాబాద్‌లో జరిగే అథ్లెటిక్స్ బాస్కెట్ బాల్ పోటీలలో పాల్గొంటారన్నారు.

February 19, 2026 / 07:35 AM IST

జిల్లా వ్యాప్తంగా ముమ్మర వాహన తనిఖీలు

కోనసీమ: ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. అన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు ప్రధానంగా డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను గుర్తించి, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

February 19, 2026 / 07:20 AM IST

రాష్ట్రస్థాయి దివ్యాంగుల క్రీడల్లో జిల్లా క్రీడాకారుల సత్తా

SDPT: హైదరాబాద్ దోమలగూడలో జరిగిన రాష్ట్ర స్థాయి దివ్యంగుల క్రీడా పోటీల్లో జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 33 జిల్లాల నుంచి సుమారు 1200 మంది పాల్గొన్న ఈ పోటీల్లో సిద్దిపేట క్రీడాకారులు ఏకంగా 11 బహుమతులు గెలుచుకున్నారు. అండర్-14, 17 విభాగాల్లో వినికిడి, దృష్టి లోపం, ఇతర దివ్యాంగ విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యంతో జిల్లా కీర్తిని చాటారు.

February 19, 2026 / 07:12 AM IST

‘రంజాన్ ను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి’

ప్రకాశం: ముస్లింలు రంజాన్ పండగను భక్తిశ్రద్ధ లతో జరుపుకోవాలని దర్శి సీఐ వై.రామారావు కోరారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో ప్రసిద్ధి చెందిన మర్కజ్ మసీద్ వద్ద బుధవారం రాత్రి ముస్లింలతో నూతన చట్టాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోలీసులు ప్రతి ముస్లిం ఇంటికి నమాజ్ పుస్తకం పంపిణీ చేశారు.

February 19, 2026 / 07:07 AM IST

‘రంజాన్ ను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి’

ప్రకాశం: ముస్లింలు రంజాన్ పండగను భక్తిశ్రద్ధ లతో జరుపుకోవాలని దర్శి సీఐ వై.రామారావు కోరారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో ప్రసిద్ధి చెందిన మర్కజ్ మసీద్ వద్ద బుధవారం రాత్రి ముస్లింలతో నూతన చట్టాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోలీసులు ప్రతి ముస్లిం ఇంటికి నమాజ్ పుస్తకం పంపిణీ చేశారు.

February 19, 2026 / 07:07 AM IST

అక్రమంగా తరలిస్తున్న డీజిల్, పెట్రోల్ స్వాధీనం

కోనసీమ: ఐ.పోలవరం మండలం ఎదుర్లంక చెక్ పోస్ట్ వద్ద యానాం నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 790 లీటర్ల డీజిల్, 80 లీటర్ల పెట్రోల్‌ను బుధవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రవీంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, రాంబాబులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

February 19, 2026 / 06:51 AM IST

సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి

PDPL: పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన వర్షిత్ రెడ్డి సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యా రు. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు పెద్దపల్లి జిల్లా మొత్తం నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థి వర్షిత్ రెడ్డి కావడం విశేషమని గ్రామస్తులు తెలిపారు.

February 19, 2026 / 06:43 AM IST

ద్విచక్ర వాహనం డివైడర్‌కు ఢీకొని ఇద్దరికి గాయాలు

PDPL: ధర్మారం అయ్యప్ప గుడి సమీపంలో బుధవారం కొత్తూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు డివైడర్‌ను ఢీకొని గాయాల పాలయ్యారు. మద్దెల సాగర్ (20) తలకు, కుడి చేతికి గాయాలు కాగా, మేకల వంశీ (20) కుడి కాలుకు స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది సతీష్, శ్రీనివాస్ బాధితులకు ప్రథమ చికిత్స అందించి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

February 19, 2026 / 06:41 AM IST

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

JGL: నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి గౌతమ్ అన్నారు. నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలు, పాఠశాల ఏర్పాటు గురించి, కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

February 19, 2026 / 06:18 AM IST

ఎమ్మెల్యేకు ఉద్యోగుల జేఏసీ వినతిపత్రం

PDPL: NHM జేఏసీ పిలుపుతో “ప్రజాప్రతినిధుల ములాఖాత్” కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావును జేఏసీ ఉద్యోగులు కలిసి వినతి పత్రం అందజేశారు. రెగ్యులరైజేషన్‌తోపాటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలో కూడా రెగ్యులరైజేషన్ చేపట్టేలా ప్రభుత్వానికి సూచించాలని విజ్ఞప్తి చేశారు.

February 19, 2026 / 06:09 AM IST

ఈ నెల 22 న రామచంద్రపురంలో జాబ్ మేళా

కోనసీమ: ఈ నెల 22న రామచంద్రపురం ఉపాధి భవన్లో మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. 18 నుంచి 27 ఏళ్ల లోపు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ , ఐటిఐ చదివిన అభ్యర్థులకు రూ.18 వేల జీతంతో షిఫ్ట్ టైంలో భోజన, రవాణా సదుపాయం కల్పించే విధంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.

February 19, 2026 / 05:20 AM IST

సింగరేణి గనులను సందర్శించిన ఆర్టిఐ కమిషనర్లు

పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ కమిషనర్లు పి. వి. శ్రీనివాసరావు, దేశాల భూపాల్, మొహసినా పర్వీన్, బోరెడ్డి అయోధ్య రెడ్డి బుధవారం ఆర్జీ-1 ఏరియాలోని బొగ్గు గనులను సందర్శించారు. వీరికి జి.యం లలిత్ కుమార్ గని పనితీరు, బొగ్గు ఉత్పత్తి విధానాన్ని వివరించారు. సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు.

February 19, 2026 / 04:33 AM IST

ఎమ్మెల్యే అబద్ధాల కోరు: కాంగ్రెస్ నేతలు

KMR: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వైఖరిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. కన్న తండ్రిపైనే చేయి చేసుకున్న చరిత్ర ఉన్న MLAకు, షబ్బీర్ అలీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్‌లో అబద్ధాలు చెప్పారని, రూ.150 కోట్ల అభివృద్ధిపై ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు.

February 18, 2026 / 08:24 PM IST

జర్నలిస్టులకు బిగ్ అలర్ట్

TG: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం కొత్త అక్రిడిటేషన్ కార్డులను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అర్హులైన జర్నలిస్టులు HTTP://IPR.TELANGANA.GOV.IN ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ నెల 9 నుంచే ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ.. నిరంతరంగా సాగుతుందని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు.

February 18, 2026 / 08:14 PM IST

కన్నాయిగూడెంలో రేపు బైక్ ర్యాలీ

MLG: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రేపు 19 ఉదయం 8:30 గంటలకు పోచమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీ కన్నాయిగూడెం నుంచి దేవాదుల మీదుగా ఏటూరు వరకు సాగనుంది. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు సభ్యులకు, యువతకు పిలుపునిచ్చారు. జై భవాని జై శివాజీ అంటూ.. ర్యాలీ నిర్వహించనున్నారు.

February 18, 2026 / 08:09 PM IST