సత్యసాయి: హిందూపురం నియోజకవర్గంలోని సడ్లపల్లిలో శ్రీ సూగూరు సీతారామాంజనేయ స్వామి నూతన విగ్రహవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ పాల్గొని పూజలు నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా నిలుస్తాయని తెలిపారు.
BDK: ప్రాజెక్టు అధికారి టేకులపల్లిలో గ్రంథాలయ భవనాన్ని కట్టిస్తామని పీవో రాహుల్ చెప్పారు. టేకులపల్లి శాఖ గ్రంథాలయాన్ని శుక్రవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు సందర్శించారు. స్థానిక గ్రంథాలయాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారితో గ్రంథ పాలకుడు నాగన్న పాల్గొన్నారు.
‘ఎల్లమ్మ’ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీపై DSP ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంగీత దర్శకుడిగా అత్యంత బిజీగా ఉన్నప్పటికీ.. ఈ మూవీ కోసం నెలలో కేవలం 10 రోజులు పనిచేస్తానని చెప్పాడు. అందుకోసం నిర్మాత దిల్ రాజుతో ప్రత్యేక ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపాడు. ఇక ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
TG: రాష్ట్ర నేతల ఢిల్లీ పర్యటన వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. BJPని వీడి కాంగ్రెస్‍లో చేరినప్పుడు తనకు మంత్రి పదవి ఆఫర్ చేశారని.. కానీ తనను పార్టీలోకి తీసుకువచ్చిన సునీల్ కనుగోలు, భట్టి విక్రమార్క, మాణిక్ రావు, మహేశ్ కుమార్ వంటి నేతలు తన పట్ల ప్రవర్తించిన తీరు చాలా అవమానకరంగా ఉందన్నారు.
KDP: బద్వేల్‌లోని పేదలు, కూలీలు నిత్యం ప్రయాణించే వారి ఆకలి తీర్చడమే ధ్యేయంగా మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుత పథకం ‘అన్న క్యాంటీన్’ అని అన్నారు. అతి తక్కువ ధరకే, అత్యంత నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని గౌరవప్రదమైన రీతిలో అందిస్తూ వేలాది మంది కడుపు నింపుతోందని మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పేర్కొన్నారు. శుభ్రత, నాణ్యత, ధరలను తనిఖీ చేశారు.
KRNL: అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ఆస్పరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి మాట్లాడుతూ.. సామాజిక, ఆర్ధిక, రాజకీయ అసమానతలను తీర్చడానికి, కుల, మత, లింగ వివక్షతను నిర్మూలించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.
NRPT: మద్దూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ పదవి ఇస్తామని ముదిరాజ్ బిడ్డకు అన్యాయం చేశారని దౌల్తాబాద్ మాజీ జడ్పీటీసీ మైపాల్ మండిపడ్డారు. గోవిందుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అడిగినందుకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ముదిరాజ్ బిడ్డలపై లాఠీ ఛార్జ్ చేయించడం తగదని హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.
NDL: ప్యాపిలి మండలంలోని వంకామేటుపల్లి గుట్టల పల్లెలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులను గుర్తించి సంబంధిత అధికారులను వెంటనే అప్రమత్తం చేశారు. రెండు గ్రామాల్లో బోర్లు వేసి కొళాయి కనెక్షన్ ఇచ్చి పరిష్కారం చూపారు. ఈ క్రమంలో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
NGKL: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని MLA రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్ర, వైస్ ఛైర్మన్ బదం రమేష్ పాల్గొన్నారు.
SDPT: తెలంగాణ ఉద్యమంలో ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ క్రియా శ్రీలంక పాత్ర పోషించారు. 2009-2014 మధ్య కరీంనగర్ ఎంపీగా పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వాదించారు. ‘సకల జనుల సమ్మె’, మిలియన్ మార్చ్‌లో పాల్గొంటూ, పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారుడుగా నిలిచారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడుతున్నప్పుడు గాయపడ్డారు.
సూపర్-8లో భాగంగా ఈనెల 21న భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ షాన్ పొలాక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రెండు జట్లలోనూ అద్భత ప్లేయర్లు ఉన్నారని చెప్పాడు. అయితే, బుమ్రా, వరుణ్ చక్రవర్తి టీమిండియాలో గేమ్ ఛేంజర్స్ అని వ్యాఖ్యానించాడు. సౌతాఫ్రికాతో పోలిస్తే భారత్ జట్టు కాస్తా మెరుగ్గా కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి 13 దరఖాస్తులు వచ్చాయి. అర్జీలు పరిష్కారంలో జాప్యం జరగకూడదని డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. వికలాంగులకు పింఛన్లు మంజూరు చేయాలని 8 మంది దరఖాస్తులు సమర్పించారు. బ్యాటరీ మోటార్ సైకిల్లు మంజూరు చేయాలని ఇద్దరు దరఖాస్తు చేశారని తెలిపారు.
అభిమానుల కోసం ఏడాదికి 3-4 మూవీలు చేస్తున్నా, ఒక్కటే విడుదలవుతోందని ప్రభాస్ అన్నాడు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రబృందంతో ముచ్చటించిన ఆయన.. తనకు అన్ని జానర్లు ఇష్టమని, ముఖ్యంగా మణిరత్నం అంటే ప్రత్యేకమైన అభిమానమని తెలిపాడు. ‘గీతాంజలి’ అంటే తనకెంతో ఇష్టమని, ‘కపుల్ ఫ్రెండ్లీ’ చూసినప్పుడు ఆ మూవీ ఫీల్ కలిగిందన్నాడు. అందుకే దీన్ని నాలుగు సార్లు చూడాలని నిర్ణయించుకున్నానని...
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. సీఎం స్టాలిన్‌తో మాజీ సీఎం ఒ. పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్టాలిన్‌కు ఓపీఎస్ మద్దతు తెలిపారు. డీఎంకే ఐదేళ్ల పాలనను ఆయన పొగిడారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే మళ్లీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని తెలిపారు.
VSP: ప్రచురిత కథనం తమ ప్రతిష్ఠకు భంగం కలిగించిందంటూ దాఖలైన పరువు నష్టం కేసులో ఓ దినపత్రికపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ఐటీడీపీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి చింతకాయల విజయ్ విశాఖ జిల్లా కోర్టుకు శుక్రవారం హాజరయ్యారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా తప్పుడు కథనాలు ప్రచురించారని ఆరోపించారు.