• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అంగన్వాడి స్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు

SRCL: ఇల్లంతకుంటలో ఆరోగ్యలక్ష్మి పథకం అమలును బలోపేతం చేసేందుకు అంగన్వాడీ స్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. సమావేశానికి గ్రామ సర్పంచ్ ఎం.రాజు అధ్యక్షత వహించి తల్లి–బిడ్డల ఆరోగ్యమే గ్రామాభివృద్ధికి మూలమన్నారు. 12వ వార్డు సభ్యుడు కూనబోయిన రఘు చిన్నారులకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

February 20, 2026 / 03:05 PM IST

బీజేపీ నన్నెంతో గౌరవించింది: రాజగోపాల్

TG: తాను BJPలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎంతో గౌరవించిందని కాంగ్రెస్ MLA రాజగోపాల్ రెడ్డి అన్నారు. BJPలో తనకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, స్టేట్‌లో స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ ఇచ్చారన్నారు. కానీ కాంగ్రెస్ కన్నతల్లిలాంటిదని తిరిగి వచ్చానన్నారు. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే రాష్ట్ర రాజకీయం మరోలా ఉండేదని.. CPI నేత నెల్లికంటి సత్యం చెప్పిన మాటలను గుర్తుచేశారు.

February 20, 2026 / 03:05 PM IST

మాల్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ

NLG: చింతపల్లి మండలం మాల్ పట్టణంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతతో కలిసి ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆవిష్కరించి నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిదని ఎమ్మెల్యే తెలిపారు.

February 20, 2026 / 03:05 PM IST

బాధ్యతలు స్వీకరించిన మేయర్ ఉమారాణి

NZB: నగరపాలక సంస్థ మేయర్‌గా కూరగాయల ఉమారాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. నగరాభివృద్ధి ద్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 03:05 PM IST

బడిబయట పిల్లల గుర్తింపు సర్వే పూర్తి చేశాం: DEO

MNCL: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో బడిబయట పిల్లల గుర్తింపు సర్వే పూర్తి చేశామని DEO యాదయ్య శుక్రవారం ప్రకటనలో తెలిపారు. నివేదికలు రాష్ట్ర విద్యాశాఖకు అందించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి చదువులకు దూరంగా ఉన్నవారిని ఆయా పాఠశాలల్లో చేర్పించి చదువుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

February 20, 2026 / 03:02 PM IST

ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

SRPT: తిరుమలగిరి మండలం తాటిపాములలో ఇందిరమ్మ ఇళ్లకు శుక్రవారం ఎమ్మెల్యే సామేలు భూమి పూజ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయపల్లి కిషన్ పాల్గొన్నారు.

February 20, 2026 / 03:02 PM IST

‘సమస్యల పరిష్కారం కోసం సహకరించండి’

NRML: నూతనంగా ఎన్నికైన నిర్మల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ అప్పల కావ్య, వైస్ ఛైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తిలను ట్రస్మా జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యల పరిష్కారానికి సహకరిస్తే చాలా సమస్యలు దూరం అవుతాయని కోరారు.

February 20, 2026 / 03:02 PM IST

విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్

ASF: తిర్యాణి జడ్పీ పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి, విద్యార్ధులతో మాట్లాడారు. హాజరు శాతం తక్కువగా ఉండటంపై ప్రధానోపాధ్యాయుడు అంజయ్యను వివరణ కోరారు. విద్యార్థులు క్రమం తప్పకుండా బడికి వచ్చేలా చూడాలన్నారు. అనంతరం టీచర్‌లా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు.

February 20, 2026 / 03:02 PM IST

సొంతింటి కల నిజం చేయడమే మా లక్ష్యం: ప్రభుత్వ విప్

SRCL: పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలో 14, 19 వార్డుల్లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

February 20, 2026 / 03:01 PM IST

బాలికల పాఠశాలలో ట్రాఫిక్‌పై అవగాహన

TPT: ట్రాఫిక్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిబ్బంది విద్యార్థినులకు హెల్మెట్ ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాలు, రోడ్డు సంకేతాలు, మైనర్లు వాహనాలు నడపరాదనే చట్టాలపై వివరించారు. మొబైల్ వినియోగం, ప్రమాదాలపై హెచ్చరించారు.

February 20, 2026 / 03:01 PM IST

‘కార్మికుల సమస్యలను పరిష్కరించాలి’

ADB: భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రాజు శుక్రవారం ఆదిలాబాద్‌లోని సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో పనిచేసే లేబర్ వెల్ఫేర్ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.

February 20, 2026 / 03:01 PM IST

మసీదులో రంజాన్ మాస ప్రత్యేక ప్రార్థనలు

ATP: రంజాన్ మాసంలో వచ్చే తొలి శుక్రవారం (జుమా) నమాజ్‌కు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇందులో భాగంగా గుత్తి కేబీఎన్ మసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీదు ఇమామ్ హుస్సేన్ మాట్లాడుతూ.. రంజాన్ ప్రాముఖ్యత, ఉపవాసం, దానధర్మాలు ఆధ్యాత్మికత గురించి ప్రత్యేక ఉపన్యాసాలు చేశారు. నమాజ్‌కు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు.

February 20, 2026 / 03:01 PM IST

‘తొలి తీర్మానంలోనే చౌరస్తా విస్తరణ పనులు చేపట్టాలి’

RR: షాద్‌నగర్‌లోని ప్రధాన చౌరస్తా విస్తరణ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని కోరుతూ సామాజిక కార్యకర్త రాజు నూతన మున్సిపల్ చైర్మన్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రవేశపెట్టే తొలి తీర్మానంలోనే చౌరస్తా విస్తరణ అంశాన్ని చేర్చాలన్నారు.

February 20, 2026 / 03:00 PM IST

రమణీయంగా సాగిన రథోత్సవం

NLR: బుచ్చి పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్లకు రథోత్సవం వేడుకగా జరిగింది. రథం లాగేందుకు యువత పోటీ పడ్డారు. అడుగడుగునా స్వామి అమ్మవార్లకు భక్తులు కర్పూర హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రథోత్సవాన్ని తిలకించారు.

February 20, 2026 / 03:00 PM IST

శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

విజయనగరం స్థానిక పూల్ బాగ్ కాలనీలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ అయోధ్య బాలక్ రామ మందిర్ ట్రస్ట్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు ఆధ్వర్యంలో అర్చకులు వేకువ జామున సుప్రభాతసేవ, శాంతి హోమం, పూర్ణాహుతి, పూజలు జరిపారు. అనంతరం అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

February 20, 2026 / 03:00 PM IST