SDPT: హుస్నాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో ఎస్సై లక్ష్మారెడ్డి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్లు వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
TG: AICC చీఫ్, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల వేళ వనపర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ బీ ఫారంను తాను వెనక్కి ఇచ్చే సమయంలో తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీని చిన్నారెడ్డి AICC చీఫ్ ఖర్గే దృష్టికి తెచ్చారు.
ప్రముఖ నటి మీనాక్షి చౌదరి బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్, గోవిందా, పరేష్ రావల్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘భాగమ్ భాగ్’కు సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమాలో మీనాక్షితో పాటు నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు రాజ్ శాండిల్య దర్శకత్వం వహించనున్నాడు.
KRNL: విలువైన ఆర్టీసీ స్థలాలను కాపాడుకుందాం అంటూ శుక్రవారం కర్నూలు ఆర్టీసీ డిపో ఎదుట స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (SWF) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు హాజరై సంఘీభావం తెలిపారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 11,000 రెగ్యులర్ కార్మికుల పోస్టులను రిక్రూట్‌మెంట్ ద్వారా వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
AKP: కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పూర్వ విద్యార్థులు శుక్రవారం పెన్నులు, అట్టలు పంపిణీ చేశారు. హెచ్ఎం సుకుమార్ మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు వారి చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
KRNL: ఆదోనిలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆదోని నియోజకవర్గ ఇంఛార్జ్ మాదాసుల రాజబాబు అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ ఆయన ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
NZB: బాల్య వివాహాలను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల పరిరక్షణ అధికారి నాగేరి బాబు హెచ్చరించారు. శుక్రవారం రుద్రూర్ రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేస్తే తల్లిదండ్రులతో పాటు సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.
AP: రెవెన్యూ శాఖకు బడ్జెట్ కేటాయింపులపై మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో మాట్లాడారు. 22వ నిషేధిత జాబితా భూముల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22ఏ భూముల తొలగింపు సులభతరం చేసేలా అధికారులను బదలాయింపు చేస్తున్నట్లు వెల్లడించారు. జాబితా నుంచి ప్రైవేట్ భూములు తొలగించే అధికారం ఆర్డీవోలకు అప్పగించనున్నట్లు ప్రకటించారు.
PDPL: మంథని మండల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పక్కా సమాచారంతో గుట్టు చప్పుడు కాకుండా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ASR: జాబ్ కార్డులు ఉన్నవారందరికీ ఉపాధి పనులు కల్పించాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన బకులూరు గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. నాణ్యంగా పనులు చేయాలని వేతనదారులకు సూచించారు. రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.
KRNL: పత్తికొండలో చైన్ స్నాచింగ్ మరియు దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇవాళ సీఐ పులిశేఖర్ గౌడ్ తెలిపారు . మహిళలు సాయంత్రం, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాలు ధరించవద్దన్నారు. దేవనకొండ, గోనెగండ్ల, ఆదోని ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇళ్ల తలుపులు, వాహనాలు సురక్షితంగా లాక్ చేసుకోవాలని, సూచించారు.
2026 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశ ముగిసే సమయానికే మూడు సెంచరీలు (నిస్సంక, యువరాజ్ సమ్రా, ఫర్హాన్) నమోదయ్యాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో మూడు సెంచరీలు నమోదు కావడం ఇదే మొదటిసారి. టోర్నీ సగం కూడా పూర్తికాకముందే మూడు సెంచరీలు నమోదు కావడంతో, ఈ మెగా టోర్నీ ముగిసేలోపు ఇంకెన్ని సెంచరీలు నమోదవుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ATP: గుంతకల్లు ఎస్కే పీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ లక్ష్మీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంట్లో, పాఠశాల, కళాశాలలో ఉపయోగించే నీటిని సహజ పద్ధతుల ద్వారా శుద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగించొద్దిని తెలిపారు.
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ ఓయూలో జరిగిన సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నిర్వహించిన ఈ సమావేశం “Creating AI & Quantum Enabled Higher Educational Institutions” అంశంపై జరిగింది. తెలంగాణ గవర్నర్‌తో పాటు సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్లు పాల్గొన్నారు.