TG: గురుకుల హాస్టల్‌లో నియామకమయ్యే నోడల్ అధికారులు.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తనిఖీలు నిర్వహించాలి. విద్యాసంస్థల సరైన పనితీరును నిర్ధారించడానికి ఆకస్మిక సందర్శనలను కూడా నిర్వహించాలి. తనిఖీ నివేదికలను తయారు చేసి వెంటనే అప్‌లోడ్ చేయాలి. తీసుకున్న చర్యల నివేదికను ప్రతినెల అయిదో తేదీలోపు సంబంధిత విభాగాధిపతులు, కార్యదర్శులకు తప్పకుండా సమర్పించాలి.
AP: కల్తీ నెయ్యి విషయంలో సీబీఐ సిఫార్సులను ప్రభుత్వం బయటపెట్టాలని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏకసభ్య కమిషన్ ఛైర్మన్‌గా చంద్రబాబు ఉంటే సరిపోయేదని ఎద్దేవా చేశారు. వైసీపీ వాళ్లను దోషులు చేసిన ఆయనే శిక్షలు వేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారం హెరిటేజ్‌లోనే ప్రారంభమైందని ఆరోపించారు.
ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ వద్ద భారత యువ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. భారత్-అమెరికా మధ్య కుదురుతున్న వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యువ కాంగ్రెస్ శ్రేణులు వినూత్న రీతిలో ఆందోళన నిర్వహించారు. తమ చొక్కాలు విప్పి, అర్ధనగ్నంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
MBNR: క్రీడలు శారీరకదృఢత్వంతో పాటు మానసికస్థైర్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం కప్ పోటీలను ఎమ్మెల్యే జ్యోతివెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధ్యాణ్యత ఇస్తుందన్నారు. యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి PHC సిబ్బంది మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ దీపిక ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హెల్త్ సూపర్వైజర్ సుభాష్, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా భీమవరం JLB స్కూల్లో విద్యార్థినిలు భువన విజయం రూపకం శుక్రవారం ప్రదర్శించారు. మాతృభాష అభ్యున్నతికి పాటుపడుతున్న కలిగొట్ల గోపాలశర్మ, సాగిరాజు సత్యనారాయణరాజు, వేము వెంకటకృష్ణమోహన్, తెలుగు అధ్యాపకులు రోహిణి, మౌనిక భవానిలను సత్కరించినట్టు HM కృష్ణకుమారి, అల్లు శ్రీనివాసులు తెలిపారు. ఇందులో రిటైర్డ్ MEO.సీతారామరాజు పాల్గొన్నారు.
PPM: వ్యాదుల మూల కారణాలపై దృష్టి సారించి నియంత్రణ చర్యలు చేపట్టాలని DMHO డా ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. ఉల్లిభద్ర గ్రామంలో శుక్రవారం ఆయన సందర్శించి అక్కడ ఫ్రైడే డ్రైడే నిర్వహణ తీరు పరిశీలించారు. గ్రామంలో గృహ సందర్శనలు చేస్తూ పరిసరాల్లో నీటి తొట్టెలు, కాల్వలు పరిశీలించారు. లార్వా ఉనికి ప్రదేశాలను నియంత్రణ చెయ్యాలి అన్నారు.
ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలో అదనంగా 15 శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి కొత్త కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 6 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల ప్రకారం శనగ క్వింటాల్‌కు రూ. 5,875 చెల్లించబడుతుందని తెలిపారు.
BPT: పిడుగురాళ్ల–వాడరేవు జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్చూరు వైపు వస్తున్న కారు, బైక్ బలంగా ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పర్చూరు SI పులి గోపి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం: పెద్దారవీడు గ్రామ పంచాయతీలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను ఎంపీడీవో జాన్ సుందరరావు ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్లో వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
W.G: ఉండి మండలం చిన్నపులేరు గ్రామంలో జేసీ టీ రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. పట్టాదారు పాస్ పుస్తకాల అమలు తీరును స్వయంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకాల వెరిఫికేషన్ వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇందులో ఆర్డీఓ కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి కె. జాషువా, MRO నాగార్జున పాల్గొన్నారు.
రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా నియామత్ పూర్‌లో భారీ విషాదం చోటుచేసుకుంది. ఓ పెళ్లి ఊరేగింపులోని డీజే వాహనం ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ లైన్‌కు తగలడంతో విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పిల్లలు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP: ఏకసభ్య కమిషన్ నియామకాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుబట్టారు. ఇది పూర్తిగా రాజకీయ ఎత్తుగడనేనని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కోరుకున్నట్లు సీబీఐ విచారణ జరగలేదని.. అందుకే రిటైర్డ్ అధికారితో కమిషన్ వేశారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టును అవమానించడమేనని పేర్కొన్నారు.
CTR: తిరుపతి నుంచి రంగంపేట, భీమవరం, కొత్తపేట, పులిచెర్ల మీదుగా కల్లూరుకు నూతనంగా ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు RTC అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రతి రోజు ఉదయం 10 గంటలకు తిరుపతి నుంచి బస్సు బయలుదేరి మధ్యాహ్నం 12:45కు కల్లూరుకు చేరుకుంటుందన్నారు. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి ఇదే మార్గంలో తిరుపతికి వెళుతుందన్నారు.
నెల్లూరు జిల్లాలో శెనగ పంటను క్వింటాలకు రూ. 5875 వేల మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని జేసీ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. రైతులు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2వ తేదీ లోపు తమ గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. తేమ శాతం 14% లోపు ఉన్న పంటను మాత్రమే సేకరిస్తామన్నారు. విక్రయించిన ఐదు రోజుల్లోనే నగదు జమ అవుతుందన్నారు.