TPT: పిచ్చాటూరు మండలంలోని జేబీఆర్ విద్యాసంస్థల్లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు “ఫీల్ ది థ్రిల్” నినాదంతో ఫేర్‌వెల్ వేడుకలు నిర్వహించారు. నాగలాపురం ఎస్సై సునీల్, ఎంఈవో-2 యుగంధర్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందజేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
TPT: సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలోని పునర్నిర్మిత శ్రీ అంకాలపరమేశ్వరి ఆలయంలో మహా కుంభాభిషేక వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం గణపతి పూజ, కంకణ ధారణ, యాగశాల కలశ స్థాపన నిర్వహించారు. సాయంత్రం వాస్తు పూజలు జరిపారు. మూడు రోజుల పాటు వేడుకలు కొనసాగనుండగా, ఆలయం దీపాలతో అలంకరించబడింది. భక్తులకు అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు.
పోక్సో కేసులో యూపీ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఓ మాజీ ఇంజినీర్ రామ్‌భావన్, ఆయన భార్యకు కోర్టు మరణశిక్ష విధించింది. 2010 నుంచి 33 మంది చిన్నారులను లైంగికంగా వేధించిన కేసులో ఈ తీర్పు వెలువరించింది. ఆ 33 మంది చిన్నారులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఇది అత్యంత అరుదైన కేసుగా పోక్సో ప్రత్యేక కోర్టు పేర్కొంది.
MDK: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త గోల్కొండ కిషన్ రావు దేశ్ముఖ్ గ్రామపంచాయతీ భవనం నిర్మాణం కోసం భూమిని దానంగా అందజేశారు. 20 ఏళ్లుగా గ్రామపంచాయతీ భవనం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రావు దేశ్ముఖ్ పేర్కొన్నారు. సర్పంచ్ జ్యోతి రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ చౌదరి శ్రీనివాస్, పూజారి రమణచార్యులు పాల్గొన్నారు.
AP: నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వేణు, వెంకటరమణను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.34.6 లక్షలు, ల్యాప్‌టాప్, టీవీ, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాల్లో ఉన్న రూ.కోటి 64 లక్షలను సీజ్ చేశారు. త్వరలోనే క్రికెట్ బెట్టింగ్ ముఠా నిర్వాహకులను పట్టుకుంటామని తెలిపారు.
కడప జిల్లాలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఆదేశించారు. జమ్మలమడుగు, పులివెందుల సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశాల్లో మహిళా భద్రత, సోషల్ మీడియా వేధింపులపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
VZM: ఎస్.కోట MLA కోళ్ల లలిత కుమారి శుక్రవారం వేపాడ, కొత్తవలస మండలాల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా ఆమె కొత్తవలసలో విజయ ఆంజనేయ విగ్రహ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోంపురం గ్రామంలో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి 5వ వార్షికోత్సవం, అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మన్యం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లాలో గల విద్యా సంస్థల్లో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బాలల సంరక్షణ అధికారి (NIC)ఎం.ఏ నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టౌన్‌లో గల డీవీఎం హైస్కూల్, బెలగాం గర్ల్స్ హై స్కూల్, పలు అంశాలపై అవగాహన కల్పించారు.
అల్లూరి జిల్లాలోని, గ్రామ పంచాయతీల్లో ఇంటింటా చెత్త సేకరణ కోసం స్వచ్ఛభారత్-స్వచ్ఛాంధ్రలో భాగంగా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి 4 ఈ-ఆటోలు, 25 ట్రై సైకిళ్లు జిల్లాకు వచ్చాయని అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ శుక్రవారం తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో ఆర్డీవో లోకేశ్వరరావు, స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు శాఖ జిల్లా నోడల్ అధికారి పీఎస్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు.
NZB: భీంగల్ మున్సిపల్ పట్టణంలో డ్రైనేజీలలో మురికి పేరుకుపోవడం వల్ల దోమల బెడద అధికమవుతోందని, దీనివల్ల ప్రజలు డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే డ్రైనేజీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పలు వార్డుల్లో చెత్త పేరుకుపోయి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రకాశం: పామూరులో శుక్రవారం వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దర్శి మోటార్ వాహనాల తనిఖీ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో పత్రాలు సరిగా లేని వాహనాలను పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న ఐదు ఎలక్ట్రిక్ ఆటోలకు పెనాల్టీ విధించి సీజ్ చేశారు. ఎంవీఐ రవికుమార్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.
విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ సినిమాతో మిథిలా పాల్కర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో ‘భూత్ బంగ్లా’లో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో ఆమె తన చెల్లెలి పాత్రలో కనిపిస్తుందని అక్షయ్ తెలిపాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మే 15న గ్రాండ్‌గా విడుదల కానుంది.
TG: మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలి తిమ్మాపూర్ గేటు వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆ తర్వాత పక్కనే వెళ్తున్న బైకును ఢీకొట్టాయి. బైకుపై వెళ్తున్న దంపతులకు కాళ్లు విరిగాయి. పరిస్థితి విషమంగా ఉంది. రెండు కార్లలో ఉన్న 11 మందికి తీవ్ర గాయాలుకాగా.. వారిని నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు.
HNK: క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ అన్నారు. వాగ్దేవి కళాశాల క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో క్రీడాకారులకు దిలీప్ రాజ్ టీ-షర్టులను అందజేశారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సరైన మార్గంలో ప్రయాణిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని దిలీప్ రాజ్ అన్నారు.
VSP: భారతీయ రైల్వే వాల్తేయిర్ డివిజన్ ఆధ్వర్యంలో వైశాఖి రైల్వే కాలనీలో నిర్మించిన అధికారుల కొత్త వసతి గృహాన్ని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా, జ్యోత్స్న బోహ్రా శుక్రవారం ప్రారంభించారు. నివాస సముదాయంలో నాలుగు టైప్–వీ, ఒక టైప్–VI క్వార్టర్ యూనిట్లు నిర్మించగా, సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసింది.