• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

ప్రభాస్‌కు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఇదే..!

‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విజయవాడలో దొరికే పునుగులు తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని ప్రభాస్ తెలిపాడు. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి పునుగులు తినేవాడినని పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడు బిజీగా ఉండటం వల్ల తినడం కుదరడం లేదని వ్యాఖ్యానించాడు.

February 20, 2026 / 07:12 PM IST

‘బందర్’ రిలీజ్ డేట్ ఫిక్స్

బాబీ డియోల్ హీరోగా, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బందర్’. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్‌గా ఈ ఏడాది మే 22న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ.. ‘మే 22న థియేటర్లలో కలుద్దాం’ అని పేర్కొన్నారు. ఈ సినిమాలో సన్యా మల్హోత్రా, రాజ్ బి శెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

February 20, 2026 / 06:47 PM IST

ప్రపంచ నంబర్ వన్ కంపెనీగా అమెజాన్..!

ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అమెజాన్ అవతరించిందని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ $717 బిలియన్ల అమ్మకాలు జరపగా, వాల్‌మార్ట్ $713.2 బిలియన్ల వద్ద నిలిచింది. గత దశాబ్దంలో వాల్‌మార్ట్ కంటే 10 రెట్లు వేగంగా ఆదాయాన్ని వృద్ధి చేసుకున్న అమెజాన్, రిటైల్ మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.

February 20, 2026 / 05:37 PM IST

‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం

‘పుష్ప-2’ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ సహా 23 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు తిప్పి పంపింది. ఆ ఛార్జ్‌షీట్‌లో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించిన కోర్టు.. హార్డ్ డిస్క్‌లు, సీడీలు, పెన్ డ్రైవ్‌ల వంటి సాంకేతిక ఆధారాలను జతపరచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

February 20, 2026 / 05:12 PM IST

బాలీవుడ్‌లోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ..!

ప్రముఖ నటి మీనాక్షి చౌదరి బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్, గోవిందా, పరేష్ రావల్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘భాగమ్ భాగ్’కు సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమాలో మీనాక్షితో పాటు నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు రాజ్ శాండిల్య దర్శకత్వం వహించనున్నాడు.

February 20, 2026 / 04:53 PM IST

చీటింగ్ కేసు.. శిల్పాశెట్టి భర్తకు బెయిల్‌

బిట్‌కాయిన్ మోసం కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాకు ఊరట లభించింది. ఆయనకు ముంబైలోని PMLA కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భారీ స్థాయిలో క్రిప్టో కరెన్సీ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇవాళ ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ విధంగా తీర్పునిచ్చింది.

February 20, 2026 / 04:40 PM IST

కొత్త ప్రాజెక్టుపై రామ్ పోతినేని ఫోకస్..!

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దర్శకుడు కిషోర్ తిరుమల వద్ద ఒక కథను తీసుకున్న రామ్.. మరో కథను కూడా అభివృద్ధి చేస్తున్నాడట. రైటింగ్ టీంతో కలిసి స్వయంగా కథా చర్చల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. సొంత బ్యానర్‌పై కొత్త దర్శకుడితో సినిమాను నిర్మించే ఆలోచనలో రామ్ ఉన్నట్లు తెలుస్తోంది.

February 20, 2026 / 04:02 PM IST

ఎన్టీఆర్, నీల్ మూవీకి టైటిల్ ఖరారు!

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో మూవీ టైటిల్‌పై ఉత్కంఠ నెలకొంది. మొదట ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే పేరు పెట్టినట్లు వార్తలు వినిపించగా.. తాజాగా ‘బ్రూస్లీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారట. అయితే, గతంలో రామ్ చరణ్ ‘బ్రూస్లీ’ మూవీ ఆశించిన విజయం సాధించకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ, పాన్ ఇండియా స్థాయిలో ఈ పేరు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్...

February 20, 2026 / 03:26 PM IST

విక్రమ్ ‘మహాన్‌’కు సీక్వెల్ ప్లాన్!

తమిళ హీరో విక్రమ్, ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ కలిసి నటించిన మూవీ ‘మహాన్’. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా OTTలో రిలీజై మంచి హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌పై దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ.. ఈ సీక్వెల్ కోసం తన దగ్గర ఐడియా ఉందన్నాడు. కానీ స్క్రిప్ట్ ఇంకా ప్రారంభ దశలో ఉందని, 2027-28 నాటికి ఇది విడుదలయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు.

February 20, 2026 / 03:16 PM IST

‘ఎల్లమ్మ’ కోసం నెలలో 10 రోజులు పనిచేస్తా: DSP

‘ఎల్లమ్మ’ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీపై DSP ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంగీత దర్శకుడిగా అత్యంత బిజీగా ఉన్నప్పటికీ.. ఈ మూవీ కోసం నెలలో కేవలం 10 రోజులు పనిచేస్తానని చెప్పాడు. అందుకోసం నిర్మాత దిల్ రాజుతో ప్రత్యేక ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపాడు. ఇక ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.

February 20, 2026 / 03:00 PM IST

నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం: ప్రభాస్

అభిమానుల కోసం ఏడాదికి 3-4 మూవీలు చేస్తున్నా, ఒక్కటే విడుదలవుతోందని ప్రభాస్ అన్నాడు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రబృందంతో ముచ్చటించిన ఆయన.. తనకు అన్ని జానర్లు ఇష్టమని, ముఖ్యంగా మణిరత్నం అంటే ప్రత్యేకమైన అభిమానమని తెలిపాడు. ‘గీతాంజలి’ అంటే తనకెంతో ఇష్టమని, ‘కపుల్ ఫ్రెండ్లీ’ చూసినప్పుడు ఆ మూవీ ఫీల్ కలిగిందన్నాడు. అందుకే దీన్ని నాలుగు సార్లు చూడాలని నిర్ణయించుకున్నానని...

February 20, 2026 / 02:53 PM IST

చెన్నై నుంచి ముంబైకి ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టిన ప్రభాస్

‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రబృందంతో ముచ్చటించిన ప్రభాస్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను అప్పుడప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతానని చెప్పాడు. ‘ఆదిపురుష్’ షూటింగ్ ముంబై‌లో జరుగుతున్నప్పుడు చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్ చేశానని, టీం అంతా షాక్ అయిందని అన్నాడు. ఫ్లైట్‌లో ఆర్డర్ తీసుకొచ్చిన వ్యక్తి ‘మీరు మాములు వాళ్లు కాదండి అన్నాడు’ అని చెప్పాడు.

February 20, 2026 / 02:06 PM IST

మెగాస్టార్‌తో నాగ్ అశ్విన్ మూవీ..?

‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక భారీ కథను సిద్ధం చేశాడట. ఇది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి సీక్వెల్ లేదా పక్కా మైథలాజికల్ డ్రామా అని టాక్ నడుస్తోంది. వైజయంతీ మూవీస్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, తెలుగు సినిమాలో మరో అద్భుత దృశ్యకావ్యం ఖాయమని సినీ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

February 20, 2026 / 01:56 PM IST

‘కల్కి 2’ షూటింగ్ ప్రారంభం..!

‘కల్కి 2’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ‘కల్కి 2’ షూటింగ్ హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇప్పటికే సెట్స్‌లో అడుగుపెట్టగా.. ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభాస్, సాయి పల్లవి కూడా ఈ షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు టాక్.

February 20, 2026 / 01:47 PM IST

మిస్టిక్‌ థ్రిల్లర్‌ కథతో కళ్యాణ్ రామ్..!

ఓ విభిన్నమైన మిస్టిక్ థ్రిల్లర్‌ కథతో నందమూరి కళ్యాణ్ రామ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రచయిత శ్రీకాంత్ విస్సా ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడట. ఇప్పటికే కథా చర్చలు పూర్తి కాగా.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు టాక్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీని త్వరలోనే పట్టాలెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

February 20, 2026 / 12:39 PM IST