నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ‘ఆయిల్ పుల్లింగ్’ ఒక అద్భుతమైన మార్గం. ప్రతిరోజూ బ్రష్ చేయడానికి ముందు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని 10 నిమిషాల పాటు పుక్కిలించి ఊసేయాలి. ఇది నోటిలోని హానికర బ్యాక్టీరియాను తొలగించి, దంతాలను దృఢంగా మారుస్తుంది. చిగుళ్ల సమస్యలను దూరం చేయడమే కాకుండా నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది.
అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తూ.. ఓ తెలుగమ్మాయి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఛానెల్ ‘హౌస్ అంబాసిడర్’గా హైదరాబాద్‌కు చెందిన భవితా మండవ నియమితురాలయ్యారు. మార్గోట్ రాబీ, జెన్నీ కిమ్ వంటి అంతర్జాతీయ స్టార్ల సరసన ఒక భారతీయురాలు ఈ గౌరవాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
వేసవి ఎండల నుండి ఉపశమనం పొందేందుకు పర్యాటకులు కర్ణాటకలోని కూర్గ్ వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. భారతదేశపు స్కాట్లాండ్‌గా పిలిచే ఈ ప్రాంతం, అందమైన కాఫీ తోటలు, జలపాతాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. చల్లని వాతావరణం ఉండటం వల్ల కుటుంబంతో గడపడానికి ఇది అనువుగా ఉంటుంది. HYD నుంచి బెంగళూరు మీదుగా రోడ్డు మార్గంలో ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.
కొన్ని చిట్కాలతో మెడ నొప్పిని తగ్గించుకోవచ్చు. కూర్చున్నప్పుడు వెన్నుముక నిటారుగా ఉంచాలి. ఫోన్ చూసేటప్పుడు మెడను మరీ వంచకూడదు. మెడను నెమ్మదిగా అటు ఇటు తిప్పుతూ స్ట్రెచెస్ చేయాలి. పడుకునేటప్పుడు సౌకర్యవంతమైన మెత్తని దిండును ఎంచుకోవాలి. కంప్యూటర్ ముందు పనిచేసేవారు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకుంటే బెటర్. నొప్పి తీవ్రంగా ఉంటే ఐస్ ప్యాక్ లేదా వేడి కాపడం పెట్టాలి.
పిల్లల ఎత్తు పెరగడానికి పోషకాహారం, వ్యాయామం చాలా ముఖ్యం. స్ట్రెచింగ్, కాలి వేళ్లను తాకడం, వెన్నెముకకు ఫ్లెక్సిబిలిటీని ఇచ్చే సైడ్ బెండ్స్ వంటివి పిల్లలు ఎత్తు పెరగడంలో బాగా పనిచేస్తాయి. బార్ హ్యాంగింగ్, పులప్స్, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్ వల్ల కండరాలు సాగి ఎత్తు పెరుగుతారు. వీటితో పాటు విటమిన్ డి, సీజనల్ పండ్లు, ఆకుకూరలు వంటి సమతుల్య ఆహారం పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
ఒత్తిడి కారణంగా అధికంగా ఆహారం తీసుకోవడం (స్ట్రెస్ ఈటింగ్) తీవ్ర అనారోగ్యాలకు దారి తీస్తుంది. దీనివల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరిగి బరువు పెరగడం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. ఇది జీర్ణక్రియను దెబ్బతీయడమే కాకుండా నిద్రలేమి, ఆందోళన వంటి మానసిక సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి మానసిక ప్రశాంతత, సరైన ఆహారపు అలవాట్లు ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
జపాన్ పరిశోధనల ప్రకారం, కోకోలో ఉండే ఫ్లావనాల్స్ మెదడుకు రక్త ప్రసరణను, ఆక్సిజన్‌ను పెంచుతాయి. ఇది మీ ఏకాగ్రతను పెంచి, నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే మానసిక అలసటను తగ్గిస్తుంది. రోజుకు మూడు చెంచాల కోకో పౌడర్‌ను పాలు లేదా నీటిలో కలిపి తాగడం వల్ల మీ మెదడు మరింత చురుగ్గా, ఉల్లాసంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
హిందూ ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఒంటరిగా వదలకూడదు. ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించే ప్రమాదం ఉందని గరుడ పురాణం చెబుతోంది. మృతదేహం నుంచి వచ్చే ఒక రకమైన వాసనకు చీమలు, కీటకాలు లేదా ఎలుకలు వంటివి త్వరగా ఆకర్షితమవుతాయి. అలాగే ఆత్మ తన శరీరాన్ని చూస్తూ అక్కడే తిరుగుతుందని, అందరూ తన పక్కన ఉండటం వల్ల ఆ ఆత్మకు ప్రశాంతత లభిస్తుందని చెబుతారు.
TG: నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. ఈ మూడు రోజుల పాటు 12PM నుంచి 3pm వరకు అత్యవసరం అయితే తప్ప, బయటకు రావద్దని తెలిపింది. దాహం వేయకపోయినా ప్రజలు తరచూ నీళ్లు తాగాలని స్పష్టం చేసింది.
మనిషి తన జీవితంలో డబ్బు కంటే తన ‘శీలాన్ని’ (క్యారెక్టర్) జాగ్రత్తగా కాపాడుకోవాలని విదురుడు బోధించారు. ధనం ఈరోజు వస్తుంది, రేపు పోతుంది.. పోయిన డబ్బును మళ్లీ కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ ఒకసారి చేజారిన నడవడిక, పోయిన పరువు మళ్లీ తిరిగి రావు. డబ్బు లేనివాడు ఎప్పటికీ పేదవాడు కాదు, కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోయినవాడు జీవితంలో సర్వస్వం కోల్పోయినట్టే లెక్క అని విదురుడు చెప్పారు.
TG: స్నానం చేయడం అనేది కేవలం ఒంటిని శుభ్రం చేసుకోవడమే కాదు, మన దేశంలో స్నానానికి ఒక పవిత్రమైన స్థానం ఉంది. పురాణాల ప్రకారం ఉదయాన్నే స్నానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుందని నమ్ముతాం. దీనికి తోడు భారత్ ఒక ఉష్ణమండల దేశం. రాత్రి నిద్రలో మనకు విపరీతంగా చెమట పడుతుంది. అందుకే ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అలసట పోయి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి వీలవుతుంది.
తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి అత్యవసరం. ఒక వ్యక్తి రోజుకు సగటున 3-4 లీటర్ల నీరు తాగాలి. వేసవీలో శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముంటుంది. నీరు తక్కువైతే అలసట, తలనొప్పి వస్తాయి. పని ఒత్తిడిలో మర్చిపోకుండా ఉండటానికి వాటర్ బాటిల్ ఎప్పుడూ కంటికి కనిపించేలా ఉంచుకోండి. తాగాలనిపించకపోయినా తరచూ కొన్ని నీళ్లు తాగండి. ఇప్పుడే ఒక చిన్న సిప్ వేయండి.
వేసవికాలంలో తాటిముంజలు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఈ ముంజలు శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంతోపాటు.. వడదెబ్బ, డీహైడ్రేషన్ నుంచి బయటపడేస్తాయి. ముంజల్లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఎ, సి, ఇ, కె లతో పాటు ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.
వేసవిలో ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముంది. చెమట ద్వారా శరీరం నుంచి నీరు, లవణాలు తగ్గి అలసట, నీరసం, తలతిరగడం, తీవ్రమైన దాహం వంటి సమస్యలు కలుగుతాయి. ఈ సమస్యలను నివారించడానికి తగినంత నీరు, కొబ్బరి నీళ్లు తాగడం చాలా ముఖ్యం. వీటితో పాటు పుచ్చకాయ జ్యూస్, మామిడి జ్యూస్, నిమ్మరసం, మజ్జిగ, నారింజ జ్యూస్, దానిమ్మ జ్యూస్ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.