• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

10 నిమిషాలకోసారి మూత్ర విసర్జనకు వెళ్తున్నారా?

ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మూత్రవిసర్జన చేయడం సాధారణం కాదు. ఇది UTI, మధుమేహం, అతి చురుకైన మూత్రాశయం (OAB) లేదా ప్రాస్టేట్ సమస్య కావచ్చు. మూత్రంలో మంట, నొప్పి లేదా రక్తం, వెన్నునొప్పి.. జ్వరం లేదా చలి.. మూత్రం ఆపుకోలేకపోవడం, రాత్రిపూట 3 నుంచి 4 సార్ల కంటే ఎక్కువ నిద్రలేవడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.

March 27, 2026 / 11:26 AM IST

ఉదయాన్నే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా?

ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరంగా అనిపించడం సాధారణ సమస్య. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, మసాలా ఎక్కువగా తినడం, తగినంత నీరు తాగకపోవడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఇది జరుగుతుంది. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే గ్యాస్ తక్కువ అవుతుంది. కప్పు వేడి నీటిలో సోంపు గింజలు మరిగించి వడకట్టి తాగడం వల్ల కడుపు తేలికగా అనిపిస్తుంది.

March 27, 2026 / 08:23 AM IST

ఉదయాన్నే గుడ్లు తింటున్నారా?

కొందరు ప్రతి ఉదయం గుడ్లను తప్పనిసరిగా తీసుకుంటారు. ఇది ఎంతో మంచి ఆహారపు అలవాటు అని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ప్రొటీన్, విటమిన్లు, మినరల్స్‌తో నిండిన గుడ్లను ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. జీవక్రియ, రోగనిరోధక శక్తి, మెడదు పనితీరుకు మేలు చేస్తుందట. అయితే ఉదయం వేళ 2 గుడ్లకు మించి తీసుకోవద్దని సూచిస్తున్నారు.

March 27, 2026 / 08:20 AM IST

కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగుతున్నారా?

పచ్చి కొబ్బరి నీళ్లలో పోషకాలు అధికమని, ముదిరిన కాయల కంటే ఇవే మేలని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం తీసిన పదిహేను నిమిషాల్లోపు తాగితేనే విటమిన్-సి అందుతుందని, ఆలస్యమైతే గుణాలు తగ్గుతాయని తెలిపారు. ఇక అసిడిటీ, పేగుల్లో మంట ఉన్నవారు పుల్లని మజ్జిగకు దూరంగా ఉండటం మంచిది. వేసవి ఆరోగ్య రక్షణ కోసం ప్రజలు ఈ కనీస జాగ్రత్తలు పాటించాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

March 26, 2026 / 09:37 PM IST

నిద్ర పట్టడం లేదా..?

ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు. దీనికి ప్రధాన కారణం పడుకునే ముందు మొబైల్ వాడటం. ప్రశాంతమైన నిద్ర కోసం ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, గదిలో చీకటిగా ఉంచుకోవడం ఉత్తమం. రాత్రి పూట కాఫీ, టీలకు దూరంగా ఉండటం ముఖ్యం. శ్వాస వ్యాయామాలు, ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతపడి త్వరగా నిద్ర పడుతుంది. నిద్రలేమితో తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది.

March 26, 2026 / 09:23 PM IST

పచ్చి కూరగాయలు తింటున్నారా..?

పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి మంచివేనా? అనేదానిపై చాలా మందికి సందేహాలుంటాయి. ముడి కూరగాయలలో గట్టి ఫైబర్‌ ఉంటుంది. ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, ఎసిడిటీ, కడుపునొప్పికి దారితీయొచ్చు. అయితే బంగాళాదుంపలు, వంకాయలు, క్యాప్సికం, బ్రకోలి, క్యాలీఫ్లవర్, పాలకూర, కొన్ని చిక్కుడు జాతి కూరగాయలను పచ్చిగా తినడకూడదు.

March 26, 2026 / 08:12 PM IST

ఈ అలవాట్లతో.. జుట్టు ఆరోగ్యం..!

జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఉదయాన్నే టీ, కాఫీలకు బదులు నీళ్లు తాగాలి. అల్పాహారంలో ప్రొటీన్లు (గుడ్లు, పెరుగు, నట్స్) ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం, యోగా రక్తప్రసరణను పెంచుతాయి. వారానికి రెండుసార్లు నూనెతో మర్దన చేయాలి. జుట్టు రాలకుండా ఉండాలంటే చెక్క దువ్వెన, మృదువైన శాటిన్ రబ్బర్ బ్యాండ్లు వాడటం, వదులుగా జడ వేసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి.

March 26, 2026 / 05:36 PM IST

గర్భిణీలు రోజుకు ఉప్పు ఎంత తీసుకోవాలి? 

గర్భిణీలు ఆహారంలో ఉప్పు మోతాదుపై శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 3.8 నుంచి 5.8 గ్రాముల ఉప్పు తీసుకోవడం ఉత్తమం. అంతకు మించి ఉప్పు తీసుకుంటే శరీరంలో నీరు చేరి కాళ్లు, చేతుల వాపులు, బీపీ వంటి సమస్యలు తలెత్తుతాయి. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం సమతుల్యంగా ఉప్పు తీసుకోవడం ఎంతో అవసరమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

March 26, 2026 / 02:37 PM IST

ఆపిల్ తింటే షుగర్ తగ్గుతుందా?

బ్లడ్ షుగర్ కంట్రోల్‌కు ఆపిల్ పండు బాగా ఉపయోగపడుతుంది. ఒక మీడియం ఆపిల్‌లో సుమారు 25 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నా.. ఇందులో ఫైబర్ దాదాపు 4 గ్రాములు ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల షుగర్ రక్తంలోకి నెమ్మదిగా వెళ్తుంది. అందుకే ఆపిల్ తిన్న తర్వాత బ్లడ్ షుగర్ స్పైక్ తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు రోజుకు 1 మీడియం ఆపిల్ తీసుకోవచ్చు. తొక్కతో పాటు నమిలి తింటే ఇంకా మంచిది.

March 26, 2026 / 02:10 PM IST

నీరసం తగ్గించే సలాడ్‌!

ఎండ తీవ్రతకు శరీరం డీహైడ్రేట్ కాకుండా క్యారెట్, దోస, టొమాటో, క్యాప్సికం వంటి కూరగాయల సలాడ్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. నిమ్మరసం, మిరియాల పొడి కలిపి తీసుకుంటే రుచితో పాటు రక్తహీనత తగ్గి శరీరం రిఫ్రెష్ అవుతుంది.

March 26, 2026 / 12:09 PM IST

కీరదోసతో ఆరోగ్య ప్రయోజనాలు

కీరదోసకాయ శరీరానికి హైడ్రేషన్, చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువ, ఫైబర్, విటమిన్ K, C అధికంగా ఉంటాయి. ఇది బరువును నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలోని విషతుల్యాలను తొలగించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. కళ్ల వాపును తగ్గించడమే కాకుండా, ఎముకలను దృఢపరుస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

March 26, 2026 / 09:58 AM IST

భరద్వాజాసనం వల్ల కలిగే ఉపయోగాలు

భరద్వాజాసనం వెన్నెముకను బలోపేతం చేసి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే యోగాసనం. పొత్తికడుపు అవయవాలను ప్రేరేపించడం, ఛాతీని విస్తరించడం ద్వారా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. నడుము నొప్పి, సయాటికా నరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. తీవ్రమైన వెన్నునొప్పి లేదా వెన్నెముక సమస్యలు ఉన్నవారు యోగా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఈ ఆసనం వేయాలి.

March 26, 2026 / 06:40 AM IST

ఈ పరీక్షలు చేయించుకోండి!

గుండె ఆరోగ్యాన్ని ముందుగానే అంచనా వేసేందుకు రెగ్యులర్ స్క్రీనింగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పరీక్షల ద్వారా ప్రమాద సూచకాలను తొందరగా గుర్తింవచ్చు. బీపీ, లిపిడ్ ప్రొఫైల్, హెచ్ బీఏ1సీ, ఎల్డీఎల్, హెచ్డీఎల్ టెస్టులు చేయించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు.

March 25, 2026 / 09:53 PM IST

ALERT: పండ్ల రసాలు తాగుతున్నారా? 

పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే బయట విక్రయించే ప్యాక్ చేసిన జ్యూస్‌ల్లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరగడం, మధుమేహం వంటి సమస్యలకు దారితీయవచ్చు. పండ్లను రసంగా తాగడం కంటే, పండ్లను అలాగే తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఇవి ఊబకాయం, డయాబెటిస్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

March 25, 2026 / 09:12 PM IST

రక్తహీనత తగ్గించడంలో పాలకూర కీలకం

పాలకూరలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, శరీరానికి స్టామినా పెరగడంలో పాలకూరలోని పోషకాలు సహాయపడతాయి. తరచుగా పాలకూర తీసుకునే వారికి అలసట తగ్గి శరీరానికి బలం పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడటానికి, జుట్టు బలంగా ఉండేందుకు కూడా పాలకూరలోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.

March 25, 2026 / 12:40 PM IST