• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

ఈ పరీక్షలు చేయించుకోండి!

గుండె ఆరోగ్యాన్ని ముందుగానే అంచనా వేసేందుకు రెగ్యులర్ స్క్రీనింగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పరీక్షల ద్వారా ప్రమాద సూచకాలను తొందరగా గుర్తింవచ్చు. బీపీ, లిపిడ్ ప్రొఫైల్, హెచ్ బీఏ1సీ, ఎల్డీఎల్, హెచ్డీఎల్ టెస్టులు చేయించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు.

March 25, 2026 / 09:53 PM IST

ALERT: పండ్ల రసాలు తాగుతున్నారా? 

పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే బయట విక్రయించే ప్యాక్ చేసిన జ్యూస్‌ల్లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో బరువు పెరగడం, మధుమేహం వంటి సమస్యలకు దారితీయవచ్చు. పండ్లను రసంగా తాగడం కంటే, పండ్లను అలాగే తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఇవి ఊబకాయం, డయాబెటిస్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

March 25, 2026 / 09:12 PM IST

రక్తహీనత తగ్గించడంలో పాలకూర కీలకం

పాలకూరలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, శరీరానికి స్టామినా పెరగడంలో పాలకూరలోని పోషకాలు సహాయపడతాయి. తరచుగా పాలకూర తీసుకునే వారికి అలసట తగ్గి శరీరానికి బలం పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడటానికి, జుట్టు బలంగా ఉండేందుకు కూడా పాలకూరలోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి.

March 25, 2026 / 12:40 PM IST

కేశ సంరక్షణ.. మీ డైట్‌లో ఇవి ఉన్నాయా?

శరీరానికి అవసరమైన పోషకాలు లభించకున్నా లేదా పోషక లోపం తలెత్తినా.. ఆ ప్రభావం జుట్టుపై పడి వెంట్రుకలు రాలిపోతాయి. కురులు ఒత్తుగా, దృఢంగా, మెరుస్తూ ఉండాలంటే రోజువారీ ఆహారంలో విటమిన్ ఇ, డి, సి, బి-కాంప్లెక్స్‌తో పాటు ప్రోటీన్లు కలిగిన ఆహారాలు తీసుకోవాలి. ఇందుకోసం నిత్యం తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

March 25, 2026 / 11:30 AM IST

వేసవి తాపానికి ఉపశమనం

వేసవిలో శరీరాన్ని చల్లబరిచి, తక్షణ శక్తిని ఇచ్చేందుకు గంజి ఒక అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. గంజి శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ను పునరుద్ధరిస్తే, రాగి గంజి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచి వడదెబ్బ తగలకుండా రక్షిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి సామల గంజి, శరీర వేడిని తగ్గించుకోవడానికి సజ్జ అంబలి సరైన ఎంపికలు. ఇవి నీరసాన్ని దూరం చేసి, మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి.

March 25, 2026 / 10:54 AM IST

నల్ల టమోటాలు.. ఉపయోగాలు తెలుసా?

నల్ల టమోటాల్లో ‘ఆంతోసైనిక్స్’ అనే యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సాయపడుతాయి. శరీరంలోని కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. వీటిలోని విటమిన్ ఎ, బీటా కెరోటిన్.. కంటి చూపును మెరుగుపరుస్తాయి. రేచీకటి వంటి సమస్యలు రాకుండా చూస్తాయి. డిజిటల్ స్క్రీన్ల ముందు ఎక్కువగా గడిపే వారికి ఈ టమోటాలు వరం.

March 25, 2026 / 09:28 AM IST

వేసవిలో ఏ సమయంలో వాకింగ్ చేయాలి?

వేసవిలో ఉ.5 నుంచి 7 గంటల మధ్య లేదా సా.6 నుంచి 8 గంటల మధ్య వాకింగ్ చేయాలి. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్, హీట్‌స్ట్రోక్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఉదయం గాలి తాజాగా ఉండి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉ.10 నుంచి మ.4 గంటల వరకు నడవడం ప్రమాదకరం. నడక ప్రారంభించే వారు మొదటి రోజు 20 నుంచి 30 నిమిషాలకు పెంచుకోవాలి. క్రమంగా 30 నుంచి 60 నిమిషాలకు పెంచుకోవాలి.

March 25, 2026 / 08:26 AM IST

మంచిమాట: అప్పవరకూ ఎవరూ పట్టించుకోరు

‘నేనెంతో కష్టపడుతున్నాను.. అయినా నా శ్రమను ఎవరూ గుర్తించడం లేదు’ అని బాధితుడి తరహాలో ఆలోచించే దోరణిని ఆపేయండి. మీరెంత కష్టపడుతున్నారనేది ఎవరికీ అవసరం లేదు. మీ గెలుపు దారిని కనుక్కోవాల్సింది మీరే. విజయ శిఖరాన్ని అధిరోహించే వరకూ మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.

March 25, 2026 / 08:15 AM IST

కౌండిన్యాసనం వల్ల కలిగే ఉపయోగాలు

కౌండిన్యాసనం అనేది చేతులు, వెన్నుముకను బలోపేతం చేసే ఒక సవాలుతో కూడిన యోగాసనం. ఇది ఏకాగ్రతను, సూక్ష్మదృష్టిని పెంచడంలో సహాయపడుతుంది. చేతులపై శరీర బరువును మోపే కష్టమైన ఆసనాలలో ఒకటి. శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఇది నటరాజాసనం, మయూరాసనం వంటి కష్టమైన యోగాసనాల జాబితాలో ఉంటుంది. కౌండిన్యాసనం వేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ముందుగా యోగా నిపుణుల పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేయడం మంచిది.

March 25, 2026 / 07:14 AM IST

మందులు అక్కర్లేదు.. ఈ అలవాట్లు చాలు

వయసుతో పాటు వచ్చే మలబద్ధకం సమస్యకు ప్రతిసారి మందులు వాడాల్సిన పనిలేదు. రోజూ సరిపడా నీరు తాగడం, ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు తీసుకోవడం, పెరుగు వంటి ప్రోబయోటిక్స్ తినడం వల్ల పేగుల ఆరోగ్యం సహజంగా మెరుగుపడుతుంది. ఈ చిన్న మార్పులు జీర్ణక్రియను సాఫీగా మార్చి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, ప్రకృతి సిద్ధమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి.

March 25, 2026 / 06:32 AM IST

నిమ్మకాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

నిమ్మకాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. కిడ్నీలో రాళ్ల నివారణకు ఉపయోగపడుతుంది.

March 24, 2026 / 01:30 PM IST

జంక్‌ ఫుడ్స్‌ మానలేకపోతున్నారా?

జంక్ ఫుడ్స్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. రోజూ తగినంత నీరు తాగడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా, తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినాలి. గుడ్లు, పాలు, బాదం, వాల్‌నట్స్, పండ్లు వంటి ఆరోగ్యకరమైనవి తీసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.

March 24, 2026 / 12:58 PM IST

సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు ప్రకటన

దక్షిణాఫ్రికాతో జరగనున్న 5 మ్యాచుల T20 సిరిస్‌కు భారత మహిళల జట్టును BCCI ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది. హర్మన్‌ప్రీత్(C), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా, దీప్తి శర్మ, రిచా ఘోష్, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీచరణి, శ్రేయాంక పాటిల్, కాశ్వి గౌతమ్, భారతీ ఫుల్మాలి, ఉమా ఛెత్రి, అనుష్క శర్మ.

March 24, 2026 / 11:00 AM IST

బ్రౌన్ బ్రెడ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు

బ్రెౌన్ బ్రెడ్ గోధుమ పిండితో తయారవ్వడం వల్ల ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం వంటి పోషకాలు ఉండి రోజంతా ఉత్సాహంగా ఉంచేలా శక్తిని అందిస్తాయి.

March 24, 2026 / 10:40 AM IST

వేసవిలో మహిళలు తస్మాత్ జాగ్రత్త

వేసవిలో శరీరానికి తగినన్ని నీళ్లు తీసుకోకపోతే మహిళలు డీహైడ్రేషన్ సమస్యతో పాటు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్(UTI)కి గురయ్యే అవకాశం ఉందని అధ్యయనంలో తేలింది. దీని నుంచి బయటపడాలంటే రోజూ పండ్ల రసాలు, సూపుల వంటి వాటితో పాటు మొత్తం 8 గ్లాసుల ద్రవ పదార్థాలను తీసుకోవాలి. మజ్జిగ తాగితే ఫలితం ఉంటుంది. పుచ్చకాయ, నారింజ, విటమిన్-సి అధికంగా ఉండే పండ్లతో UTI సమస్యను అధిగమించవచ్చు.

March 24, 2026 / 10:28 AM IST