• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

మరోసారి పెళ్లి చేసుకోనున్న విజయ్, రష్మిక

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం హిందూ, కొడవ సంప్రదాయాల్లో ఘనంగా జరుగుతోంది. ఈ రోజు ఉదయం హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుక ముగియగా, సాయంత్రం 4:30 గంటలకు రష్మిక కుటుంబ ఆచారం ప్రకారం ‘కొడవ’ సంప్రదాయంలో మరోసారి వివాహం జరగనుంది. ఈ కొత్త జంట వెడ్డింగ్ రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

February 26, 2026 / 12:02 PM IST

శ‌ర‌వేగంగా ‘కల్కి 2’ షూటింగ్

ప్రభాస్, నాగ్ అశ్విన్‌ల ‘కల్కి 2’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. HYDలోని శంకర్ పల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతోన్న షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొన్నారు. వారిద్దరూ ఉదయం నుంచి రాత్రి 9 గంటలకు చిత్రీకరణలో పాల్గొంటున్నారట. ఎక్కడా అలసట లేకుండా వారు చూపిస్తున్న డెడికేషన్‌కు యూనిట్ సభ్యులు షాక్ అవుతున్నారట. ఇక ఈ షెడ్యూల్ మార్చి 12 వరకు కొనసాగనుంది.

February 26, 2026 / 11:58 AM IST

‘బ్లడీ రోమియో’ కోసం సుజీత్ భారీ ప్లాన్..!

నాని, దర్శకుడు సుజీత్ కాంబోలో రాబోతున్న ‘బ్లడీ రోమియో’పై క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం కోసం ముగ్గురు సంగీత దర్శకులను తీసుకోవాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నాడట. యాక్షన్, రోమాన్స్, డ్రామా ఎమోషన్స్‌కు తగ్గట్టుగా ఒక్కో విభాగానికి ఒక్కో స్పెషలిస్ట్‌ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. నాని కెరీర్‌లోనే ఇలా మల్టీపుల్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయడం విశేషం.

February 26, 2026 / 11:30 AM IST

చిరంజీవితో ఇలాంటి సినిమా సాహసమే: పరుచూరి

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. కేవలం కామెడీతో చిరంజీవితో సినిమా తీయడం సాహసమని, తొలి సీన్‌లోనే పాత్రను పరిచయం చేసిన తీరు బాగుందని మెచ్చుకున్నారు. ఈ చిత్రం రూ.400 కోట్లు వసూలు చేసి, కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కావడమే దీని విజయానికి నిదర్శనమని, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారని తెలిపారు.

February 26, 2026 / 11:15 AM IST

కళ్యాణ్ రామ్ తరువాతి ప్రాజెక్ట్‌పై క్రేజీ UPDATE

నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి ప్రాజెక్టును దర్శకుడు శ్రీకాంత్ విస్సాతో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబో ఇప్పటికే లాక్ అయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2026 ద్వితీయార్థంలో ప్రారంభం కానుందట. అదే ఏడాది చివరి నాటికి సినిమాను థియేటర్లలో విడుదల చేసేలా మేకర్స్ పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతున్నట్లు సమాచారం.

February 26, 2026 / 10:26 AM IST

ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలకు తెరదించుతూ, రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ మూవీలతో మెప్పించిన ఈ జంట, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒక్కటి అవ్వడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

February 26, 2026 / 10:20 AM IST

ప్రభాస్, బుచ్చిబాబు కాంబోలో మూవీ..!

రామ్ చరణ్‌తో ‘పెద్ది’ మూవీ చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబు, తన తదుపరి మూవీని రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేయనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం బుచ్చిబాబు ఇప్పటికే ఒక సాలిడ్ పాన్ ఇండియా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ఖాయం.

February 26, 2026 / 09:59 AM IST

నటి రన్యా రావుకు మరిన్ని చిక్కులు

ప్రముఖ నటి రన్యా రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రూ.102 కోట్ల విలువైన భారీ బంగారం స్మగ్లింగ్ కేసులో ఆమెపై ఈడీ సంచలన ఆరోపణలు చేస్తూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏడాది కాలంలో సుమారు 127 కిలోల బంగారాన్ని అక్రమంగా భారత్‌కు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.

February 26, 2026 / 09:54 AM IST

OTTలోకి వచ్చేస్తోన్న కొత్త మూవీ

నటి దివ్య శ్రీపాద, అభయ్ నవీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిన్న బడ్జెట్ రొమాంటిక్ డ్రామా ‘చరిత కామాక్షి’. 2021లో ప్రకటించిన ఈ చిత్రం ద్వారా శ్రీలంక చందు సాయి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘’ఈటీవీ విన్’లో మార్చి 5, 2026 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

February 26, 2026 / 09:33 AM IST

ఓటీటీలోని వచ్చేసిన ‘శ్రీచిదంబరంగారు’

వంశీ తుమ్మల, సంధ్య వశిష్ఠ జంటగా వినయ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీచిదంబరంగారు’. ఈనెల 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇవాళ్టి నుంచి ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. దర్శకుడు వేణు ఈ సినిమాపై మాట్లాడుతూ ‘నిజమైన వైకల్యం అంటే శరీరానికి ఉన్నది కాదు, వ్యక్తిత్వం లేకపోవడమే అని ఈ సినిమాలో హృద్యంగా చూపించారు’ అని పేర్కొన్నారు.

February 26, 2026 / 08:57 AM IST

‘వందశాతం నవ్వుకుంటారు.. నాదీ గ్యారంటీ’

శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటించిన ‘విష్ణు విన్యాసం’ రేపు విడుదల కానుంది. యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 100% వినోదాన్ని పంచుతుందని, ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవచ్చని శ్రీవిష్ణు ధీమా వ్యక్తం చేశాడు. ఫస్టాఫ్ యువతకు, సెకండాఫ్ కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని చిత్రబృందం తెలిపింది. ఈ మూవీలో విష్ణు విన్యాసాలు బాగుంటాయని నిర్మాత తెలిపారు.

February 26, 2026 / 08:26 AM IST

నాగచైతన్య ‘వృషకర్మ’ అప్‌డేట్

నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘వృషకర్మ’. నిధి అన్వేషకుడైన ‘అర్జున్’ పాత్రలో చైతూ కనిపిస్తాడని సమాచారం. మార్చి 5న ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

February 26, 2026 / 08:14 AM IST

ఆర్థిక సూత్రాలు చెబుతున్న తమన్నా

నటి తమన్నా తన ఆర్థిక క్రమశిక్షణ రహస్యాన్ని పంచుకుంది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే డబ్బు ఆదా చేయడం, పెట్టుబడులు పెట్టడం అవసరమని ఆమె సూచించింది. తన తండ్రి మార్గనిర్దేశం వల్లే వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు తెలిపింది. సినీ రంగంలో ఆదాయం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ముందుచూపు లేకపోతే చివరకు ఏమీ మిగలదని హెచ్చరించింది. ప్రస్తుతం ఆమె ‘పురుషన్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది.

February 26, 2026 / 07:40 AM IST

‘వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఇక మన దగ్గరే’

HYDలోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యాధునిక ‘A&M మోషన్ క్యాప్చర్ ల్యాబ్‌’ను రాజమౌళి ప్రారంభించారు. ‘బాహుబలి’, ‘ఈగ’ సమయంలో లేని ఈ సాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి రావడం సంతోషకరమని, దీనితో భారతీయ సినిమాల స్థాయి మారుతుందని ఆకాంక్షించారు. ‘వారణాసి’ కోసం ఈ టెక్నాలజీని వాడామని, ఫలితాలు అద్భుతంగా వచ్చాయని రాజమౌళి వెల్లడించారు.

February 26, 2026 / 07:24 AM IST

అశోక్ గల్లా ‘వీసా’ నుంచి క్రేజీ అప్‌డేట్

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీసా’. ఈ చిత్రానికి ఉద్భవ్ రఘు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మేకర్స్ ‘అనగ అనగ అమెరికా’ అనే ఫస్ట్ సింగిల్‌ను ఈనెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీకి ‘బేబీ’ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

February 25, 2026 / 05:55 PM IST