• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

రేపే యూపీఎస్సీ ఫలితాలు విడుదల?

దేశవ్యాప్తంగా అత్యున్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న సివిల్ సర్వీసెస్ ఆశావహులకు కీలక సమయం ఆసన్నమైంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2025 తుది ఫలితాలు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 27వ తేదీతో ఇంటర్వ్యూలు ప్రక్రియ పూర్తి కావడంతో, కమిషన్ ఫలితాలను వెల్లడించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.

March 4, 2026 / 09:27 PM IST

భారత విద్యార్థులకు కెనడా ఆఫర్

భారతీయ విద్యార్థులకు కెనడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్-కెనడా మధ్య విద్యా సంబంధాలను పునరుద్ధరించే దిశగా కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఏకంగా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 921 కోట్లు) భారీ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఈ మేరకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ కార్యాలయం ఈ నెల 2న అధికారిక ప్రకటన విడుదల చేసింది.

March 4, 2026 / 09:15 PM IST

ఆస్తి పన్ను వసూళ్లు వేగవంతం చేయాలి: మేయర్

KNR: కరీంనగర్ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మరో 26 రోజుల గడువు మాత్రమే ఉన్నందున అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. పన్ను చెల్లింపుపై ప్రజలకు అవగాహన కల్పించి, రూ.30 కోట్ల డిమాండ్ పూర్తి చేయాలన్నారు.

March 4, 2026 / 08:52 PM IST

ఫుడ్ డెలివరీలోకి ర్యాపిడో ఎంట్రీ

టూ వీలర్ రైడింగ్ దిగ్గజం ర్యాపిడో కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ సేవల కోసం ‘ఓన్లీ’ పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం డెలివరీ యాప్‌గానే కాకుండా.. కస్టమర్లకు, రెస్టారెంట్లకు అత్యంత లాభదాయకమైన ప్లాట్‌ఫామ్‌గా దీనిని తీర్చిదిద్దింది. ఈ యాప్ రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్ వసూలు చేయబోమని స్పష్టం చేసింది.

March 4, 2026 / 08:50 PM IST

టీచర్ల జీతాలకు కోత?.. ప్రభుత్వం క్లారిటీ

TG: ఉపాధ్యాయుల జీతాల అంశంపై ఇటీవల విద్యా కమిషన్‍ ఇచ్చిన నివేదికపై తెలిసి తెలియక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు విమర్శించారు. చాలా మందిని కన్సల్ట్ అయ్యాకే విద్యా కమిషన్ రిపోర్టు తయారు చేసిందని.. ఆ నివేదికను త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామన్నారు. కాగా, టీచర్లకు వేతనాలు అధికంగా ఉన్నాయని, వీటిని హేతుబద్ధీకరించాలని కమిషన్ అభిప్రాయపడింది.

March 4, 2026 / 05:05 PM IST

సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలి: కమిషనర్

E.G: ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. నగరపాలక సంస్థ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పబ్లిక్ హెల్త్ అధికారులు, సిబ్బందితో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఉదయం 7 గంటలకల్లా రోడ్లను ఊడ్చి.. చెత్త కుప్పలను ఎత్తివేయాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు.

March 4, 2026 / 05:00 PM IST

PGCILలో అప్రెంటిస్ ఖాళీలు.. అప్లై చేసుకోండి

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా PGCIL/ప్రాజెక్ట్/రీజియన్లలో 188 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో ITI, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు ఉండగా.. ITI, డిప్లొమా, BE/BTech/BSc/MBA/BA ఉత్తీర్ణులైనవారు ఈనెల 11 వరకు అప్లై చేసుకోవచ్చు. సైట్: www.powergrid.in

March 4, 2026 / 01:59 PM IST

వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు

AP: ఏటా వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, పోస్టుల హేతుబద్ధీకరణకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. టీచర్ల బదిలీలకు మే 30 వరకు ఉన్న సర్వీసును పరిగణనలోకి తీసుకోనున్నారు. ఏప్రిల్ 30 వరకు పాఠశాలల్లో ఉన్న     విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టుల హేతుబద్ధీకరణ జరగనున్నట్లు సమాచారం.

March 4, 2026 / 10:39 AM IST

BREAKING: రూ.20 వేలు తగ్గిన ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,110 తగ్గి రూ.1,64,510కు చేరగా, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.2,850 తగ్గి రూ.1,50,800గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.20,000 తగ్గి రూ.2,95,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

March 4, 2026 / 09:44 AM IST

WAR.. భారీగా పతనమైన రూపాయి విలువ

అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ జోరుతో భారత రూపాయి విలువ చారిత్రక కనిష్టానికి పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే రూపాయి విలువ ఏకంగా 67 పైసలు క్షీణించి, డాలర్‌తో పోలిస్తే 92.17 వద్ద ముగిసింది. ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఈ పతనానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. రూపాయి బలహీనపడటంతో దిగుమతులపై భారం పెరిగి, నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉంది.

March 4, 2026 / 09:39 AM IST

భారీ జీతంలో NTPC ఉద్యోగాలు.. అప్లై చేశారా?

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) గ్రీన్ కెమికల్ విభాగంలో 4 సీనియర్ మేనేజర్, 4 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. కెమికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, పని అనుభవం గలవారు ఈ నెల 16 వరకు అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన మేనేజర్లకు రూ.90,000-2,40,000.. ఇంజినీర్లకు రూ.50,000-1,60,000 జీతం చెల్లిస్తారు.

March 4, 2026 / 08:28 AM IST

తిరుమల TTDలో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్

తిరుమల తిరుపతి దేవస్థానాలు(TTD) ఆస్పత్రుల్లో 8 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఇవాళ ఇంటర్వ్యూ జరగనుంది. MBBS/MS/MDలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అర్హులు. తిరుపతిలోని సెంట్రల్ హాస్పిటల్‌లో ఇంటర్వ్యూ జరగనుండగా.. ఎంపికైనవారికి నెలకు రూ.53,495 జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

March 4, 2026 / 07:12 AM IST

రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

దేశవ్యాప్తంగా రేపటి నుంచి ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఐఏటీ)కి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. తుది గడువు ఏప్రిల్ 13తో ముగుస్తుంది. ప్రవేశ పరీక్ష జూన్ 7న నిర్వహిస్తారు. ఏపీలోని తిరుపతితో పాటు తిరువనంతపురం, కోల్‌కతా, భోపాల్, పూణె, మొహాలి, బెర్హంపూర్‌లో ఐసర్లు ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్(BS), బీటెక్‌తో పాటు BS-MS ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఉన్నాయి.

March 4, 2026 / 06:56 AM IST

భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్

భారతదేశానికి సహజవాయువు సరఫరాదారుగా ఉన్న ఖతార్, ఇరాన్ దాడులతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఖతార్ LNG ఎగుమతులను 40% వరకు తగ్గించింది. ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తిదారుగా ఉంది. ఖతార్ నుంచి ఎగుమతి అవుతున్న నాచురల్ గ్యాస్ వినియోగదారుల్లో భారత్ అతిపెద్దది. భారతదేశం ఏటా సుమారు 27 మిలియన్ టన్నుల లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది.

March 4, 2026 / 06:45 AM IST

యుద్ధం ఎఫెక్ట్‌.. ధరలు పెరిగే అవకాశం!

ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెను సవాళ్లను విసురుతోంది. దాదాపు 88% చమురును దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది మరింత తీవ్ర సమస్యగా మారింది. తాజాగా, హెూర్ముజ్ జలసంధిని ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో భారత్‌కు చమురు కొరత ఏర్పడుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

March 4, 2026 / 05:55 AM IST