కోనసీమ: అమలాపురం ఉపాధి కార్యాలయంలో ఈనెల 26న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమో విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.
చండీగఢ్‌లోని IDFC ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.590 కోట్ల భారీ మోసం జరిగింది. హర్యానా ప్రభుత్వ విభాగాలకు చెందిన ఖాతాలో ఈ గోల్‌మాల్ చోటుచేసుకుంది. ఒక శాఖ తన ఖాతా క్లోజ్ చేయాలని కోరగా బ్యాలెన్స్‌లో తేడాలు రావడంతో విషయం బయటపడింది. దీంతో హర్యానా ప్రభుత్వం ఆ బ్యాంకును బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఇది కేవలం ప్రభుత్వ ఖాతాలకు మాత్రమే పరిమితమని సమాచారం.
ATP: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ శైలజా తెలిపారు. పేటీఎం సంస్థ అనంతపురంలోని పంగల్ రోడ్డులోని టీటీడీసీ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోందన్నారు. పదవ తరగతి నుంచి పైచదువులు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
AP: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 24 వరకు జరగనున్న ఈ పరీక్షలకు 10,57,899 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 1.537 కేంద్రాలు ఏర్పాటుచేశారు. పరీక్ష ఉ.9-మ.12 గంటల మధ్య జరగనుండగా.. విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ALL THE BEST STUDENTS!
TG: హైదరాబాద్‌లోని Wolves4You Private Limited సంస్థ బిజినెస్ డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.8,40,000 వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు తక్షణమే విధుల్లో చేరాల్సి ఉంటుంది. మార్చి 22 లోపు దరఖాస్తు చేసుకోండి.
BHPL: పలిమెల మండలం పంకెన గ్రామ శివారులోని గోదావరి నది తీరంలో అర్ధరాత్రి వేళ భారీ యంత్రాలతో రహస్య తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరుగుతుండటంతో గ్రామస్తుల్లో కలకలం రేపుతోంది. ఇది ఇసుక అక్రమ రవాణా కోసమా లేక నిధి అన్వేషణ కోసమా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
కోనసీమ: రామచంద్రపురంలో ఆదివారం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 26 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ఉపాధి ప్రాజెక్టు డైరెక్టర్ రామ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు రామచంద్రపురం పట్టణంలో 36 జాబ్ మేళాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మంత్రి, కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అభినందనలు తెలిపారు.
ఐటీ శాఖ ‘ఆదాయ పన్ను ముసాయిదా నిబంధనలు 2026’ను ప్రతిపాదించింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం, ఏడాదిలో రూ.10L దాటిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల వివరాలు నేరుగా ఐటీ శాఖకు వెళ్తాయి. ఆఫీస్ కార్డులను వ్యక్తిగత అవసరాలకు వాడితే పన్ను పడుతుంది. అయితే, సిసి స్టేట్‌మెంట్‌ను అడ్రస్ ప్రూఫ్‌గా వాడొచ్చు. ఇకపై క్రెడిట్ కార్డు దరఖాస్తుకు పాన్ తప్పనిసరి.
ఆదాయ పన్ను ముసాయిదా నిబంధనలు-2026 పేరిట ఐటీ శాఖ కీలక ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఈ ముసాయిదా ప్రకారం.. ఒక ఆర్థిక ఏడాదిలో క్రెడిట్ కార్డు ద్వారా రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలు చేస్తే.. ఆ వివరాలను బ్యాంకులు ఐటీ శాఖకు నివేదిస్తాయి. అలాగే రూ.లక్ష, అంత కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేసినా వివరాలు అందిస్తాయి. దీందో ఖర్చుచేసే వారిపై ఐటీ శాఖ నిఘా పెరుగుతుంది.
TG: మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సంబంధించి ఈ ఏడాది అర్హులైన బీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ తెలిపింది. ఈనెల 23 నుంచి మార్చి 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థి వయస్సు 35 ఏళ్లు నిండకూడదు. డిగ్రీలో తప్పనిసరిగా 60 శాతం మార్కులు ఉండాలి.
AP: రాష్ట్రంలోని 17 వర్సిటీల్లో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీజీసెట్-2026కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో మార్చి 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సెట్ కన్వీనర్, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పద్మావతి సూచించారు. ప్రవేశ పరీక్షలు మే 8 నుంచి మే 11 వరకు జరుగుతాయని వెల్లడించారు.
AP: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,537 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
ఆంథ్రోపిక్ క్లాడ్.. సైబర్ సెక్యూరిటీ కోసం కొత్త ఫీచర్ ‘క్లాడ్ కోడ్ సెక్యూరిటీ’ని ప్రకటించింది. అది సాఫ్ట్‌వేర్ కోడ్ బేస్‌లను స్కాన్ చేస్తుంది. అందులోని లోపాలను సరిదిద్దేందుకు పరిష్కారాలను సిఫార్సు చేస్తుంది. ఈ పోస్టుతో సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు 5-9 శాతం మేర కుంగాయి. మొత్తంగా మదుపర్ల సంపద 10 బిలియన్ డాలర్ల మేర ఆవిరయ్యిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
మరో దిగ్గజ సంస్థ సీఈఓగా భారత్ సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. మైక్రోసాఫ్ట్ గేమింగ్ సీఈఓగా ఆశా శర్మను నియమిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న ఫిల్ స్పెన్సర్ పదవీ విరమణ చేయడంతో ఆశాకు ఆ పదవి దక్కింది. ఆయన స్థానంలో గేమిండ్ డివిజన్‌కు సీఈఓ, వైస్ ప్రెసిండెంట్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.