దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,068.74 పాయింట్లు నష్టపోయి 82225.92 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 288.35 పాయింట్ల నష్టంతో 25424.65 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.94గా ఉంది.
ప్రముఖ మొబైల్ కంపెనీ ఐకూ.. ‘ఐకూ 15R’ పేరిట కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో 7,600mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్, 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 16, ఆరిజిన్ OS 6, IP68, IP69 రేటింగ్, వెనక వైపు 50MP+08MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 8GB+256GB వేరియంట్ ధరను రూ.44,999గా కంపెనీ నిర్ణయించింది.
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే నిపుణులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 116 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు జరగనున్నాయి. అర్హులైన వారు మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 985 పాయింట్లు పతనమై 82,308 వద్ద, నిఫ్టీ 288 పాయింట్లు నష్టపోయి 25,424 వద్ద కొనసాగుతున్నాయి. US అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ నిర్ణయాలు, ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్ల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా AI ప్రభావం, టారిఫ్ భయాలతో ఐటీ రంగానికి చెందిన ఇన్ఫోసిస్, TCS వంటి సంస్థలు 3 శాతం మేర నష్టపోయాయి.
NCERT సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 8వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేస్తూ కొత్త అంశాలను చేర్చింది. “న్యాయ వ్యవస్థ” అనే అధ్యాయంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని తొలిసారిగా పరిచయం చేసింది. విద్యార్థులకు దేశంలోని న్యాయ వ్యవస్థలో సవాళ్లు, లోపాలను కూడా వివరించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 పెరిగి రూ.1,61,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.1,48,300 పలుకుతోంది. ఇక, కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ.2,90,000కు చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 694.13 పాయింట్లు నష్టపోయి 82600.53 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 201.90 పాయింట్ల నష్టంతో 25511.10 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.96గా ఉంది.
TG: వైద్యారోగ్యశాఖలో 434 పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసిన 14 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో ఒక్కోదానికి 31 చొప్పున పోస్టులున్నాయి. వైద్యారోగ్య నియామక మండలి భర్తీ చేయనుంది. వీటితో పాటు జలమండలికి 130 పోస్టులు మంజూరు చేసింది. ఇందులో మేనేజర్, ఇంజనీర్ పోస్టులున్నాయి. వీటిని TGPSC ద్వారా భర్తీ చేస్తారు.
TG: రేపటి నుంచి ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 30 నిమిషాల ముందే రావాలని అధికారులు సూచించారు. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్రలపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా విద్యార్థులను పరీక్ష హాల్‌కు అనుమతించాలని తెలిపారు. విద్యార్థులకు కళాశాల మేనేజ్ మెంట్ హాల్ టికెట్లు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మార్చి నెలలో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు 10 రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెలలో 5 ఆదివారాలు ఉండటం విశేషం. వీటితో పాటు మార్చి 4న హోలి పండుగ, మార్చి 14న రెండో శనివారం సెలవులు ఉంటాయి. మార్చి 19న ఉగాది, మార్చి 20న రంజాన్, మార్చి 26న శ్రీరామనవమి ప్రభుత్వ సెలవులు ఉండనున్నాయి. మార్చి 31న మహావీర్ జయంతి ఆప్షనల్ హాలీడే.
TG: ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు TGPSC కీలక సంస్కరణ చేపట్టింది. దరఖాస్తులో వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR) చేసుకున్న వారు తమ ID సహాయంతో తాజా వివరాలు అప్‌డేట్ చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన ప్రక్రియను టీజీపీఎస్సీ మార్చి 25 వరకు పొడిగించింది. ఈ వివరాల ఆధారంగానే భవిష్యత్ నియామక పరీక్షకు దరఖాస్తులకు అర్హత లభిస్తుంది.
TG: హైదరాబాద్ నానక్ రాంగూడలో అమెరికా బీమా సంస్థ ‘ది హార్ట్ ఫోర్డ్ ఇండియా’ కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీని ద్వారా 1200 మందికి ఉపాధి లభించనుంది. హైదరాబాద్‌ను గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు. పరిశ్రమల అవసరాల మేరకు యువతను తీర్చిదిద్దుతున్నామన్నారు.
TG: TG EdCET 2026 ఎంట్రన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదలయింది. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 15 వరకు అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉంది. మే 12న రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో ఎంట్రన్స్ పరీక్ష, మే 30న ఫలితాలు రానున్నాయి.
బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దేశంలో బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని వెల్లడించారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతోనే బంగారానికి రెక్కలు వచ్చినట్లు చెప్పారు. ఈ పరిణామాలను RBI ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు నిర్మలమ్మ పేర్కొన్నారు.