• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 8 మందికి జైలు

కాకినాడ: వన్ టౌన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 21 మంది పట్టుబడినట్లు CI నాగదుర్గారావు తెలిపారు. వారిని సోమవారం కాకినాడ SJSC మేజిస్ట్రేట్ సీహెచ్ ఎస్ వీవీ ఎన్ శేషారావు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం 13 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల జరిమానా విధించారు. మిగిలిన 8 మందికి రెండు నుంచి మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు.

February 23, 2026 / 04:42 PM IST

ఇమ్మిడివరప్పాడు గ్రామంలో శాంతి కమిటీ ఏర్పాటు: ఎస్సై

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం ఇమ్మిడివరప్పాడు గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు గ్రామ పెద్దలతో కలిసి సోమవారం తాలూకా ఎస్సై శేఖర్ బాబు శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. ఆయన సోమవారం గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. ​గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఇచ్చిన వ్యవది లోపే వాటిని తొలగించాలని ఎస్సై సూచించారు.

February 23, 2026 / 04:41 PM IST

ఉపాధి దిశగా నాణ్యమైన శిక్షణ అవసరం

TPT: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలను టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ సోమవారం పరిశీలించారు. విద్యార్థినులకు ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయిలో నాణ్యమైన శిక్షణ, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, కెరీర్ గైడెన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధ్యాపకులకు సూచించారు. కళాశాలలోని ల్యాబ్‌లు, తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులతో కూడా మాట్లాడారు.

February 23, 2026 / 04:41 PM IST

‘ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి’

SKLM: మందస గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఎదురుగా ఉన్న గ్రామ పంచాయతీకి చెందిన మురుగు నీరు, వర్షం నీరు ప్రవహించే కాలువ ఆక్రమణకు గురైంది. ఆక్రమణదారులు కాలువను ఆక్రమించి, పూడ్చి వేయడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై సోమవారం స్థానిక మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆక్రమణపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

February 23, 2026 / 04:41 PM IST

సీనియర్ జర్నలిస్ట్ మృతి

KRNL: 20 ఏళ్లుగా మీడియా రంగంలో సేవలందించిన సీనియర్ జర్నలిస్ట్, ఓ పత్రిక ఎడిటర్ జేమ్స్ ఆనందరావు సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతిపట్ల జర్నలిస్టు సంఘాలు తీవ్ర సంతాపం ప్రకటించాయి. జేమ్స్ లేని లోటు మీడియా రంగంలో తీరనిదని పేర్కొన్నారు. ఆయన మృతితో జిల్లాలో జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

February 23, 2026 / 04:38 PM IST

వార్షికోత్సవ కరపత్రాలు ఆవిష్కరణ

SKLM: ఎచ్చెర్ల మండలం లింగాలపేట గ్రామంలో వెలసిన శ్రీ శిరిడి సాయిబాబా ఆలయ 10వ వార్షికోత్సవాన్ని ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త సరఫరా బాలకృష్ణ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కరపత్రాలను ఆవిష్కరించారు. అర్చకులు కాళిదాసు, చంద్రకుమార్ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

February 23, 2026 / 04:37 PM IST

తలుపులమ్మ తల్లి హుండీల ఆదాయం రూ.46.21లక్షలు

కాకినాడ: తుని మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 66 రోజులకు గాను రూ. 46,21,025 ఆదాయం వచ్చినట్లు దేవస్థాన ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాధరాజు తెలిపారు. పర్యవేక్షణాధికారులుగా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సీహెచ్ సురేష్ నాయుడు వ్యవహరించారు.

February 23, 2026 / 04:37 PM IST

జిల్లాలో ప్ర‌శాంతంగా ఇంట‌ర్ ప‌రీక్ష‌లు: కలెక్టర్

NTR: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమ‌వారం ప్రారంభం కాగా ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రుగుతున్నాయని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పేర్కొన్నారు. న‌గ‌రంలోని వివిధ ప‌రీక్షా కేంద్రాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు.పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉన్నందున అనవసరంగా ఎవరూ గుమికూడరాదని, తల్లిదండ్రులు,ప్రజలు సహకరించాలని ...

February 23, 2026 / 04:35 PM IST

”పీజీఆర్ఎస్’లో ఫిర్యాదుల వెల్లువ

WG: ‘పీజీఆర్ఎస్’ లో అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను నరసాపురం ఆర్డీవో దాసిరాజు ఆదేశించారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలో నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 52 ఫిర్యాదులు అర్జీదారుల నుంచి స్వీకరించినట్లు ఆర్డీవో తెలిపారు.

February 23, 2026 / 04:34 PM IST

విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎంపీ అంబిక

ATP: సింగనమల మండలం పెరవల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మతో కలిసి పూజలు నిర్వహించిన ఆయన, గ్రామస్థులతో కలిసి కోలాట భజనలో పాల్గొన్నారు. వాల్మీకి సమాజం విద్యాపరంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

February 23, 2026 / 04:34 PM IST

అందుబాటులో మరో 36 కిషాన్ డ్రోన్‌లు

TPT: జిల్లాలో గత ఏడాది సబ్సిడీ కింద జిల్లాలో 36 కిషాన్ డ్రోన్‌లను అందుబాటులోకి తెచ్చారు. సబ్సిడీ కింద ఐదుగురు రైతుల గ్రూప్‌గా కలిసిన సభ్యులకు శిక్షణ ఇచ్చి అందజేశారు. రైతులు డ్రోన్ కావాలంటే కిషాన్ డ్రోన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మీ సమీపంలో డ్రోన్‌లు ఎక్కడ ఉన్నాయి, వారి వివరాల తెలుసుకుని సంప్రదించవచ్చు. ఎకరానికి రూ.400 చొప్పున సేవా ధరను నిర్ణయించారు.

February 23, 2026 / 04:34 PM IST

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై చలో కలెక్టరేట్

GNTR: గ్రామపంచాయతీ కార్మికులకు జీతాల పెంపు, 132, 142, 680 జీవోలను తక్షణమే అమలు , టెండర్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఫిరంగిపురంలో మంగళవారం కరపత్రాన్ని విడుదల చేశారు.

February 23, 2026 / 04:32 PM IST

కోడి పందేల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

కృష్ణా: ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్‌ఐ వి. చందన తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక కోడి పుంజు, రూ.1,67 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 23, 2026 / 04:30 PM IST

జిల్లాలో పశువుల హాస్టళ్లు

సత్యసాయి: పాడి రైతులకు ఊరటనిస్తూ ప్రభుత్వం ‘కమ్యూనిటీ అనిమల్ హాస్టళ్ల’ పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ధర్మవరం, ముదిగుబ్బ, పరిగి, సోమందేపల్లి, అమరాపురంలో ఐదు యూనిట్లను మంజూరు చేశారు. ఒక్కో హాస్టల్‌ను రూ.10 లక్షలతో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించనున్నారు. 50 సెంట్ల విస్తీర్ణంలో 20 పశువులకు వసతి కల్పిస్తారు.

February 23, 2026 / 04:28 PM IST

పాఠశాలలోకి దూసుకెళ్లిన వ్యాన్.. తప్పిన ముప్పు

ASR: జీకేవీధి మండలం కస్తూర్బా గాంధి పాఠశాలలోకి వాహనం దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్నందున ఆ పనులకు సోమవారం ఉదయం ఇసుక తీసుకువచ్చిన వ్యాన్ అదుపుతప్పి గోడ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రహరీ గోడ విరిగి వాహనం బోల్తా పడింది.

February 23, 2026 / 04:27 PM IST