• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సీఎంను కలిసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే

కోనసీమ: ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాధాన్యత అంశాలపై ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, కాలువలు, విద్యా, వైద్య రంగాలకు సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిని సీఎంకి వివరించారు.

February 24, 2026 / 04:34 PM IST

ఘనంగా ప్రమాణస్వీకార మహోత్సవం

KDP: రాజంపేట పార్లమెంట్ టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు, 41 మంది నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం మార్చి 2న మదనపల్లె పట్టణంలోని రామతులసమ్మ కన్వెన్షన్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మరియు జిల్లా స్థాయి ప్రముఖ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

February 24, 2026 / 04:33 PM IST

పల్నాడు జంట హత్యలపై సీఎంకు వినతి

PLD: జిల్లా చర్లగుడిపాడులో పద్మశాలి యువకుల జంట హత్యలపై సంఘం నేతలు సీఎం చంద్రబాబును కలిశారు. శ్రీనివాసరావు, భావనరుషి కుటుంబాలకు ఆర్థిక సాయం, పక్కా ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన సీఎం, ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

February 24, 2026 / 04:32 PM IST

అసెంబ్లీలో రేపల్లె విద్యార్థులు

BPT: ఏపీ అసెంబ్లీ సమావేశాలను రేపల్లె నియోజకవర్గ విద్యార్థులు వీక్షించారు. పేటేరు, గుళ్లపల్లి, ఉల్లిపాలెం పాఠశాలల విద్యార్థులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ ముచ్చటించారు. సభ తీరు, సమస్యల ప్రస్తావనపై వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. అనంతరం మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 04:31 PM IST

సెల్ టవర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన

E.G: నిడదవోలు మండలం శెట్టిపేట ZP హైస్కూల్ దగ్గరలో సెల్ టవర్ ఏర్పాటు చేయడానికి వ్యతిరేకిస్తూ BSP నాయకులు బయ్యే మునేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం నిరసన నిర్వహించారు. సెల్ టవర్ వలన సమీపంలో ఉన్న విద్యార్థులు పరిసరాలలో జీవించేవారు రేడియేషన్‌తో అనారోగ్యానికి గురి అయ్యే ప్రమాదం ఉందన్నారు. వెంటనే అధికారులు స్పందించి టవర్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలన్నారు.

February 24, 2026 / 04:30 PM IST

ఏలూరు జిల్లాలో హాజరు శాతం ఎంతంటే..!

ఏలూరు: జిల్లావ్యాప్తంగా మంగళవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షకు 98 శాతం హాజరు నమోదైనట్లు ఆర్‌ఐవో యోహాన్ తెలిపారు. మొత్తం 16,433 మంది విద్యార్థులకు గాను 16,046 మంది హాజరయ్యారని, 387 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. హాజరైన వారిలో జనరల్ విభాగం నుంచి 14,209 మంది, ఒకేషనల్ నుంచి 1,837 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

February 24, 2026 / 04:29 PM IST

ఘనంగా హిందూ సమ్మేళనం

ASR: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతిని పురష్కరించుకుని అరకులోయలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. మంగళవారం అరకులోయ ఎన్టీఆర్ గ్రౌండ్ నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు కోలాటం, దింసాలతో శోభాయాత్ర నిర్వహించారు. ఆధ్యాత్మిక వక్త రాధమనోహర్ దాస్ ముఖ్య అతిథిగా పాల్గొని హిందుత్వం, సనాతన ధర్మం ప్రాముఖ్యతను వినిపించారు. హిందూ బందువులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

February 24, 2026 / 04:26 PM IST

బ్యాక్‌లాగ్ ప్రవేశ పరీక్షలు వాయిదా

SKLM: పెద్దపాడులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్‌‌లాగ్ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. మార్చి 2న నిర్వహించాల్సిన ఈ పరీక్షలను మార్చి 8వ తేదీకు మార్చినట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దేవి మంగళవారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

February 24, 2026 / 04:23 PM IST

‘డొక్కా సీతమ్మ ఆశయాల కోసం జనసేన కృషి’

KKD: డొక్కా సీతమ్మ ఆశయాలతో పేదల కోసం జనసేన కృషి చేస్తుందని జగ్గంపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు జగ్గంపేటలో పాత పోలీస్ స్టేషన్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే డొక్కా సీతమ్మ ఉచిత క్యాంటీన్ ను దాతల సాయంతో నిర్వహించి 500 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు.

February 24, 2026 / 04:23 PM IST

రిష్వంత్ రాయ్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ఆహ్వానం

ATP: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన అక్కల రిష్వంత్ రాయ్ (రిషి), తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే పరిటాల సునీతను ఆహ్వానించారు. మార్చి 8వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమానికి సకుటుంబంగా రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా రిష్వంత్ రాయ్‌ను ఎమ్మెల్యే సునీత ప్రత్యేకంగా అభినందించారు.

February 24, 2026 / 04:20 PM IST

గుండెపోటుతో ఫైర్ ఏఎస్ఐ మృతి

NLR: కావలి అగ్నిమాపక స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మైనంపాటి సుధాకర్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. మైనంపాటి సుధాకర్ ఇటీవల విధులకు సెలవు పెట్టి కారులో హైదరాబాదుకు వెళుతుండగా మార్గమధ్యంలో గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. సుధాకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

February 24, 2026 / 04:20 PM IST

రాష్ట్ర ప్రభుత్వ క్యాలెండర్ ఆవిష్కరణ

KDP: రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా ప్రచురించిన 2026 సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మంగళవారం అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన క్యాలెండర్లను జిల్లాలోని అన్ని శాఖలకు పంపిణీ చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా అధికారికి కలెక్టర్ సూచించారు.

February 24, 2026 / 04:20 PM IST

పుట్టపర్తిలో పోలీసుల హై అలర్ట్

సత్యసాయి: పుట్టపర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ పేరుతో నకిలీ ఐడీ నుంచి ఈ బెదిరింపు వచ్చినట్లు సమాచారం. డీఎస్పీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో కోర్టు ఆవరణలో అణువణువు తనిఖీలు చేపట్టారు.

February 24, 2026 / 04:20 PM IST

ఇంటర్ పరీక్షలకు ఎంతమంది హాజరైనారు అంటే..!

KDP: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 62 కేంద్రాల్లో 15,159 మంది నమోదు కాగా, 14,777 మంది హాజరై 97 శాతం హాజరు నమోదైంది. మొత్తం 382 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 14,011 మందిలో 13,691 మంది హాజరై 320 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,148 మందిలో 1,086 మంది పరీక్షలు రాయగా 62 మంది హాజరుకాలేదు.

February 24, 2026 / 04:17 PM IST

పులికాట్ అంతర్రాష్ట్ర వివాద పరిష్కారానికి ఎంపీ కృషి

TPT: పులికాట్ సరస్సు అంతర్రాష్ట్ర జల వివాద సమస్య పరిష్కారం కోసం ఎంపీ మద్దిల గురుమూర్తి జిల్లా కలెక్టరును కలిశారు. మత్స్యకారుల సమస్యలపై ఎంపీ చర్చలు తెలిపారు. మత్స్యకారులు సరిహద్దులు మార్చి చేపల వేట కొనసాగిస్తున్నారని కలెక్టరుకి వివరించారు. మత్స్యకారులు స్నేహభావంతో వ్యవహరించి గొడవలకు దూరంగా ఉండాలని ఎంపీ పిలుపునిచ్చారు.

February 24, 2026 / 04:15 PM IST