ATP: అనంతపురంలో రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సామరస్యానికి, సోదరభావానికి ప్రతీక అని కొనియాడారు. ముస్లిం సోదరులతో కలిసి విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
కృష్ణా: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుడివాడ ట్రాఫిక్ ఏఎస్ఐ భాగ్యవతి విశిష్ట సేవలకుగాను కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా ఆదివారం అవార్డును అందుకున్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రించడంలో భాగ్యవతి ప్రత్యేక గుర్తింపు పొందారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ, విశిష్ట సేవలు అందిస్తున్నారని తెలిపారు.
ప్రకాశం: టీ20 మ్యాచ్‌లో టీం ఇండియా ఘన విజయం సాధించిన సందర్భంగా కనిగిరి పట్టణంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. యువతతో కలిసి జాతీయ జెండాలు ఊపుతూ భారత జట్టు విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో భారత జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
TPT: జిల్లా వ్యాప్తంగా సరిహద్దు గ్రామాల్లో పోలీస్ అధికారులు విసిబుల్ పోలీసింగ్ నిర్వహించి విస్తృత తనిఖీలు చేపట్టారు. గ్రామస్తులతో మాట్లాడి అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం సేకరించారు. జూదం వంటి అక్రమ కార్యకలాపాలపై నిఘా ఉంచి అనుమానితులను క్రాస్ చెక్ చేశారు. ఏదైనా అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
ELR: జిల్లాలోని మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఆయా కార్యాలయాల్లో అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయాలకు రాలేని వారు meekosam.ap.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో ఫిర్యాదులు నమోదు చేయవచ్చని ఆమె సూచించారు.
KDP: నకిలీ లోన్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని చిన్నచౌక్ SI రాజరాజేశ్వరరెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా ఎస్పీ ఆదేశాలతో కడపలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. అనధికారిక యాప్‌లు డౌన్‌లోడ్ చేస్తే ఫోన్ డేటా చోరీకి గురై బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రుణాలకు బ్యాంకులనే ఆశ్రయించాలని, మోసపోతే వెంటనే 1930 నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
NLR: బుచ్చి పట్టణ పరిధిలోని మహిళలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదివారం రాత్రి కుట్టుమిషన్లను అందజేశారు. మెప్మా ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్లోని టైలరింగ్లో శిక్షణ తీసుకొని సర్టిఫికెట్లు పొందిన ఏడు మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందేందుకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఆమె తెలిపారు.
AKP: కోటవురట్ల మండలంలో రబీ సీజన్‌లో రైతులు సాగు చేస్తున్న నువ్వుల పంట వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం పూత దశలో ఉన్న పంటపై కాయ తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగు ఆశిస్తే ప్రొఫైనోఫాస్ 2ml మందు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అధిక దిగుబడి కోసం 2 శాతం యూరియా వేయాలన్నారు.
VZM: ప్రకృతి వ్యవసాయంపై మహిళలు దృష్టి సారించాలని నెల్లిమర్ల MLA లోకం మాధవి సూచించారు. ఆదివారం డెంకాడ మండలం సింగవరంకి చెందిన మహిళలు పండించిన వివిధ రకాల కూరగాయలు స్టాల్స్‌ను ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంతో అధిక లాభాలు సంపాదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు డ్వాక్రా మహిళలతో పాటు మరికొంత మంది మహిళలు స్టాల్స్ ఏర్పాటు చేశారు.
VZM: విద్యుత్ స్తంభాలకుండే వైర్లను దొంగిలించిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్.కోట CI నారాయణమూర్తి ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. స్దానిక నవోదయ రెసిడెన్సి స్కూల్ ప్రాంతంలోని లే అవుట్‌లో దొంగిలించబడ్డ విద్యుత్ వైర్ల కేసులో పాత నేరస్థుడు సుధాకర్ రెడ్డి, అనంతగిరికి చెందిన మహేష్ మరో ఇద్దరు బాల నేరస్టులను పట్టుకున్నామని తెలిపారు.
గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ షేక్ ఖాసిం అనే వ్యక్తి మృతి చెందినట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఖాసిం ఒక లాడ్జిలో ఉంటూ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. మృతుడి పూర్తి వివరాలు గానీ, బంధువుల ఆచూకీ గానీ ఇప్పటివరకు లభ్యం కాలేదు. మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు, మృతుడి వివరాలు తెలిస్తే కొత్తపేట పోలీసులను సంప్రదించాలన్నారు.
GNTR: మంత్రి లోకేష్ సోమవారం మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం మహానాడులో రిటైనింగ్ వాల్ శంకుస్థాపన, నులకపేటలో కమ్యూనిటీ హాల్, పెదవడ్లపూడిలో హైలెవల్ ఛానెల్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పెనుమూలిలో లైబ్రరీ, దుగ్గిరాలలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి, సాయంత్రం 3 గంటలకు రేవేంద్రపాడులో NTR విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.
CTR: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్” (ప్రజల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం) ఇవాళ ఉదయం 10.30 గంటలకు పాత డీపీవో కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి పరిష్కారం పొందవచ్చని పోలీస్ శాఖ తెలిపింది.
AKP: నాతవరం మండలం శృంగవరం గ్రామాన్ని ఇవాళ కేంద్ర బృందం సందర్శించనుంది. వాట్స్‌యాప్ గవర్నెన్స్, స్వర్ణ పంచాయితీ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీస్తుందని అధికారులు తెలిపారు. గుడ్ గవర్నెన్స్‌లో ఈ గ్రామం జాతీయ పోటీలకు ఎంపికైంది. విజేతగా నిలిస్తే గ్రామానికి రూ.కోటి బహుమతి వస్తుంది. ఈ మేరకు సర్పంచ్, కార్యదర్శిని ఢిల్లీలో రాష్ట్రపతి సత్కరిస్తారు.
SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక మీ కోసం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి *Meekosam.ap.gov.in* వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.