• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు శృంగవరాన్ని సందర్శించనున్న కేంద్ర బృందం

AKP: నాతవరం మండలం శృంగవరం గ్రామాన్ని ఇవాళ కేంద్ర బృందం సందర్శించనుంది. వాట్స్‌యాప్ గవర్నెన్స్, స్వర్ణ పంచాయితీ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీస్తుందని అధికారులు తెలిపారు. గుడ్ గవర్నెన్స్‌లో ఈ గ్రామం జాతీయ పోటీలకు ఎంపికైంది. విజేతగా నిలిస్తే గ్రామానికి రూ.కోటి బహుమతి వస్తుంది. ఈ మేరకు సర్పంచ్, కార్యదర్శిని ఢిల్లీలో రాష్ట్రపతి సత్కరిస్తారు.

March 9, 2026 / 06:17 AM IST

నేడు జడ్పీ కార్యాలయంలో ‘మీ కోసం’ కార్యక్రమం

SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక మీ కోసం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి *Meekosam.ap.gov.in* వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 9, 2026 / 06:13 AM IST

రౌడీషీటర్లు, అనుమానితులకు పోలీసుల కౌన్సిలింగ్

TPT: ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లు, అనుమానితులకు పోలీస్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్టాన్ని గౌరవిస్తూ సత్ప్రవర్తనతో మెలగాలని, సమాజ శాంతి భద్రతలను భంగం కలిగించే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 9, 2026 / 06:12 AM IST

నేడు డయల్ యువర్ ఎస్ఈ

ATP: అనంతపురంలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు ఉన్న వినియోగదారులు 91547 90350 లేదా 08554 272943 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. అందిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.

March 9, 2026 / 06:12 AM IST

కుటుంబం పట్ల అత్యంత బాధ్యతగా మెలిగేది స్త్రీలే: ఎస్పీ

కృష్ణా: మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, కుటుంబం పట్ల అత్యంత శ్రద్ధగా బాధ్యతగా మెలిగేది స్త్రీలేనని అన్నారు. దేశంలో ఉన్న ముఖ్యమైన పదవుల్లో మహిళలు ఉన్నారంటే అదే స్త్రీ శక్తికి నిదర్శనమని తెలిపారు.

March 9, 2026 / 06:12 AM IST

నేడు కలెక్టరేట్లో యథాతథంగా ‘పీజీఆర్ఎస్’: కలెక్టర్

E.G: రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్లను యథాతథంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను ‘Meekosam.ap.gov.in’ చేసుకోవచ్చని, వివరాల కోసం 1100 నంబరును సంప్రదించాలని సూచించారు. అధికారులు విధిగా హాజరై అర్జీలను స్వీకరించాలని ఆదేశించారు.

March 9, 2026 / 06:09 AM IST

KGBVలో దరఖాస్తుల ఆహ్వానం

KRNL: పత్తికొండ KGBV పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు అర్హులైన విద్యార్థినులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ షబానా ఇవాళ తెలిపారు. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. బడిబయట పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు, ప్రత్యేకావసరాల పిల్లలకు ఉన్నతాధికారులు సీట్లు కేటాయిస్తారన్నారు.

March 9, 2026 / 06:05 AM IST

గంజాయి నిర్మూలనకు పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

అన్నమయ్య: రైల్వే కోడూరు పరిధిలోని వత్తులూరు వడ్డిపల్లిలో ఆదివారం సాయంత్రం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా సీఐలు శ్రీనివాసులు, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. గంజాయి వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని, ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

March 9, 2026 / 06:05 AM IST

‘నేడు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’

సత్యసాయి జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ కేంద్రాల్లో ఈనెల 9న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. అర్జీదారులు నేరుగా రావాల్సిన అవసరం లేకుండా ‘meekosam.ap.gov.in’ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించాలన్నారు.

March 9, 2026 / 06:03 AM IST

ఎమ్మెల్యే నేటి పర్యటన షెడ్యూల్

CTR: పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాధ్ రెడ్డి ఇవాళ బైరెడ్డిపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఎం.కొత్తూరు పంచాయతీ మునిపల్లి గ్రామంలో నిర్వహించే వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు నెల్లిపట్ల గ్రామంలోని మార్గ మహేశ్వర దేవస్థానంలో జరిగే పూజా కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

March 9, 2026 / 06:02 AM IST

ఏడు గడ్డి వాముల దగ్ధం

KRNL: ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి 7 గడ్డివాములు దగ్ధం అయ్యాయి. గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డి, రేవన్న, శివన్న తదితరులకు చెందిన గడ్డి వాములు కాలిపోయాయి. దాదాపు రూ.3 లక్షలు ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. గ్రామస్థులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయిందని ప్రజలు పేర్కొన్నారు.

March 9, 2026 / 06:01 AM IST

నేడు డయల్ యువర్ విద్యుత్ శాఖ ఎస్ఈ

ATP: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఉదయం 8.30 నుం చి 9.30 గంటల వరకు డయల్ యువర్ విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్ఈ శేషాద్రి శేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 91547 90350, 08554 272948 నంబర్లను సంప్రదించాలన్నారు. సమస్యలను సకాలంలో పరిష్కరించనున్నట్లు తెలిపారు.

March 9, 2026 / 06:01 AM IST

మంత్రి ఫారుక్‌ను కలిసిన కేడీసీసీ బ్యాంక్ సీఈవో

కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీ) సీఈవో శివలీల ఆదివారం నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫారుక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఉమ్మడి జిల్లాలో కేడీసీసీ బ్యాంకు ద్వారా రైతులకు, ఖాతాదారులకు అందుతున్న సేవలను, బ్యాంక్ ప్రగతిని ఆమె మంత్రి ఫరూక్‌కు వివరించారు.

March 9, 2026 / 06:00 AM IST

జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి: కలెక్టర్

PLD: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నరసరావుపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను నివారించేందుకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

March 9, 2026 / 05:48 AM IST

కేజీబీవీ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

అన్నమయ్య: నిమ్మనపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం (సీఈసీ)లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మునివెంకటమ్మ తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఏప్రిల్ 13న ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు.

March 9, 2026 / 05:47 AM IST