• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు జిల్లాలో సీఎం పర్యటన

NDL: కొత్తబురుజులో సీఎం చంద్రబాబు రేపు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం కొత్తగా రూపొందించిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేయనున్నారు. అనంతరం రైతులు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశంపై పలు అంశాలపై చర్చించనున్నారు.

March 8, 2026 / 08:22 PM IST

‘మహిళా హక్కులు, పరిరక్షణకై మహిళలు ముందుండాలి’

ASR: కూనవరం(మం) కోతులు గుట్ట ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఐద్వా, యూ.టీ.ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా జీ.సీ.డీ.వో,యం. కవిత, ZPTC, గుజ్జా విజయ హాజరైయ్యారు. వారు మాట్లాడుతూ.. మహిళా హక్కులు, పరిరక్షణకై మహిళలు ముందుండాలన్నారు. మహిళాలు ఇంటికే పరిమితం కాకుండా సమాజంలో జరగుతున్న విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

March 8, 2026 / 08:21 PM IST

నజీర్ అహమ్మద్‌పై ఆరోపణలు ఖండన

KRNL: ఎమ్మిగనూరులో మున్సిపల్ వైస్ ఛైర్మన్ డి.నజీర్ అహమ్మద్‌పై వచ్చిన ఆరోపణలను వైసీపీ నేతలు ఆదివారం ఖండించారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకున్నారన్న ప్రచారం అసత్యమని తెలిపారు. బాధితులే డబ్బులు ఇవ్వలేదని వీడియోల్లో స్పష్టం చేశారని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

March 8, 2026 / 08:11 PM IST

మహిళా పోలీస్ కానిస్టేబుల్‌కు ఘన సత్కారం

GNTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మహిళా సిబ్బందిని గౌరవిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సింగయ్య మాట్లాడుతూ, మహిళా పోలీస్ కానిస్టేబుల్‌ను కుటుంబ సభ్యురాలిగా భావించి సత్కరించడం తమకు గొప్ప గౌరవంగా భావిస్తున్నామని పోలీస్ శాఖలో మహిళా పోలీస్ పాత్ర కీలకమైనదని తెలిపారు.

March 8, 2026 / 08:10 PM IST

విద్యార్థి మృతి.. కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే

KRNL: హొళగుంద మండలం సమ్మతగేరి గ్రామానికి చెందిన అడ్వకేట్ లక్ష్మీకాంత కుమారుడు బళ్లారిలో గురుకుల వసతి గృహంలో జరిగిన ఘర్షణలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి గ్రామానికి చేరుకుని మృతదేహానికి ఇవాళ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 8, 2026 / 08:07 PM IST

సింగుపురంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం(మం) సింగుపురంలో జాకరమ్మ తల్లి యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను ఎల్విన్‌పేట సీఐ బీ. హరి ప్రారంభించారు. టోర్నమెంట్‌లో 60కి పైగా జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యువత క్రీడలతో పాటు చదువులో రాణించాలని సీఐ సూచించారు.

March 8, 2026 / 08:03 PM IST

ఉపనిషత్ మందిరంలో ఆధ్యాత్మిక ప్రవచనం

శ్రీకాకుళం ఉపనిషత్ మందిరంలో ఆదివారం సాయంత్రం “హనుమంతుడు-కార్యాసాధకుడు” అనే అంశంపై ఆసక్తికర ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. ప్రముఖ ప్రవచనకర్త, విశ్రాంత బ్యాంకు మేనేజర్ డీ. జ్ఞానేశ్వర్ పట్నాయక్ తన దైన పంధాలో నిర్వహించిన అధ్యాత్మిక మేధో మధనం శ్రోతల్ని అమితంగా ఆకట్టుకొంది.

March 8, 2026 / 08:03 PM IST

భక్తిశ్రద్ధలతో శ్రీ గద్దిరాల మారెమ్మ దేవి రథోత్సవ వేడుకలు

ATP: గుంతకల్లులో ఆదివారం శ్రీ గద్దిరాల మారెమ్మ దేవి 17 వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేకంగా అలంకరించి రథములో కొలువు తీర్చి పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

March 8, 2026 / 08:01 PM IST

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తిలోని ఎస్జీ కన్వెన్షన్‌లో డీఆర్‌డీఏ, ఐసీడీఎస్, మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. 1200 మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

March 8, 2026 / 08:00 PM IST

‘మహిళలు సమాజంలో మార్గదర్శకులుగా నిలుస్తున్నారు’

E.G: రాజమండ్రి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ గంటా స్వరూపరాణి ఆదివారం పాల్గొన్నారు. పంచానికి శాంతి, ఆధ్యాత్మికత, విలువల జీవనం గురించి తెలియజేస్తూ “ఓం శాంతి” అనే సందేశాన్ని వ్యాప్తి చేస్తున్న కుమారీస్ సేవలు ఎంతో గొప్పవన్నారు. మహిళలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారన్నారు.

March 8, 2026 / 08:00 PM IST

వేసవి దృష్ట్యా త్రాగునీటి కోసం నూతన బోర్లు ఏర్పాటు

కృష్ణా: వేసవి దృష్ట్యా త్రాగునీటి కోసం ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్లు చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి తెలిపారు. ఆదివారం చల్లపల్లిలోని పుట్ట బజారులో ఉన్న పంప్ హౌస్ వద్ధ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రెండు నూతన బోర్లు వేసే పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. పంచాయతీ ఈవో పీవీ మాధవేంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.

March 8, 2026 / 08:00 PM IST

డ్వాక్రా మహిళలకు రుణాల చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

ELR: బుట్టాయగూడెం జూనియర్ కాలేజ్ మైదానంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో స్థిరపడి విజయం సాధించాలని కోరారు. 59,341 మంది డ్వాక్రా మహిళలకు రూ.378 కోట్ల 36 లక్షల విలువైన రుణాల చెక్కులను ఎమ్మెల్యే మహిళలకు అందజేశారు.

March 8, 2026 / 08:00 PM IST

జంగారెడ్డిగూడెం ఏఎస్పీకి ఘన సత్కారం

ELR: మహిళా సాధికారికత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితా రామనాథన్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం జంగారెడ్డిగూడెంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏఎస్పీని సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

March 8, 2026 / 07:58 PM IST

రేపు భీమవరం వన్ టౌన్‌లో ‘పీజీఆర్ఎస్’

W.G: భీమవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జరుగుతుందన్నారు. అర్జీదారులు ఈ మార్పును గమనించి, తమ విన్నపాలతో నేరుగా వన్ టౌన్ స్టేషన్‌కు రావాలన్నారు.

March 8, 2026 / 07:55 PM IST

‘రంజాన్ మాసం సహనం, సోదరభావానికి ప్రతీక’

KDP: రవీంద్ర నగర్‌లో ‘అస్తనే-యి-షామిరియా’ వారి ఆహ్వానం మేరకు నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజాన్ మాసం సహనం, సేవా భావం, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

March 8, 2026 / 07:53 PM IST