TPT: కోట మండలం తిన్నెలపూడి పంచాయతీలో ఇవాళ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పర్యటించనున్నారు. రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని మండల టీడీపీ అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే నిరంతరం శ్రమిస్తున్నారని పార్టీ నేతలు కొనియాడారు.
మన్యం: భామిని మండలం సతివాడలో పున్ననా తేజ (7) చెరువులో పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి చెరువులో చేపలు పట్టే క్రమంలో జారిపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తేజ తండ్రి రెండేళ్ల క్రితం మృతి చెందగా, ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇలా చెరువులో పడి చనిపోయాడు. కొడుకు కోసం బతుకుతున్న నాకు దిక్కెవరు ఆ తల్లి బోరున విలపించింది.
VSP: గడచిన శిక్షణ సంవత్సరంలో సాధించిన విజయాలు, పాఠాలను సమీక్షించేందుకు జిల్లా NCC గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్‌లు సమావేశమయ్యారు. క్యాడెట్ల నమోదు,ఇన్స్‌టూషనల్ శిక్షణ, అత్యుత్తమ నిర్వహణ విధానాలపై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. రాబోయే ఏడాదిలో శిక్షణా ప్రమాణాలను మరింత మెరుగుపరిచి, క్యాడెట్ల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన కార్యాచరణను రూపొందించామన్నారు.
NTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం రైస్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర అభివృద్ధికి మహిళల సాధికారత అత్యంత ముఖ్యమని అన్నారు. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా, తీర్చిదిద్దడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని తెలిపారు.
KKD: కాజులూరులో సోమవారం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కంటైనర్ హాస్పిటల్ ప్రారంభించనున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రామచంద్రపురం నియోజవర్గ పరిధిలో మూడు మండలాల్లో కంటైనర్ ఆసుపత్రులు అందుబాటులో ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కంటైనర్ హాస్పిటల్లో ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు.
సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గంలో సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉచిత శిక్షణ, వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 10 నుంచి పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కార్యాలయ ఇన్‌ఛార్జ్ హరీష్ బాబు తెలిపారు. వివరాలకు 7842054669, 7998255789 నంబర్లకు సంప్రదించాలని కోరారు.
కోనసీమ: మామిడికుదురు మండలం పాసర్లపూడి బొమ్మిడిపాలెం వాడబోది డ్రైన్‌లో వారం రోజుల మగ శిశువు మృతదేహం ఆదివారం లభ్యం కావడం కలకలం స్థానికంగా రేపింది. స్థానికుల సమాచారంతో ఎస్సై చైతన్య కుమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని రాజోలు ఆసుపత్రికి తరలించారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన వారు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పసికందు మరణంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
NDL: కొత్తబురుజులో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం కొత్తగా రూపొందించిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేయనున్నారు. అనంతరం రైతులు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశంపై పలు అంశాలపై చర్చించనున్నారు.
CTR: గొర్రెలను కడిగేందుకు చెరువులోకి దిగి అక్కా చెల్లెళ్లు మృతి చెందిన ఘటన గుడిపల్లి (M) యామిగానిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన భూలక్ష్మి-మునివేంకటప్పకు ఐదుగురు ఆడపిల్లలు. వీరిలో రెండో అమ్మాయి పునీత (17) ఇంటర్ చదువుతుండగా, మూడో అమ్మాయి శ్రావణి (15) 9th చదువుతోంది. ఈ మేరకు నిన్న గొర్రెలను కడిగేందుకు చెరువు వద్దకు వెళ్లగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం.
CTR: కుప్పం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇవాళ కుప్పంలో PGRS కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కడ పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కుప్పం మండల పరిషత్ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే PGRS కార్యక్రమంలో తెలియజేయాలన్నారు.
కృష్ణా: మచిలీపట్నం ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, సెట్టింగ్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ ఆదివారం బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మచిలీపట్నంలో యువత ఎంతో కాలంలో ఎదురుచూస్తున్న ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
TPT: సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానానికి చెందిన వివిధ లైసెన్స్ హక్కులను 2026-27 (ఏడాది) కాలానికి కేటాయించేందుకు ఇవాళ ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నారు. ఈ వేలం కార్యక్రమం దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో జరగనున్నట్లు దేవస్థానం సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి తెలిపారు.
CTR: కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.
PLD: పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు గ్రామంలో ఆదివారం మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని ఉత్తమ సేవలందించిన పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. మహిళలను గౌరవించడం మన దేశ సంప్రదాయమని ఆయన అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యేను సత్కరించారు.
NLR: కందుకూరు మండలం కమ్మవారిపాలెం గ్రామంలో రూ. 38 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన 450 మీటర్ల సీసీ రోడ్డును ఆదివారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేపై పూలవర్షం కురిపించి ప్రజలు అభిమానం చాటుకున్నారు. గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నేపథ్యంలోని గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.