• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తాడిపత్రి అభివృద్ధిపై సీఎం అభినందన

ATP: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ను కలిశారు. మున్సిపాలిటీలో సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు రూ. 22 లక్షల విద్యుత్ బిల్లు ఆదా అవుతున్నట్లు వివరించారు. స్మశానవాటిక అభివృద్ధి, నూతన షాపింగ్ కాంప్లెక్స్ పనుల నమూనాలను అందజేయగా, సీఎం అభినందించారు.

February 28, 2026 / 05:30 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 13 మందికి జైలు శిక్ష

కాకినాడ ట్రాఫిక్ 1,2 పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి 41 మంది మద్యం తాగినట్లు గుర్తించామని ట్రాఫిక్ వన్ సీఐ నూని రమేష్ తెలిపారు. వీరిని శుక్రవారం కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వీరిలో 13 మందికి రెండు నుంచి ఐదు రోజుల జైలుశిక్ష, 28 మందికి రూ.10వేల వంతున జరిమానా విధించారని సీఐ తెలిపారు.

February 28, 2026 / 05:30 AM IST

‘మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం’

సత్యసాయి: కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఎన్కార్డ్ సమీక్ష సమావేశం జరిగింది. ఎస్పీ సతీష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్న ఈ సభలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా నివారణపై చర్చించారు. యువతలో అవగాహన పెంచాలని, విద్యాసంస్థల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఆధునిక సాంకేతికతతో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

February 28, 2026 / 05:09 AM IST

ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే తండ్రి

CTR: నగర పరిధిలో 17వ వార్డు మసీదుమిట్టలో ఎన్‌టీఆర్ సామాజిక భరోసా పింఛన్లను ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవుల నాయుడు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసి ఆప్యాయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, చుడా ఛైర్ పర్సన్ కఠారి హేమలత, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:02 AM IST

తన ఆరోగ్యం పై స్పష్టత నిచ్చిన మాజీ మంత్రి బొత్స

VZM: తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని చీపురుపల్లి MLA, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేసారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో బ్రెయిన్‌ స్టోక్‌తో చేరినట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ, ఇది కేవలం రోటీన్ చెకప్‌ మాత్రమేనని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని వైసీపీ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

February 27, 2026 / 10:00 PM IST

అనకాపల్లి పట్టణంలో ఎల్ఈడీ రోప్ లైట్స్ ఏర్పాటు

అనకాపల్లి పట్టణ పరిధిలో నేషనల్ హైవే బైపాస్ రింగ్ రోడ్డు జంక్షన్ నుంచి శారదా నది వంతెన వరకు, పూడిమడక రోడ్డు జంక్షన్ నుంచి గుండాల జంక్షన్ వరకు అలాగే పలు ప్రాంతాల్లో ఎల్ఈడీ రోప్ లైట్స్ ఏర్పాటు చేశారు. పట్టణ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన లైట్స్ ను శుక్రవారం జనసేన నియోజకవర్గం ఇంఛార్జ్ భీమరశెట్టి రాంకి ప్రారంభించారు.

February 27, 2026 / 10:00 PM IST

ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం

SKLM: ఆమదాలవలస మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల, కళాశాలలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎంవి రత్నకుమారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో మార్చి 4వ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 27, 2026 / 10:00 PM IST

మార్చి 2న పలు రైళ్లు రద్దు

VZM: రైల్వే ఆధునీకరణ కారణాల కారణంగా రైలు నంబరు 58532/ 31 విశాఖపట్నం బ్రహ్మపూర్, బ్రహ్మపూర్ విశాఖపట్నం మార్చి 2న, రద్దు చేస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం పవన్ కుమార్ శుక్రవారం తెలిపారు. అలాగే రైలు నంబరు 67289/ 290 విశాఖపట్నం పలాస, పలాస విశాఖపట్నం మేము పాసింజర్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో చెప్పారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

February 27, 2026 / 09:30 PM IST

‘సహాయం కోసం ఈ నంబర్లకు కాల్ చేయండి’

ELR: మాదకద్రవ్యాల వినియోగంతో యువత భవిష్యత్తు అంధకారమవుతుందని కలెక్టరు వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ హెచ్చరించారు. జిల్లా స్థాయి నిరోధక కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు పిల్లలు బానిసలు కాకుండా తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సూచించారు. వీటిపై సమాచారం లేదా సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు 14446, 1972లను సంప్రదించాలన్నారు.

February 27, 2026 / 09:26 PM IST

జనసేన నేతల మీడియా సమావేశం..!

అన్నమయ్య: రాయచోటి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం పై దాడి చేసిన వారిని, వారి వెనుక ఉన్న కుట్రదారులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర పోలీస్ శాఖను జనసేన నాయకుడు పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి కోరారు. రాయచోటిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 27, 2026 / 09:20 PM IST

పోలీసు కార్యాలయంలో వెల్ఫేర్ డే

PPM: పోలీసు సిబ్బంది యొక్క శాఖాపరమైన, ఆరోగ్య పరమైన పరిష్కారానికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి తెలిపారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా విన్నవించారు. వినతులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

February 27, 2026 / 09:00 PM IST

గురుకులం ప్రవేశ పరీక్ష వాయిదా

AKP: గొలుగొండ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగులు ఖాళీలు భర్తీ చేసేందుకు మార్చి 2న జరగాల్సిన ప్రవేశ పరీక్ష 8వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలు జరుగుతున్నందున ఈ మార్పు చేశారన్నారు.

February 27, 2026 / 09:00 PM IST

పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

TPT: మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులకు ఆదేశించారు. మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో సుమారు 33 వేల మంది విద్యార్థులు 179 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతారని అధికారులు తెలిపారు.

February 27, 2026 / 08:57 PM IST

కుప్పం-పలమనేరు హైవేపై రోడ్డు ప్రమాదం..!

CTR: కుప్పం-పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం వద్ద లారీ ముందువైపు వెళుతున్న ద్విచక్ర వాహనంపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో కెనమాకన పల్లికి చెందిన లోకేశ్ రెడ్డి(25) తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళ్తుండగా తమిళనాడు సేలం నుంచి కలకత్తా వెళ్తున్న లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు.

February 27, 2026 / 08:52 PM IST

కోరుకొండ నరసన్న ఉత్సవాలలో రథోత్సవం

EG: కోరుకొండ గ్రామంలో వేంచేసియున్న స్వయంభు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో శుక్రవారం జరిగిన భారీ రధోత్సవం కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రతి ఏటా జరిగే మహోత్సవాలలో నిర్వహించే రథోత్సవానికి పరిసర గ్రామ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.

February 27, 2026 / 08:50 PM IST