• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రంజాన్ సందర్భంగా అరబ్బీ మదరసాకు సహాయం

కృష్ణా: రంజాన్ సందర్భంగా అరబ్బీ మదరసాకు సహాయం చేయటం ముదావహం అని టీడీపీ జిల్లా మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు మహమ్మద్ హఫీజుర్ రెహమాన్ అన్నారు. మంగళవారం చల్లపల్లిలోని అరబ్బీ మదరసాకు మచిలీపట్టణంకు చెందిన స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ హసీంబేగ్ చొరవతో దాతలు రూ.15వేలు విలువైన బియ్యం, సరుకులు అందచేశారు. మోర్ల శివ, షేక్ నబీఘోరీ, అమీర్ జానీ పాల్గొన్నారు.

February 24, 2026 / 12:02 PM IST

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీతలను అభినందించిన ఎమ్మెల్యే

ATP: రామాయణాన్ని వర్లి చిత్రకళ ద్వారా వినూత్నంగా చిత్రీకరించిన డాక్టర్ ఎం.వరలక్ష్మి, సాయి దీపికలను ఎమ్మెల్యే పరిటాల సునీత అభినందించారు. వర్లి ఆర్ట్ నుంచి తెలుగు అక్షరమాలతో రామాయణాన్ని సృజనాత్మకంగా రూపొందించినందుకు వీరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లభించింది. పాపంపేటకు చెందిన వీరిద్దరూ సాధించిన మెడల్స్, జ్ఞాపికలను చూసి ఎమ్మెల్యే ప్రశంసించారు.

February 24, 2026 / 12:01 PM IST

మాజీ మంత్రిపై మండిపడ్డ ఇంఛార్జ్ మేయర్

NLR: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై నెల్లూరు ఇంఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరోసారి మండిపడ్డారు. మంత్రిగా ఉన్న సమయంలో రూ.వందల కోట్లు సంపాదించి.. నమ్ముకున్న క్యాడర్ను వదిలేసి వెళ్లిపోయారని విమర్శించారు. స్రవంతి మేయర్‌గా ఉన్న సమయంలో ఆమెను సిటీ నియోజకవర్గంలోని రానీయకుండా మూడేళ్లు అనిల్ అడ్డుకున్నారని ఆరోపించారు.

February 24, 2026 / 11:59 AM IST

‘రాంగ్ రూట్లో రాకపోకలను అరికట్టాలి’

GNTR: తెనాలి ఓవర్ బ్రిడ్జి వద్ద నిబంధనలకు విరుద్ధంగా రాంగ్ రూట్లో వాహనాలు నడుపుతుండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. మంగళవారం చెంచుపేట వైపు నుంచి మార్కెట్ వైపు వస్తున్న ఓ కారు రాంగ్ రూట్లో రావడంతో, వంతెనపై దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి రాంగ్ రూట్ రాకపోకలను అరికట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

February 24, 2026 / 11:56 AM IST

బాపట్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు

బాపట్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, అక్రమ రవాణా అరికట్టేందుకు మంగళవారం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా వాహనాల తనిఖీలు, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. వాహనదారులకు హెల్మెట్ వాడకం, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రజల భద్రతే తమ లక్ష్యమని అన్నారు.

February 24, 2026 / 11:55 AM IST

రేపు వైసీపీ విస్తృత సమావేశం

KRNL: హొళగుంద మండల కేంద్రంలో రేపు వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు SR ఫంక్షన్ హాల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొనాలని కన్వీనర్ షఫీ ఉల్లా కోరారు.

February 24, 2026 / 11:55 AM IST

మార్కాపురంలో సీఎం పర్యటన షెడ్యూల్ ఇదే

ప్రకాశం: సీఎం చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబందించిన పర్యటన షెడ్యూల్‌ను CMO అధికారులు విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 12:50కి దోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను పరిశీలించి, మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30కి మార్కాపురంలో బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.

February 24, 2026 / 11:55 AM IST

ఇంటర్ యూనివర్సిటీ సెలెక్షన్ ట్రైయల్స్‌లో విద్యార్థులు ప్రతిభ

అనకాపల్లి: ఈనెల 23న తగలపువలసలో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ సెలెక్షన్స్ ట్రయల్స్‌లో మాకవరపాలెం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. తైక్వాండో విభాగంలో దువ్వు అనురాధ, పోలవరపు దేవి, యడ్ల హాసిని, కరాటే విభాగంలో కెఎన్.లోకనాథ్ తమ తమ విభాగాల్లో మొదటి స్థానాలు సాధించి అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికయ్యారు. వీరిని యూనివర్సిటీ సిబ్బంది అభినందించారు.

February 24, 2026 / 11:53 AM IST

ప్రహరీ గోడ నిర్మాణ పనులు పరిశీలన

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్, కనుపర్తిపాడు లో 22.50 లక్షల రూపాయల వ్యయంతో 2.60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎస్.టి. కాలనీ శ్మశాన వాటికలో పనులు జరుగుతున్నాయి. మంగళవారం ప్రహరీ గోడ నిర్మాణ పనులను కూటమి నాయకులతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.

February 24, 2026 / 11:53 AM IST

రేపు విజయవాడలో సమర శంఖారావం: ఎస్‌టీయూ

W.G: విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఎస్‌టీయూ శంఖారావం కార్యక్రమం చేపట్టినట్టు ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షడు, కార్యదర్శులు కెవి.రామచంద్రరావు, పిఆర్ఆర్‌విఎస్.సాయి వర్మ తెలిపారు. సమర శంఖారావంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు సమస్యల పరిష్కారం కోసం దశల పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.

February 24, 2026 / 11:53 AM IST

పద్మనాభ రెడ్డి.. కాపుల జోలికి రావొద్దు: ఎంపీ సానా

KKD: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ కౌంటర్ ఇచ్చారు. ముద్రగడ అంబటి రాంబాబును పరామర్శించిన నేపథ్యంలో ఎంపీ ఒక ప్రకటన విడుదల చేశారు. పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న పద్మనాభం కాపుల గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని ఎద్దేవా చేశారు. రాజకీయ స్వార్థం కోసం కాపుల ఆత్మ గౌరవాన్ని వినియోగించుకోవద్దన్నారు.

February 24, 2026 / 11:52 AM IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు జాబ్ డ్రైవ్

SKL: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జె.కె.సీ, B.B.Q Nation ఆధ్వర్యంలో నేడు ట్రైనింగ్ కమ్–జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ టి. గోవిందమ్మ తెలిపారు. ఎస్‌.ఎస్‌.సీ ఉత్తీర్ణులై 18 నుంచి 28 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు కోఆర్డినేటర్ వి.ల్యూక్ పాల్‌ను సంప్రదించాలన్నారు.

February 24, 2026 / 11:52 AM IST

మంత్రాలయం అభివృద్ధిపై కీలక సమీక్ష

KRNL: జిల్లా అభివృద్ధిపై మంత్రులు రామానాయుడు, TG భరత్ సమక్షంలో కీలక సమీక్షా సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రాలయం TDP ఇంఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి నియోజకవర్గ పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల అవసరాలపై నివేదిక సమర్పించారు. ఈ నెల 26న CM చంద్రబాబుతో జరిగే సమావేశానికి పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.

February 24, 2026 / 11:48 AM IST

‘నిరంతరం కార్పొరషన్ అభివృద్ధికి కృషి చేశా’

నెల్లూరు కార్పొరేషన్ ఇంఛార్జ్ మేయర్‌గా గడిచిన 70 రోజుల్లో తాను ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టానని రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తన కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. నిరంతరం కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేశానన్నారు. సహకరించిన అన్ని విభాగాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 11:47 AM IST

బేతంచెర్లలో ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ

NDL: బేతంచెర్ల మండలం గోరుమానకొండ సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ఎస్సై తిరుపాలు మంగళవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు.

February 24, 2026 / 11:47 AM IST