• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అమ్మానాన్నపై ప్రేమతో..

తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం ఏఎన్ఆర్ కమ్మపల్లిలో ఓ వ్యక్తి చనిపోయిన తన తల్లిదండ్రులపై ప్రేమచాటుకుంటున్నాడు. గ్రామానికి చెందిన హరి తండ్రి వెంకటరత్నం ఆచారి 2008లో, తల్లి లలితమ్మ 2012లో చనిపోయారు. గతంలోనే తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా శుక్రవారం ఉదయం ఆ పక్కనే తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అభిషేకాలు నిర్వహించారు.

February 27, 2026 / 08:29 AM IST

కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

CTR: నిండ్ర మండలంలోని పాదిరి దళితవాడ నందు రాధా రుక్మిణి శ్రీకృష్ణ దేవాలయం కుంభాభిషేకం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరి నియోజవర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ వారు ఘనంగా స్వాగతం పలికారు . అనంతరం స్వామి వారిని దర్శించుకుని, ఆయనకు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

February 27, 2026 / 08:29 AM IST

బందరు పోర్ట్ రైల్వే బ్రిడ్జి ప్రతిపాదనలు

కృష్ణ: మచిలీపట్నం పోర్ట్‌కు రైల్వే అనుసంధానం మరింత వేగంగా పూర్తయ్యేలా అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే సమర్పించాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓడరేవు రాకపోకలకు ఉపయోగపడే రైల్వే ఓవర్‌, అండర్‌బ్రిడ్జిల నిర్మాణంపై స్పష్టమైన అంచనాలతో నివేదికలు ఇవ్వాలని సూచించారు.

February 27, 2026 / 08:28 AM IST

ఎమ్మెల్యేను కలిసిన తహసీల్దార్

VZM: కొత్తవలస మండల తహసీల్దార్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్.రమాలక్ష్మీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని గురువారం మర్యాదపూర్వకంగా కలసి, పూల మొక్కను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువయ్యేలా చూడాలన్నారు.

February 27, 2026 / 08:28 AM IST

కందులు, శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

NTR: వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో సహకార సంఘం నందు కందులు,శనగల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సహకార సంఘం ఛైర్మన్ నిమ్మల రాజేంద్ర మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులు దళారుల వల్ల నష్ట పోకుండా పెద్దాపురం గ్రామంలోని సహకార సంఘం నందు కందులు, సెనగలు కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

February 27, 2026 / 08:25 AM IST

YCP క్యాడర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

CTR: కేడర్ రిజిస్ట్రేషన్‌లో YCP నాయకులు మాజీ మంత్రి ఆర్కే రోజా ఆదేశాల మేరకు నగరి మున్సిపల్ పరిధి కేవీపీఆర్ పేట, సత్రవాడ, కరకంఠాపురం, ఏకాంబరకుప్పం హరిజనవాడ ప్రాంతాల్లో ఉత్సాహంగా నిర్వహించారు. ప్రతి వార్డుకు చెందిన పార్టీ కార్యకర్తలను గుర్తించి, వారి వివరాలను YCP కేడర్ పోర్టల్లో అధికారికంగా నమోదు చేశారు.

February 27, 2026 / 08:24 AM IST

ఇంటర్ పరీక్షలకు 293 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 293 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆచ్ఐవో లాలప్ప తెలిపారు. మొత్తం 21,428 మందిలో 21,135 మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. పరీక్షలపై సందేహాలుంటే ఆర్ఎవో కార్యాలయ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు. నిబంధనల మేరకు పరీక్షలు సజావుగా నిర్వహించామన్నారు.

February 27, 2026 / 08:23 AM IST

సీఎం చంద్రబాబును కలిసిన వెంకట శివుడు యాదవ్

ATP: విజయవాడ సెక్రటేరియట్‌లోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో నారా చంద్రబాబు నాయుడిని లేబర్ బోర్డ్ ఛైర్మన్ వెంకట శివుడు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుంతకల్లు నియోజకవర్గంలోని పలు కీలక అభివృద్ధి అంశాలపై ఆయనతో చర్చించారు. నియోజకవర్గ సమస్యలను వివరించగా సీఎం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.

February 27, 2026 / 08:20 AM IST

‘బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం’

సత్యసాయి జిల్లా MJP గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ ఆర్. జమునా బాయి తెలిపారు. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 4తో ముగుస్తుందన్నారు. 5వ తరగతి ప్రవేశ పరీక్ష మార్చి 12న ఉంటుందని, 6, 7, 8 తరగతుల ప్రవేశ పరీక్ష మార్చి 19న (మధ్యాహ్నం) ఉంటుందన్నారు.

February 27, 2026 / 08:20 AM IST

కల్తీ నిర్ధారణ అయితే క్రిమినల్ కేసులు

KDP: ప్రొద్దుటూరులో గురువారం జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారులు పాల అమ్మకాలపై తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో 4, కడపలో 7 శాంపిల్స్ తీశామని, మొత్తం11 శాంపిల్స్ సేకరించామని తెలిపారు. వీటిని ప్రభుత్వ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేసి కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

February 27, 2026 / 08:15 AM IST

‘పెండింగ్ పనులపై దృష్టి సారించాలి’

PPM: పాలకొండ పంచాయతీ రాజ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్.రాధారాణి గురువారం కలెక్టర్ డా, ప్రభాకర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై దృష్టి సారించాలన్నారు.

February 27, 2026 / 08:13 AM IST

ఉయ్యూరులో నేడు జాబ్ మేళా

కృష్ణ: ఉయ్యూరు AGSGS కళాశాలలో శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శివనాథ్ వెల్లడించారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు పూర్తి చేసిన అభ్యర్థులు, బీఎస్సీ కెమిస్ట్రీ, ఫార్మసీ విద్యార్థులు, అలాగే డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు పాల్గొనవచ్చన్నారు. అర్హత గల యువత అవసరమైన ధ్రువపత్రాలతో కళాశాల ప్రాంగణంలో హాజరుకావాలని కోరారు.

February 27, 2026 / 08:10 AM IST

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి: ఎస్సై

E.G: ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని గోపాలపురం ఎస్సై పి.శివగణేశ్ సూచించారు. గురువారం గోపాలపురం చెక్ పోస్ట్ సెంటర్‌లో వాహనదారులకు అవగాహన కల్పించారు. రహదారిపై ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయో తెలియదని, ప్రాణాలు కోల్పోతే ఆయా కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించాలని కోరారు.

February 27, 2026 / 08:06 AM IST

రేపు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ జిల్లాకు రాక

TPT: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఫిబ్రవరి 28న జిల్లాకు రానున్నారు. మార్చి 1న దామినేడు వద్ద నూతన జిల్లా కోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు. పర్యటనకు సంబంధించిన భద్రత, పారిశుద్ధ్యం, హెలిప్యాడ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు.

February 27, 2026 / 08:05 AM IST

వైద్య సేవల నాణ్యత పెంచాలి: కలెక్టర్

NDL: జిల్లాలో వైద్య శాఖ సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరగాలంటే సేవల నాణ్యతను మెరుగుపరచాలని కలెక్టర్ రాజకుమారి వైద్యాధికారులకు గురువారం సూచించారు. కలెక్టరేట్ నుంచి జూమ్ ద్వారా మెడికల్ ఆఫీసర్లు, సీహెచ్సీ వైద్యులు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి రోగికి సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలనిన్నారు.

February 27, 2026 / 08:01 AM IST