కోనసీమ: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ప్రకృతి రమణీయత భక్తులను మంత్రముగ్ధులను చేసింది. దట్టమైన మంచు తెరలను చీల్చుకుంటూ ఉదయించిన భానుడి తొలి కిరణాలు ఆలయ రాజగోపురం, శిఖరంపై పడి బంగారు వర్ణంలో ధగధగలాడాయి. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన భక్తులు తమ చరవాణుల్లో ఈ సుందర దృశ్యాలను బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, వికలాంగుల కాలనీల్లో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని ఒక మోటార్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానికులతో సమావేశమై సైబర్ క్రైమ్స్, మహిళల భద్రత, చట్టాలపై అవగాహన కల్పించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
విశాఖ నగరంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కిరెడ్డిపాలేనికి చెందిన తలాడ గోపాలరావు స్కూటీపై బీహెచ్పీ వైపు బయల్దేరారు. మార్గమధ్యంలో జీవీఎంసీ చెత్త లారీ వెనుక నుంచి స్కూటీని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన గోపాలరావు అక్కడికక్కడే మృతి చెందారు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.
W.G: జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. గత 2రోజులుగా జిల్లావ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భీమవరంలో జరిగిన తనిఖీల్లో పట్టుబడిన కల్తీ పాల పదార్థాలను మున్సిపల్ కార్యాలయం వద్ద కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
కృష్ణా: గన్నవరం మార్కెట్‌లో రోజువారీ వినియోగించే ప్రధాన కూరగాయల ధరలు శుక్రవారం ఇలా ఉన్నాయి. టమాటా రూ.14, గులాబీ వంకాయలు రూ.17-18గా నమోదయ్యాయి. ఉల్లి రూ.23, బంగాళాదుంపలు రూ.22గా ఉన్నాయి. దొండ రూ.26, దోస.24, బీట్‌రూట్ రూ.25గా విక్రయమయ్యాయి. క్యాప్సికం రూ.59, ఫ్రెంచ్ బీన్స్ రూ.53గా ఉన్నాయి. బీర రూ.24, పచ్చిమిర్చి రూ.36, నిమ్మకాయలు డజన్‌కు రూ.48/36గా ఉన్నాయి.
ఏలూరులోని తంగెళ్ల మూడి సచివాలయంలో ANMగా పనిచేస్తున్న కామేశ్వరి రాసినట్లు ఉన్న లేఖ సామాజిక మధ్యలో వైరల్‌గా మారింది. పని ఒత్తిడిలో తాను అలసిపోయానని, సెలవు ఇప్పించాలని ఉన్నతాధికారులకు అర్జీ ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నట్లు ఉంది. సెలవు ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పడంతో కామేశ్వరి బుధవారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
E.G: మార్చి నెల NTR సామాజిక భరోసా పెన్షన్ ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. అర్హులైన వృద్ధులు , వికలాంగులు, వితంతువులకు అందజేయనున్నట్లు తెలిపారు. మొదటి తారీకు ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28న తారీఖున లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
PPM: సీతంపేట మండలంలోని ఇప్పగూడ మరో ముస్తాబు గ్రామంగా సిద్దమైంది. ప్రస్తుతం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ‘గ్రామ ముస్తాబు’ పనుల్లో భాగంగా వీధులన్నీ శుభ్రం చేస్తూ, భవన ప్రారంభోత్సవానికి గ్రామస్థులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ఇచ్చిన పిలుపు మేరకు స్పూర్తి, ప్రోత్సాహం ఆలోచనలతో ఆ గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.
CTR: కలెక్టర్ సుమిత్ కుమార్ పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సమగ్ర సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలోని 129 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 24,391 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అన్ని కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
CTR: కలెక్టర్ సుమిత్ కుమార్ పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సమగ్ర సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలోని 129 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 24,391 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అన్ని కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
SKLM: పాతపట్నంలో ఉన్న డా. బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి వచ్చే నెల 2వ తేదీన జరగాల్సిన ప్రవేశ పరీక్ష వాయిదా పడినట్లు ప్రిన్సిపల్ పి. పద్మావతి తెలిపారు. 5వ తరగతి, ఇంటర్ ప్రవేశ పరీక్షలు గతంలో ప్రకటించిన మేరకు 1వ తేదీన నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
GNTR: కొత్తపేట పోలీసులు తెల్లవారుజామునే వెంకటాద్రి పేటలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 54 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రజలతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ వల్ల జీవితాలు ఎలా నాశనమవుతాయో ఆయన వివరించారు.
PLD: ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ భేటీలో, వారు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా గతంలో అందిన ప్రజా దరఖాస్తుల స్థితిగతులపై రూపొందించిన సమగ్ర నివేదికలను మంత్రి లోకేశ్ వారికి అందజేశారు.
VZM: కొత్తవలసలోని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ దుకాణదారుడు తన ఇల్లు, షాపులు తనఖా పెట్టి ఎస్.బి.ఐ నుంచి రూ 36 లక్షలు 2019లో రుణం తీసుకొన్నారు. బ్యాంకు కట్టవలసిన వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడంతో గురువారం రికవరీ బృందం వచ్చి షాపులు, గృహానికి తాళాలు వేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో, చీఫ్ మేనేజర్, పోలీసులు పాల్గొన్నారు.
NDL: శ్రీశైలం ఘాట్ రోడ్డులోని శిఖరేశ్వరం సమీపంలో శుక్రవారం ఉదయం కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే 108 వాహనం నుంచి బాధితులను శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.