• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

దిగువఎరమరాజుపల్లిలో రైతు ఆత్మహత్యయత్నం..!

CTR: కార్వేటినగరం(M) దిగువఎరమరాజు పల్లి గ్రామానికి చెందిన కొందరు నాయకులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ రైతు వెంకటాద్రి రెడ్డి ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు. రైతు పొలం వద్ద సమస్య పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు వచ్చారు. ఈ సమయంలో స్థానిక నాయకులు తమపై దౌర్జన్యం చేశారంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

February 27, 2026 / 04:13 PM IST

పిల్లల ప్రవర్తనను నిరంతరం తల్లిదండ్రులు గమనించాలి

ELR: పిల్లల ప్రవర్తనను నిరంతరం తల్లిదండ్రులు గమనిస్తూ సరైన మార్గ నిర్దేశం చేయాలని ఉంగుటూరు MEO-1రవీంద్ర భారతి అన్నారు. శుక్రవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో జరిగిన ఆడపిల్లలపై లైంగిక దాడుల నివారణ పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బాలల హక్కులు పోక్స్ చట్టంపై అవగాహన కల్పించారు. ఎంఈఓ 2 సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 04:13 PM IST

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ADA

KDP: VN పల్లెలో ఏర్పాటు చేసిన బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కమలాపురం వ్యవసాయ శాఖ ఏడీఏ నరసింహారెడ్డి, ఏవో శ్యాంబాబుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా DCMS ఇన్ఛార్జ్ నాగిరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను పాటించి సొంత ఖర్చుతో విత్తన కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు.

February 27, 2026 / 04:12 PM IST

కాసేపట్లో చిత్తూరుకు రానున్న మంత్రి నాదెండ్ల

CTR: పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాసేపట్లో చిత్తూరుకు రానున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. సాయంత్రం నాలుగు గంటలకు చిత్తూరులో పార్లమెంటరీ పరిధిలోని ముఖ్య నాయకులతో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారని వెల్లడించారు. ఆయనతోపాటు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, హరిప్రసాద్ హాజరవుతారని పేర్కొన్నారు.

February 27, 2026 / 04:12 PM IST

‘అయేషా మీరా కేసు తీర్పు పునరాలోచన చేయాలి’

KRNL: అయేషా మీరా హత్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును పునరాలోచించాలని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రతినిధి రంగయ్య శుక్రవారం డిమాండ్ చేశారు. 19 ఏళ్లుగా న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు. అసలు నిందితులను పట్టుకోలేకపోవడం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కోల్పోతున్నదని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రంగయ్య కోరారు.

February 27, 2026 / 04:11 PM IST

గురుకుల విద్యార్థినుల అస్వస్థతపై అధికారుల స్పష్టీకరణ

PPM: కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైనఘటనపై ఎంపీడీవో కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాదలింగి పీహెచ్‌సీ వైద్యాధికారిణి డా.తనూజా మాట్లాడుతూ.. డయేరియా లక్షణాలు లేవని, నిల్వ పచ్చళ్లు తినడం వల్ల విరేచనాలు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఈ సమావేశంలో డాక్టర్ సందీప్ ఉన్నారు.

February 27, 2026 / 04:10 PM IST

SV శిల్పకళాశాల పూర్వ విద్యార్థులకు సత్కారం

TPT: ముగ్గురు SV శిల్పకళాశాల విద్యార్థులు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కలంకారి వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 16 నుంచి 26 వరకు జరిగిన ఉత్సవంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 మంది ప్రముఖ కళాకారులు పాల్గొనగా.. అందులో SV శిల్పకళాశాల పూర్వ విద్యార్థులు ఏ.ధనుంజయ్, పి.భాను ప్రకాష్, సి.మధు పాల్గొని ప్రతిభ చాటారు. రాష్ట్రపతి వారిని మెమెంటోతో సత్కరించారు.

February 27, 2026 / 04:10 PM IST

రన్నరప్‌గా నిలిచిన ఎమ్మెల్యే బండారు శ్రావణి

ATP: షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎమ్మెల్సీ గ్రీష్మ పోటాపోటీగా తలపడ్డారు. అత్యంత ఉత్సాహంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎమ్మెల్సీ గ్రీష్మ విజేతగా నిలవగా, ఎమ్మెల్యే శ్రావణి రన్నరప్‌గా నిలిచారు. ప్రజా ప్రతినిధులు ఇద్దరూ క్రీడా స్ఫూర్తిని చాటుతూ మైదానంలో చురుగ్గా ఆడటం అందరినీ ఆకట్టుకుంది.

February 27, 2026 / 04:09 PM IST

ధర్మవరంలో సీనియర్ పాత్రికేయులకు ఆత్మీయ సన్మానం

సత్యసాయి: ధర్మవరంలోని ఎన్జీవో హోమ్‌లో జేఏపీ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయుల ఆత్మీయ సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత హరీష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న పత్రికా మిత్రులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సమాజ హితం కోసం, ప్రజల గొంతుకగా నిలిచే పాత్రికేయుల సేవలు అపూర్వమని కొనియాడారు.

February 27, 2026 / 04:07 PM IST

బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి: మాధవ్

ATP: అనంతపురంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ జోనల్ స్థాయి శిక్షణ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిద్ధాంతమే పునాదిగా, కార్యకర్తలే బలమని ఆయన పేర్కొన్నారు. ప్రశిక్షకులకు పార్టీ సైద్ధాంతిక పునాదులు, సంస్థాగత నిర్మాణంపై అవగాహన కల్పించారు.

February 27, 2026 / 04:06 PM IST

ఈవీఎం గిడ్డంగి తనిఖీ చేసిన డీఆర్వో

అనకాపల్లి ఎస్పీ కార్యాలయం సమీపంలో గల ఈవీఎం గిడ్డంగిని జిల్లా రెవిన్యూ అధికారి సత్యనారాయణరావు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం తనిఖీ చేశారు. ప్రధాన ద్వారం సీల్,సీసీ కెమెరాలను పరిశీలించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెలవారి తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను పరిశీలించినట్లు డీఆర్వో తెలిపారు.

February 27, 2026 / 04:05 PM IST

బ్లడ్ టెస్ట్ రిపోర్టుల కోసం ఆదివాసుల పడిగాపులు

ASR: పాడేరు జిల్లా ఆస్పత్రిలో బ్లడ్ టెస్ట్ రిపోర్టుల కోసం గిరిజన రోగులు గంటల తరబడి ఎదురు చూస్తున్నారని కలెక్టరేట్ ఎస్సీ, ఎస్టీ జిల్లా కమిటీ సభ్యుడు చేండా లోహితాసుడు ఆరోపించారు. ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న రోగులకు సమయానికి రిపోర్టులు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యల వల్ల ఈ పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపించారు.

February 27, 2026 / 04:05 PM IST

‘మధ్యాహ్నం భోజనం లో మెనూ సక్రమంగా అమలు చేయాలి’

VZM: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్నం భోజనంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని వేపాడ ఎంఈవో ఎన్ నాగభూషణరావు కోరారు. శుక్రవారం ఆయన చామలాపల్లి అగ్రహారం ఎంపీపీ పాఠశాలను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. టీచర్స్ హ్యాండ్ బుక్, రికార్డులను తనిఖీ చేశారు. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

February 27, 2026 / 04:00 PM IST

కనక దుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే ఈశ్వరరావు

SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి పై కొలువున్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

February 27, 2026 / 04:00 PM IST

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్కు 15 వినతులు

VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరము 15 వినతులు వచ్చినట్టు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకారరావు తెలిపారు. మధురవాడ జోన్‌కు 1, ఈస్ట్ జోన్ 5, సౌత్ జోన్ 2, నార్త్ జోన్ 4, పెందుర్తి జోన్ 3 వినతులు వచ్చాయి. వినతులను నిర్ణీత సమయంలో టౌన్ ప్లానింగు అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు.

February 27, 2026 / 04:00 PM IST