• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పూతలపట్టులో పోలీసుల తనిఖీలు

CTR: పూతలపట్టు మండలంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు సీఐ గోపి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా బండపల్లి, ముత్తిరేవుల పరిసర ప్రాంతాల్లో ఇవాళ తనిఖీలు చేశారు. అనుమానిత ప్రాంతాలు, పాత నేరస్తుల ఇళ్లను పరిశీలించారు. డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.

March 7, 2026 / 09:38 AM IST

సంగమేశ్వర ఆలయం ఎప్పుడైన చూశారా..!

KRNL: కృష్ణమ్మ ఒడి నుంచి క్రమంగా సంగమేశ్వరం గర్భాలయం బయటపడుతోంది. గతేడాది జూన్ 27న గర్భాలయం పూర్తి కృష్ణమ్మ ఒడిలో జలాధివాసమయ్యింది. తిరిగి కృష్ణాజలాలు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం శిఖరభాగం నుంచి 11 అడుగుల మేర బయటపడింది. రెండు వారాల సమయంలో పూర్తి ఆలయం బయట పడే అవకాశముందని పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు.

March 7, 2026 / 09:38 AM IST

విశాఖలో రిజిస్ట్రేషన్ ఆదాయం వివరాలు

VSP: జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి రూ.1,066.19 కోట్ల ఆదాయం లభించింది. జిల్లాలోని తొమ్మిది సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ఈ ఆదాయం నమోదైంది. ఫిబ్రవరి వరకు ప్రభుత్వం నిర్దేశించిన రూ.1,445.7 కోట్ల లక్ష్యంలో 73.75 శాతం సాధించారు. గత ఏడాది ఇదే కాలంలో రూ.949.77 కోట్లు మాత్రమే వచ్చిందాని అదికారులు తెలిపారు.

March 7, 2026 / 09:36 AM IST

నరసరావుపేటలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

PLD: మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ‘ఓపెన్‌ హౌస్‌’ కార్యక్రమాన్ని నరసరావుపేట జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. పోలీసులు విధుల్లో ఉపయోగించే ఆధునిక ఆయుధాలు, తుపాకి ప్రాక్టికల్‌ డెమో ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్ప్‌లైన్‌ నంబర్లు, స్వీయ రక్షణ పద్ధతులపై మెలకువలు వివరించారు.

March 7, 2026 / 09:36 AM IST

ప్రొద్దుటూరులో రేషన్ బియ్యం పట్టివేత..!

KDP: ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లె సమీపంలో శుక్రవారం జిల్లా విజిలెన్స్ అధికారుల బృందం రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బద్వేల్ నుంచి జమ్మలమడుగుకు ఆటోలో రేషన్ బియ్యం తరలిస్తుండగా విజిలెన్స్ బృందం పట్టుకుని స్థానిక రెవెన్యూ పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సుమారు 120 బియ్యం బస్తాలను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

March 7, 2026 / 09:35 AM IST

ఉపాధి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

ELR: జిల్లాలో ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు, బిల్లుల అప్లోడ్ ప్రక్రియను ఈనెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి ఉపాధి హామీ పథకం మారనున్న నేపథ్యంలో, పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సమీక్ష సమావేశంలో స్పష్టం చేశారు.

March 7, 2026 / 09:34 AM IST

సివిల్స్‌లో సత్తాచాటిన జిల్లా వాసి..!

KRNL: జిల్లా చెందిన పవనకుమార్ రెడ్డి సివిల్స్ ఫలితాల్లో 297వ ర్యాంకు సాధించారు. గతేడాది 375వ ర్యాంకుతో IRSకు ఎంపికైన ఆయన, IAS సాధనే లక్ష్యంగా ఢిల్లీలో శిక్షణ పొందారు. నిన్న విడుదలైన ఫలితాల్లో 297 ర్యాంకుతో సత్తా చాటారు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని పవన్ తెలిపారు. మరోసారి ప్రయత్నించి ఉత్తమ ర్యాంకు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

March 7, 2026 / 09:31 AM IST

డ్రైనేజీ సమస్యపై కమిషనర్ తక్షణ చర్యలు

ATP: 31వ వార్డు మస్తాన్‌పేట ఏరియాలో నిలిచిపోయిన మురుగునీటి సమస్యను శనివారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను గమనించి, వెంటనే JCB ద్వారా పూడిక తీయించి డ్రైనేజీ సాఫీగా వెళ్లేలా చూడాలని వార్డు సెక్రటరీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

March 7, 2026 / 09:30 AM IST

పల్లంట్ల రహదారిలో చెత్త కుప్పలు

E.G: దేవరపల్లి-పల్లంట్ల రహదారి పారిశుద్ధ్య లోపంతో డంపింగ్‌ యార్డ్‌ను తలపిస్తోంది. సమీపంలోనే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. నిత్యం రాకపోకలు సాగించే దారిలో చెత్త పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

March 7, 2026 / 09:30 AM IST

నీలకంటరావుపేట ప్రజల ఆవేదన ఇదే..!

అన్నమయ్య: నీలకంటరావుపేట నుంచి రామపురం వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పాడవడంతో ప్రజా రవాణా నిలిచిపోయింది. ఇదే అదునుగా భారీ వాహనాలు కంకరతో యథేచ్ఛగా వెళ్తుండటంతో భారీగా దుమ్ము రేగుతోందని వారు తెలిపారు. దీనివల్ల ఇళ్లన్నీ ధూళితో నిండిపోయి శ్వాసకోస సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.

March 7, 2026 / 09:24 AM IST

పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్

ASR: గంజాయి సాగు, రవాణా, నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు దూరంగా ఉండాలని జీకేవీధి మండలం సీలేరు ఎస్సై ఎండీ.యాసిన్ ప్రజలకు సూచించారు. ఇవాళ లైకంపూర్, చింతూరుపల్లిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. అనంతరం స్థానికులతో సమావేశమయ్యి, అనుమానిత వ్యక్తులు గ్రామాల్లోకి ప్రవేశిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు

March 7, 2026 / 09:20 AM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..!

NDL: కొలిమిగుండ్ల మండలం పెట్టికోట గ్రామంలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెట్టికోట గ్రామం వద్ద స్కార్పియో వాహనం రాముడు అనే వ్యక్తిని ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుని కుమారుడు నాగపుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.

March 7, 2026 / 09:19 AM IST

ఎమ్మెల్సీకు ట్రోఫీ అందజేసిన సీఎం

VZM: విజయవాడలో జరిగిన ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల్లో జిల్లా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ సత్తా చాటారు. వాలీబాల్, రన్నింగ్, టేబుల్ టెన్నీస్ వంటి వివిధ అంశాల్లో ఆమె ప్రథమ స్థానంలో నిలిచి అందరినీ ఆకట్టుకున్నారు. ‘ఆట విడుపు’ పేరిట శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఆమెకు ట్రోఫీని అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.

March 7, 2026 / 09:15 AM IST

మెరిట్ స్కాలర్షిప్‌కు ముగ్గురు విద్యార్థులు ఎంపిక

NTR: నందిగామ మండలం చందాపురం జిల్లా పరిషత్ పాఠశాల 2025 నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్‌కు ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అట్లూరి రాజశేఖర్ శుక్రవారం తెలిపారు. మాడుగుల జెస్సీ, పిల్లి శ్రావ్య, మాడుగుల అన్వేష్ ప్రతి సంవత్సరం ఒక్కొక్క విద్యార్థికి కేంద్ర ప్రభుత్వం 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కాలర్షిప్ అందజేస్తుందని అన్నారు.

March 7, 2026 / 09:14 AM IST

చిన్నహ్యాటలో పర్యటించిన ఎమ్మెల్యే

KRNL: హోలుగుంట మండలం చిన్నహ్యాట గ్రామంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి శుక్రవారం పర్యటించారు. గ్రామ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

March 7, 2026 / 09:13 AM IST