కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని న్యాయవాదులకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. క్రిమినల్ లా ప్రాక్టీస్ లో కనీసం 7 ఏళ్ల అనుభవం, సెషన్స్ కేసులు నిర్వహించిన వారు అర్హులన్నారు.
CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీవారు సింహ ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి ఉత్సవ మూర్తిని యోగ నారాయణస్వామి రూపంలో అర్చకులు అలంకరించి పూజలు నిర్వహించారు. తర్వాత సింహ వాహనంపై శ్రీవారిని కొలువుదిర్చి పురవీధుల్లో ఊరేగించారు.
AKP: యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని పెదపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీవిశాలాక్షి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. రేజేటి శ్రీరామాచార్యులు చేతుల మీదుగా వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. సంప్రోక్షణ, జలాధివాసం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం నిర్వహించి దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్టించారు.
NLR: నెల్లూరు మేయర్ ఎన్నికకు YCP కార్పొరేటర్లు దూరమయ్యారు. ఆ పార్టీ పెద్దల ఆదేశాలతోనే కౌన్సిల్ సమావేశానికి ఎవరు హాజరు కాలేదని సమాచారం. ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి నెల్లూరుకు గురువారం జగన్ వచ్చారు. కార్పోరేటర్లు అందరూ ఆయన వద్దకు వెళ్లారు. మరోవైపు టీడీపీ కార్పొరేటర్ అందరూ సమావేశానికి వచ్చారు.
శ్రీకాకుళం పట్టణంలో ఇటీవల జరిగిన డయేరియా ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటిస్తారని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉదయం 10:30 గంటలకు మంగు వారి తోట కండ్ర వీధితో పాటు పలు ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన వివరించారు. అధికారులకు ఇప్పటికే సమాచారం అందించామని తెలియజేశారు.
శ్రీకాకుళం పట్టణంలో ఇటీవల జరిగిన డయేరియా ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటిస్తారని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉదయం 10:30 గంటలకు మంగు వారి తోట కండ్ర వీధితో పాటు పలు ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన వివరించారు. అధికారులకు ఇప్పటికే సమాచారం అందించామని తెలియజేశారు.
KDP: ఏసీబీ దాడుల్లో దొరికిన పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ ఇంట్లో ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఇందులో రూ. 6 లక్షల నగదు, 200 గ్రాముల బంగారం, 54 విదేశీయ మద్యం బాటిల్లు, విలువైన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం నగదు సీఐ రెండో భార్య ఇంట్లో గుర్తించారు. ఇందులో డీఎస్పీ మురళీ నాయక్ ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
GNTR: ఆత్మహత్యలకు కారణమవుతున్న ‘పారాక్వాట్’ గడ్డిమందును నిషేధించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. గురువారం అసెంబ్లీ జీరో అవర్‌లో ఆమె మాట్లాడారు. ఇది సైలెంట్ కిల్లర్‌గా మారిందని, 5 ఎంఎల్ తాగినా ప్రాణాలు పోతున్నాయన్నారు. దీనికి ఎలాంటి విరుగుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ, పంజాబ్ తరహాలో ఏపీలోనూ ఈ గడ్డిమందును తక్షణమే నిషేధించాలని కోరారు.
BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పిట్టలవానిపాలెం మండలం చందోలు ఎస్.టి. యానాది కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బుధవారం ఉదయం ఇంటింటికీ తనిఖీలు చేసి వివరాలు సేకరించారు. పత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. శాంతిభద్రతల కోసం తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.
BPT: వేదుళ్లపల్లి పరిధిలోని స్టువర్టుపురంలో ఎస్సై భాగ్యరాజు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. మన్యం లక్ష్మి అనే వ్యక్తి నుంచి 4 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. నాటు సారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని ఎస్ఐ సూచించారు.
AKP: టీటీడీకి చెందిన నక్కపల్లి మండలం ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాలకు గురువారం ఉదయం శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవాలకు ప్రారంభ సూచికగా ఉత్సవ కావిడితో తిరువీధి సేవ నిర్వహించారు. సాయంత్రం విష్వక్సేన పూజ పుణ్యాహవాచనం కంకణ ధారణ, అంకురార్పణ, గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.
KRNL: దేవనకొండ(M) కరివేముల గ్రామ శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి రూ.15,000 విరాళం అందించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలకు శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రాముని పరిపాలన ప్రపంచానికే ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్.కె. శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
ATP: గుంతకల్లు మీదుగా వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాస్కోడిగామా వరకు వెళ్లే షాలీమార్, తిరుపతి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లను ఏప్రిల్ నుంచి జూన్ వరకు హుబ్లీ స్టేషన్ వరకే పరిమితం చేశామని అన్నారు. హుబ్లీ-వాస్కోడిగామా మధ్య ఈ రైళ్లు నడవవని, ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని కోరారు.
NLR: తెలుగుదేశం పార్టీ నెల్లూరు మేయర్ అభ్యర్థిగా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఖరారు అయ్యారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి ఆమె పేరును అధికారికంగా గురువారం ప్రకటించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో సుజాతను పరిచయం చేశారు.
SKLM: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌ను మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, తదితరులు బుధవారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో కలుసుకున్నారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. డయేరియాతో చనిపోయిన వారి సంఖ్య ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.