• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రైల్వే స్టేషన్ వద్ద వృద్ధుడి మృతి

నంద్యాల 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద ఓ వృద్ధుడు మృతి చెందినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు CI నంబర్ 91211 01088కు సమాచారం ఇవ్వాలని కోరారు.

February 24, 2026 / 09:05 AM IST

శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్న బ్రహ్మశ్రీ చాగంటి

TPT: ప్రముఖ ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం శ్రీకాళహస్తికి విచ్చేశారు. దర్శనం అనంతరం ధూర్జటి కళా ప్రాంగణంలో విశిష్టతపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ప్రతిసారి స్వామి వారిని దర్శించుకోవడం నా భాగ్యమని తెలిపారు. భక్తులకు సౌకర్యాలు మెరుగ్గా అందుబాటులో ఉన్నాయని ప్రశంసించారు.

February 24, 2026 / 09:04 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో’

KDP: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసులు ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని ముమ్మరంగా అమలు చేస్తున్నారు. అర్ధరాత్రి దాటాక ప్రయాణించే లారీ, బస్సు, కార్ల డ్రైవర్లను ఆపి, వారి నిద్రమత్తు వదిలించేలా స్వయంగా నీళ్లతో ముఖం కడిగించి పంపుతున్నారు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా సురక్షిత ప్రయాణం చేయాలని పోలీసులు డ్రైవర్లకు సూచిస్తున్నారు.

February 24, 2026 / 09:04 AM IST

రీ-ఓపెన్ అర్జీలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

NDL: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 311, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 176 అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల అసంతృప్తి కారణంగా 283 దరఖాస్తులు రీ-ఓపెన్ అయ్యామన్నారు.

February 24, 2026 / 09:04 AM IST

నరసాపురం డిపోలో ఎర్ర బ్యాడ్జీలతో నిరసన

W.G: ఆర్టీసీలోని 12 డిపోలను పినాకిల్ సంస్థకు అప్పగించాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ నరసాపురం డిపో కార్మికులు మంగళవారం నిరసన చేపట్టారు. NMUA పిలుపు మేరకు తెల్లవారుజాము నుంచే ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయడం సరికాదని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు.

February 24, 2026 / 09:02 AM IST

ఒంగోలులో శక్తి యాప్‌పై అవగాహన

ప్రకాశం: ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్, టౌన్ పరిసర ప్రాంతాలలో సోమవారం పోలీసులు మహిళలకు శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, విద్యార్థుల స్మార్ట్ ఫోన్లలో శక్తి యాప్‌ని డౌన్లోడ్ చేయించి, దాని ఉపయోగాలను పోలీసులు వివరించారు. అత్యవసర సమయంలో ఈ యాప్ ద్వారా పోలీసులను సంప్రదిస్తే, వారు వెంటనే మహిళల వద్దకు చేరుకొని రక్షణ కల్పిస్తారని తెలిపారు.

February 24, 2026 / 09:02 AM IST

చిప్పగిరిలో జనసేన కార్యకర్తలకు పిలుపు..!

KRNL: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటినుంచే చిప్పగిరిలో కార్యకర్తలు సన్నద్ధం కావాలని జనసేన పార్టీ కన్వినర్ చిరంజీవి సోమవారం పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. యువత, మహిళలను పార్టీలో చురుకుగా భాగస్వాముల్ని చేయడం ద్వారా జనసేనకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు.

February 24, 2026 / 09:01 AM IST

లోకేశ్‌తో చీపురుపల్లి ఎమ్మెల్యే ఆత్మీయ సమ్మేళనం

VZM: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం మేరకు ఉండవల్లిలోని ఆయన నివాసంలో శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, యువనేత కిమిడి రామ్ మల్లిక్ నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

February 24, 2026 / 08:57 AM IST

చిత్తూరులో రాత్రి 10 తర్వాత దుకాణాలు మూసివేత

చిత్తూరులో రాత్రి 10 గంటలలోపు దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని తాలూకా, బీఎన్ఆర్ పేట ఎస్ఐలు ఆదేశించారు. దొడ్డిపల్లి, పెనుమూరు క్రాస్, మురుకంబట్టు ప్రాంతాల్లో గస్తీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 24, 2026 / 08:54 AM IST

నేడు కాకినాడలో జాబ్ మేళా

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. డీమార్ట్, స్మార్ట్ మీటర్లు ఇనిస్టాలేషన్, ఎక్షమో, ఆక్వా ఎక్స్ పోర్టు తదితర సంస్థల్లో పని చేసేందుకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 18-32 ఏళ్లు ఉన్న నిరుద్యోగులు హాజరు కావాలన్నారు.

February 24, 2026 / 08:53 AM IST

ఈ నెల 28 న మండల సర్వసభ్య సమావేశం

VZM: ఈ నెల 28న వంగర మండల పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశ జరగనుందని MPP ఉత్తరావెల్లి సురేశ్‌ ముఖర్జీ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక MPDO కార్యాలయంలో మాట్లాడుతూ… శనివారం ఉదయం 10:30 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుందన్నారు. అన్ని శాఖల మండల స్థాయి అధికారులు సమగ్ర అభివృద్ధి నివేదికలతో రావాలని సూచించారు.

February 24, 2026 / 08:52 AM IST

రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన

కడప: అంబేద్కర్ సర్కిల్ వద్ద సోమవారం రాత్రి చిన్నచౌక్ ఎస్సై రాజరాజేశ్వర రెడ్డి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చినా.. మోడిఫైడ్ సైలెన్సర్లు వాడినా.. వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని సూచించారు.

February 24, 2026 / 08:49 AM IST

28నే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ATP: జిల్లాలో మార్చి నెల పింఛన్లను ఈ నెల 28వ తేదీనే పంపిణీ చేయనున్నారు. మార్చి 1 ఆదివారం కావడంతో ప్రభుత్వం ఒకరోజు ముందుగానే నగదు అందజేయాలని నిర్ణయించింది. జిల్లాలోని 2.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.123 కోట్లు పంపిణీ కానున్నాయి. ఆ రోజున అందుకోలేని వారు మార్చి 2న సచివాలయాల్లో తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.

February 24, 2026 / 08:49 AM IST

పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్

ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో గణపవరం, భీమడోలు నారాయణపురం జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గణపవరం సీఐ రజిని కుమార్ పర్యవేక్షణలో పోలీసులున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేటట్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు పేర్కొన్నారు.

February 24, 2026 / 08:49 AM IST

జీవీఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

విశాఖ: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విశాఖలోని జగదాంబ జంక్షన్, పూర్ణా మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ప్రాంతాల్లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికుల పనితీరును ప్రశంసిస్తూ, అంకితభావంతో కొనసాగించాలని సూచించారు. వీధి దీపాల నిర్వహణ, వ్యర్థాల సేకరణను బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

February 24, 2026 / 08:48 AM IST