KDP: సిద్దవటం మండలంలోని కొత్త మాధవరం 123 వార్డులో వెలసిన శ్రీ భక్త వీరాంజనేయ స్వామికి మంగళవారం విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం,అలంకరణ ,గణపతి పూజ, ఆకు పూజ, వడమాల పూజ, సహస్రనామార్చన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
CTR: వేద పండితుల సూచనల మేరకు శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం మంగళవారం ఉదయం 9:00 గంటలకు మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం 6:00 గంటలకు ఆలయ శుద్ధి నిర్వహించి, అమ్మవారికి అభిషేకం చేస్తారని తెలిపారు. అనంతరం భక్తులకు దర్శనాలు యథావిధిగా కల్పించబడతాయి.
సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు చాఫ్ కట్టర్ మిషన్లను ఎమ్మెల్యే ఎంఎస్.రాజు పంపిణీ చేశారు. మెలవాయి, కళ్ళుమరి, రేకులకుంట, ఏఆర్ రూపం గ్రామాల నుంచి వచ్చిన రైతులకు ఈ యంత్రాలను అందజేశారు. పశుగ్రాసం వృథా కాకుండా చూసేందుకు ఈ మిషన్లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
సత్యసాయి: వినియోగదారుల హక్కుల రక్షణకు జిల్లా యంత్రాంగం కొత్త ఫిర్యాదుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. రేషన్ సరుకుల పంపిణీ, గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్ బంకుల్లో అక్రమాలపై 08555-288566 నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. నిత్యావసర వస్తువుల సరఫరాలో పారదర్శకత కోసం ఈ సదుపాయాన్ని కల్పించామన్నారు.
W.G. తణుకు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్సకు సైతం ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయనిది అండగా ఉంటుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. సోమవారం టిడిపి కార్యాలయంలో సుమారు 40 మందికి సీఎం సహాయ నిధులు రూ. 24,29,807 మంజూరు కాగా, ఆ చెక్కులను లబ్ధిదారులకు అందించడమైనది. వారు చికిత్స తీసుకుని, త్వరగా కోలుకుని ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు.
సత్యసాయి: నీలకంఠాపురం దేవస్థానంలో కదిరి పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, సత్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఉదయం పంచామృతాభిషేకం, అలంకార తిరుమంజనం, సత్యనారాయణ స్వామి వ్రతాలు శాస్త్రోక్తంగా జరిగాయి. మేళతాళాలతో స్వామివారి ఉత్సవ మూర్తి ఊరేగింపు, ప్రాకారోత్సవం కన్నుల పండువగా సాగాయి.
అన్నమయ్య: కొత్తపల్లి గ్రామంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే మల్లూరమ్మ తల్లి జాతరకు మంత్రి రాంప్రసాద్ రెడ్డిని టీడీపీ నాయకులు, ఆలయ ధర్మకర్తలు ఆహ్వానించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి, ట్రాఫిక్ సమస్యలు లేకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో అమ్మవారి జాతరల్లో ఈ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉందని నాయకులు తెలిపారు.
కోనసీమ ముద్దుబిడ్డ, భారత లోక్ సభ మాజీ స్పీకర్ గంటి మోహన చంద్ర బాలయోగి సేవలు అజరామరమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం బాలయోగి వర్ధంతి సందర్భంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. బాలయోగి కోనసీమ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు.
KRNL: నందికొట్కూరు ఎస్సై మణికంఠ మద్యం తాగే వారిని మంగళవారం హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం ప్రజా భద్రతకు భంగం కలిగిస్తుందన్నారు. పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదని సూచించారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే చట్టపరమైన చర్యలు తప్పవని SI వెల్లడించారు.
E.G: చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం మూసివేశారు. ఉదయం 9:30 గంటలకు ఆలయ ద్వారాలను మూసినట్లు సహాయ కమిషనర్ బి.హరి సూర్య ప్రకాశ్ తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రహణం కారణంగా ఇవాళ జరగాల్సిన అన్ని పూజా కార్యక్రమాలు రద్దు చేసినట్లు దేవులపల్లి రవిశంకర్ తెలిపారు.
ప్రకాశం: కొనకనమిట్ల మండలం పెద్దారికట్ల సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని మంగళవారం డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వసతి గృహంలో కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు మరియు పారిశుద్ధ్యాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఆయన ఆహార నాణ్యత పై సంతృప్తి వ్యక్తం చేశారు.
SKLM: సారవకోట మండలంలోని తొగిరి గ్రామంలో నిర్మించిన బస్ షెల్టర్ నిరూపయోగంగా ఉంది. వడ్డినవలస నుంచి బుడితి వెళ్లే ఈ మార్గంలో కొన్నేళ్ల క్రితం బస్సు నడిచేది. ఆ సమయంలో ప్రయాణికులు నిరీక్షించేందుకు ఈ షెల్టర్ నిర్మించారు. కానీ ప్రస్తుతం ఆ బస్సు ఇప్పుడు లేకపోవడంతో నిరూపయోగంగా మారింది. దీంతో స్థానికులు కర్రలు, ద్విచక్ర వాహనాలు భద్రపర్చుకుంటున్నారు.
NTR: కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలో సర్పంచ్ బొక్క రవికుమార్ ఆధ్వర్యంలో బ్లీచింగ్ పౌడర్ చల్లింపు కార్యక్రమం జరిగింది. రోడ్లు, డ్రేన్లు శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లి, సానిటైజేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో మెరుగైన పారిశుధ్యం, ఆరోగ్య పరిరక్షణకు ఈ కార్యక్రమం చేపట్టామని సర్పంచ్ తెలిపారు.
WG: ఆకివీడు సీఐ జగదీశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. డెడ్ బాడీ పార్సెల్ నిందితుడు సుధీర్ వర్మపై వచ్చిన ఫిర్యాదులో పోక్సో (POCSO) కేసు నమోదు చేయలేదనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. కాగా, 2024 ఆగస్టులో ఆకివీడు సీఐగా నియమితులయ్యారు.
NLR: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై మాజీ మంత్రి కాకాణి ‘X’లో స్పందించారు. హిందూ ధర్మ పరిరక్షణ అనేది టీటీడీ ప్రధానమైన బాధ్యత అని అన్నారు. ‘తిరుమలలో ప్రతిచోటా కనిపించే ధర్మో రక్షతి రక్షితః గురించి నీకు తెలియదా బీఆర్ నాయుడు?’ అంటూ ప్రశ్నించారు. భగవద్గీత గురించి బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మాన్ని, టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయన్నారు.