• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సోమందేపల్లిలో రంజాన్ నాలుగవ ఉపవాస దీక్ష నిర్వహణ

సత్యసాయి: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సోమందేపల్లిలోని జామియా మజీద్‌లో ఆదివారం నాలుగవ ఉపవాస దీక్షను ముస్లిం మైనారిటీ సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే మజీద్‌కు చేరుకున్న ముస్లింలు వజు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పవిత్ర ఖురాన్ పారాయణం, నమాజ్ నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణంలో ఉపవాస దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా ఐక్యతను చాటారు.

February 22, 2026 / 08:00 AM IST

శ్రీశైలం VIP కాటేజీలో చెలరేగిన మంటలు

NDL: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. భక్తుల బస కోసం కేటాయించిన ఓ వీఐపీ కాటేజీలోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

February 22, 2026 / 07:51 AM IST

104 మంది సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు

ATP: శెట్టూరు మండలంలో విధులకు గైర్హాజరైన 104 మంది గ్రామ సచివాలయ సిబ్బందికి ఎంపీడీవో జిలానీబాషా శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలైనా కార్యాలయాలకు రాకపోవడం, సర్వేలపై నిర్లక్ష్యం వహించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఏఎన్ఎంలు, మహిళా పోలీసులకు నోటీసులు ఇచ్చారు.

February 22, 2026 / 07:51 AM IST

నర్సీపట్నంలో ఘనంగా కాళికామాత పండుగ

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆదివారం ఉదయం ఘనంగా శ్రీ కాళికామాత పండుగను నిర్వహించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే పండుగలో పాల్గొనడానికి భక్తులు హాజరయ్యారు. కాళికామాతను డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని గుడివరకు ఊరేగింపుగా తీసుకువెళ్తారు. మధ్యాహ్నం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు.

February 22, 2026 / 07:48 AM IST

ఎచ్చెర్ల ఎంపీపీగా విజయ్ కుమార్‌కి బాధ్యతలు

SKLM: ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి కొన్ని రోజుల నుంచి అందుబాటులో లేకపోవడంతో మండల పరిషత్తు కార్యక లాపాలు సజావుగా నిర్వహించేందుకు ఉప ఎంపీపీ-2 జరుగుళ్ల విజయ కుమారికి ఎంపీపీ బాధ్యతలు నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

February 22, 2026 / 07:45 AM IST

‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ను విజయవంతం చేయండి’

NLR: ప్రతి కుటుంబ సమగ్ర వివరాలను సేకరించడమే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ముఖ్య ఉద్దేశమని ఎంపీడీవో రంతులయ్య తెలిపారు. సర్వే అనంతరం ప్రతి కుటుంబానికి ఒక యూనిట్ ఫ్యామిలీ ఐడిని కేటాయించనున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ సర్వేలో ప్రజలు భాగస్వామ్యమై విజయవంతం చేయాలని ఆయన కోరారు. సర్వే కోసం వచ్చిన సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు.

February 22, 2026 / 07:45 AM IST

గెలిస్తే రూ. 35 వేల బహుమతి

KDP: VN పల్లె(M) తలపనూరు గ్రామంలోని గంగమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 26న బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నాగిరెడ్డి శనివారం తెలిపారు. బహుమతులు వరుసగా రూ. 35వేలు, రూ. 30వేలు, రూ. 25 వేలు,రూ. 20 వేలు, రూ.15వేలు ఇలా 12 బహుమతులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఉదయం 7 గంటలకే ఈ పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు.

February 22, 2026 / 07:44 AM IST

‘చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి’

VZM: విజయనగరం మహారాజా అయోధ్య మైదానంలో, ‘మై భారత్’ జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్లు, వాలీబాల్ కిట్లను అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.

February 22, 2026 / 07:41 AM IST

గుంటూరులో నేటి నాన్‌వెజ్ ధరలు ఇవే!

GNTR: గుంటూరు నగరంలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 190 కాగా, స్కిన్‌తో రూ. 170కి విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 960 వద్ద కొనసాగుతోంది. ఇక చేపల విషయానికొస్తే కొరమేను రూ. 420, బొచ్చ రూ. 230, రాగండి రూ. 170 ధర పలుకుతున్నాయి. ప్రాంతాలను బట్టి ఈ రేట్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

February 22, 2026 / 07:39 AM IST

మహిళ ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు

సత్యసాయి: ధర్మవరం టూటౌన్ పరిధిలో భార్యను చంపేందుకు కుట్ర పన్నిన భర్త దాశరథి, అతని స్నేహితుడు మన్సూర్‌పై కేసు నమోదైంది. తన భర్తకు, మన్సూర్‌కు మధ్య అనైతిక సంబంధం ఉందని, ఈ విషయం బయటపెట్టినందుకు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు తులసి ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రెడ్డెప్ప శనివారం తెలిపారు.

February 22, 2026 / 07:33 AM IST

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి

కృష్ణా: మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి కొల్లు రవీంద్ర నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బయో మెడికల్ వ్యర్థాల ట్రాకింగ్ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం డాక్టర్లు ఆస్పత్రి సిబ్బందితో సమావేశమై ఆస్పత్రిలో ఉన్న ఎక్విప్‌మెంట్ పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని, అవసరమైన పరికరాలను తక్షణమే ఏర్పాటు చేస్తామని భరోసా తెలిపారు.

February 22, 2026 / 07:33 AM IST

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు: సీఐ

SKLM: పలాస కాశీబుగ్గ పట్టణంలో సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురి వ్యక్తులు పట్టుబడినట్లు సీఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

February 22, 2026 / 07:32 AM IST

ఓటర్ల మాపింగ్ వేగవంతం చేయాలి

TPT: అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల మాపింగ్ శాతాన్ని పెంచాలని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ఎన్.మార్య సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం ఆమె సమావేశం నిర్వహించారు. 2025 జాబితాను 2002 జాబితాతో సరిపోల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

February 22, 2026 / 07:32 AM IST

చిన్నారిపై అత్యాచారయత్నం.. కేసు నమోదు

ATP: పామిడి మండలంలోని ఓ తండాకు చెందిన సెటానాయక్ అనే వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మూడవ తరగతి చదువుతున్న చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

February 22, 2026 / 07:30 AM IST

VIDEO: కారు ఢీకొని వృద్ధుడు మృతి

ELR: బుట్టాయిగూడెం మండలం నందాపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి దాటుతున్న పాయల సుబ్బారావు (60) అనే వ్యక్తిని వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న కారు వేగంతో వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో సుబ్బారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

February 22, 2026 / 07:28 AM IST