• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పిల్లలకు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు పాటించండి’

VSP: అతిసార వ్యాధి సోకకుండా పిల్లల రక్షణకు జాగ్రత్తలు పాటించాలని విశాఖ జీవీఎంసీ కమీషనర్ కేతాన్ గార్గ్ సూచించారు. సబ్బు, నీటితో చేతులు శుభ్రంగా కడగాలని, శుభ్రమైన తాగునీటిని ఉపయోగించాలని సూచించారు. మొదటి ఆరు నెలలు పిల్లలకు తప్పనిసరిగా తల్లి పాలు మాత్రమే తాగించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎల్లప్పుడూ మరుగుదొడ్డిని ఉపయోగించాలన్నారు.

March 2, 2026 / 10:27 AM IST

రేపు చంద్ర గ్రహణం ఆలయాలు మూసివేత

PPM: మార్చి 3న సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా మండలంలోని తోటపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఆలయ తలుపు లు మూసి వేయనున్నట్లు ఈఓ డి.శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. గ్రహణం అనంతరం బుధవారం గ్రహణ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటల నుంచి స్వామి వారి సర్వ దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు.

March 2, 2026 / 10:25 AM IST

నేటి నుంచి కదిరి పౌర్ణమి మహోత్సవాలు

CTR: పుంగనూరు మండలం గుట్టపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కదిరి పౌర్ణమి మహోత్సవాలు సోమవారం నుంచి 2 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం స్వామివారికి అభిషేకాలు, హోమాలు రామకోటి మహా యజ్ఞం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరిచారు. భక్తాదులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

March 2, 2026 / 10:24 AM IST

మేకడోణలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

KRNL: పెద్దకడబూరు మండలంలోని మేకడోణ గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డు నిర్మాణానికి టీడీపీ నాయకులు హజరత్ వలి, రాఘవరెడ్డి, ఉలిగయ్య భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబుతోనే గ్రామ సుపరిపాలన సాధ్యమని స్పష్టం చేశారు. గత వైసీపీ హయాంలో గ్రామాభివృద్ధిని గాలికి వదిలేశారని ఆరోపించారు.

March 2, 2026 / 10:21 AM IST

విజయవాడలో ఆక్రమణలు తొలగింపు

NTR: విజయవాడలో ఫుట్‌‌పాత్‌ ఆక్రమణలను సోమవారం పోలీసులు తొలగించారు. కేదరాశ్వర్ పేట నుంచి ఎర్రకట్ట వరకు ఇరువైపులా ఫుట్‌పాత్‌పై నెలకొన్న వ్యాపార దుకాణాలు తొలగించారు. పాదచారుల సౌకర్యంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఫుట్‌పాత్‌పై ఆక్రమణలను తొలగిస్తున్నట్లు ట్రాఫిక్‌ ఎస్సై వెంకట్ కుమార్ తెలిపారు.

March 2, 2026 / 10:19 AM IST

ప్రొద్దుటూరు హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య

KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని SC హాస్టల్లో విద్యార్థి మృతి కలకలం రేపింది. మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన తలారి నరసింహులు (15) 10వ తరగతి చదువుతున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ రాత్రి హాస్టల్ ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 2టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 2, 2026 / 10:15 AM IST

‘వాల్మీకుల ST రిజర్వేషన్ కోసం పోరాటానికి సిద్ధం కావాలి’

అన్నమయ్య: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం కోసం క్షేత్రస్థాయి పోరాటానికి శ్రీకారం చుట్టాలని వాల్మీకి రిజర్వేషన్ సేవా సంఘం (VRSS) రాష్ట్ర అధ్యక్షులు పొదల నరసింహులు పిలుపునిచ్చారు. ఆదివారం మదనపల్లిలో జరిగిన భవిష్యత్తు కార్యచరణ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

March 2, 2026 / 10:15 AM IST

గ్రామాల్లో సైబీరియన్ పక్షుల సందడి

SS: చిలమత్తూరు మండలం వీరాపురం, వెంకటాపురం గ్రామాలకు సైబీరియన్ పక్షులు భారీగా చేరుకుని సందడి చేస్తున్నాయి. ఏటా చలికాలంలో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఈ విదేశీ పక్షులు ఇక్కడి చెట్లపై విడిది చేసి సంతానోత్పత్తి సాగిస్తాయి. స్థానిక ప్రజలు వీటిని దైవసమానంగా భావిస్తూ రక్షణ కల్పిస్తున్నారు. పక్షుల రాకతో ఈ గ్రామాలు పర్యాటక ప్రాంతాలుగా మారుతున్నాయి.

March 2, 2026 / 10:05 AM IST

బుచ్చిలో అగ్నిప్రమాదం

NLR: బుచ్చి పట్టణంలోని కరిముల్లా తోపుడు మిషన్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. విద్యుత్ మీటర్లతో పాటు రెండు మోటర్లు, తోపుడు పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో లక్ష రూపాయలు నష్టపోయానని యజమాని కరిముల్లా వాపోయారు

March 2, 2026 / 10:05 AM IST

‘పులి సంచారంపై పుకార్లు నమ్మకండి’

E.G: గోకవరం మండలంలో పులి సంచరిస్తోందన్న పుకార్లతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గతంలో రాయవరం వద్ద పట్టుబడిన పులిని మారేడుమిల్లి అడవుల్లో విడిచిపెట్టగా, అది మళ్లీ జనావాసాల్లోకి వచ్చిందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే అటవీశాఖ అధికారులు తనిఖీలు చేసి పులి జాడ లేదని స్పష్టం చేశారు. సారా వ్యాపారులే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

March 2, 2026 / 10:02 AM IST

63 హైవేపై రోడ్డు ప్రమాదం.. తీవ్రగాయాలు

ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని 63 హైవేపై సోమవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుశీల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

March 2, 2026 / 10:02 AM IST

రేపు యనమలకుదురు ఆలయం మూసివేత..!

కృష్ణా: చంద్రగ్రహణం సందర్భంగా పెనమలూరు మండలంలోని యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మూసి వేయనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎన్. భవాని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు ఆలయాన్ని మూసివేసి తిరిగి 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు తెరవనున్నట్లు ఆమె వెల్లడించారు. ఆలయము సంప్రొక్షణ అనంతరము శ్రీ స్వామివారి దర్శనం ఉంటుందని తెలిపారు.

March 2, 2026 / 10:00 AM IST

‘రూ. 8.82 కోట్లతో బీటీ రోడ్డు పనులు’

కోనసీమ: మామిడికుదురు మండలంలోని పాసర్లపూడి బ్రిడ్జి వద్ద రూ. 8.82 కోట్లతో నూతనంగా చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు ఆదివారం పీ. గన్నవరం MLA గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్‌పర్సన్ పెనుమాల లక్ష్మి, నాయకులు జేఎస్ఆర్, అడబాల తాతకాపు పాల్గొన్నారు.

March 2, 2026 / 09:51 AM IST

నేడు లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి తిరునాళ్లు

GNTR: కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి తిరునాళ్లు సోమవారం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం గ్రామంలో మేళతాళాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండువగా సాగింది. సోమవారం జరిగే తిరునాళ్ల మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని ఆలయ కమిటీ కోరింది.

March 2, 2026 / 09:51 AM IST

నేటి నుంచి ఒంగోలులో పోలీస్ యాక్ట్ 30 అమలు

ప్రకాశం: ఒంగోలు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంతో పాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ శాఖ అనుమతి లేకుండా సమావేశాలు, సభలు, ర్యాలీలు నిర్వహించకూడదన్నారు.

March 2, 2026 / 09:47 AM IST