GNTR: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుందని గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మంగళవారం తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) గ్రౌండ్స్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు ఈ ఎంపికలు జరుగుతాయని ఆయన వివరించారు. కావున అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ATP: గుత్తి శివారులోని కోళ్ల ఫారం సమీపంలోని ఓ గోడౌన్ వద్ద తాగునీటి మోటార్, కేబుల్ వైర్‌ను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారని గోడౌన్ యజమాని సుధీర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం బాధితుడు మాట్లాడుతూ.. సుమారు రూ.70,000 విలువ చేసే తాగునీటి మోటర్ కేబుల్ వైర్లను దుండగులు ఎత్తుకెళ్లారన్నారు. బాధితుడు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AKP: వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ సోమవారం తెలిపారు. మంచినీటి బోర్లు మరమ్మతులకు గురైతే వెంటనే మెటీరియల్ తో బోర్ మెకానిక్స్ ఆటోలో వెళ్లి రిపేర్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం క్రాష్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామన్నారు. తాగునీటికి సంబంధించి సమస్యలు ఉంటే తక్షణం తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
నెల్లూరు జిల్లాలో వివిధ ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్లుగా విధులు నిర్వహిస్తున్న 17 మందికి మంగళవారం జెడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు అందజేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్ గా పనిచేస్తున్న వారికి పదోన్నతి కల్పించి హైస్కూల్లో రికార్డు అసిస్టెంట్లుగా నియమించినట్లు తెలియజేశారు.
VSP: ఏపీ పర్యాటక రంగంలో విశాఖపట్నం జిల్లా కీర్తి కిరీటంగా నిలుస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభలో ప్రకటించారు. విశాఖ పరిసరాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి రూ.8,650 కోట్ల పెట్టుబడులతో 50 కీలక ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్‌లో విశాఖను గ్లోబల్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దురామన్నారు.
ప్రకాశం: మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పులి శ్రీనివాసులును మంగళవారం కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ మర్యాదపూర్వకంగా కలిశారు. జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. కనిగిరి మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై పలు అంశాలపై చర్చించారు. మున్సిపల్ అభివృద్ధికి సహకారం అందిస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.
కోనసీమ: ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాధాన్యత అంశాలపై ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, కాలువలు, విద్యా, వైద్య రంగాలకు సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిని సీఎంకి వివరించారు.
KDP: రాజంపేట పార్లమెంట్ టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు, 41 మంది నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం మార్చి 2న మదనపల్లె పట్టణంలోని రామతులసమ్మ కన్వెన్షన్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మరియు జిల్లా స్థాయి ప్రముఖ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
PLD: జిల్లా చర్లగుడిపాడులో పద్మశాలి యువకుల జంట హత్యలపై సంఘం నేతలు సీఎం చంద్రబాబును కలిశారు. శ్రీనివాసరావు, భావనరుషి కుటుంబాలకు ఆర్థిక సాయం, పక్కా ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన సీఎం, ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
BPT: ఏపీ అసెంబ్లీ సమావేశాలను రేపల్లె నియోజకవర్గ విద్యార్థులు వీక్షించారు. పేటేరు, గుళ్లపల్లి, ఉల్లిపాలెం పాఠశాలల విద్యార్థులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ ముచ్చటించారు. సభ తీరు, సమస్యల ప్రస్తావనపై వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. అనంతరం మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
E.G: నిడదవోలు మండలం శెట్టిపేట ZP హైస్కూల్ దగ్గరలో సెల్ టవర్ ఏర్పాటు చేయడానికి వ్యతిరేకిస్తూ BSP నాయకులు బయ్యే మునేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం నిరసన నిర్వహించారు. సెల్ టవర్ వలన సమీపంలో ఉన్న విద్యార్థులు పరిసరాలలో జీవించేవారు రేడియేషన్‌తో అనారోగ్యానికి గురి అయ్యే ప్రమాదం ఉందన్నారు. వెంటనే అధికారులు స్పందించి టవర్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలన్నారు.
ఏలూరు: జిల్లావ్యాప్తంగా మంగళవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షకు 98 శాతం హాజరు నమోదైనట్లు ఆర్‌ఐవో యోహాన్ తెలిపారు. మొత్తం 16,433 మంది విద్యార్థులకు గాను 16,046 మంది హాజరయ్యారని, 387 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. హాజరైన వారిలో జనరల్ విభాగం నుంచి 14,209 మంది, ఒకేషనల్ నుంచి 1,837 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
ASR: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతిని పురష్కరించుకుని అరకులోయలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. మంగళవారం అరకులోయ ఎన్టీఆర్ గ్రౌండ్ నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు కోలాటం, దింసాలతో శోభాయాత్ర నిర్వహించారు. ఆధ్యాత్మిక వక్త రాధమనోహర్ దాస్ ముఖ్య అతిథిగా పాల్గొని హిందుత్వం, సనాతన ధర్మం ప్రాముఖ్యతను వినిపించారు. హిందూ బందువులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
SKLM: పెద్దపాడులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. మార్చి 2న నిర్వహించాల్సిన ఈ పరీక్షలను మార్చి 8వ తేదీకు మార్చినట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దేవి మంగళవారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
KKD: డొక్కా సీతమ్మ ఆశయాలతో పేదల కోసం జనసేన కృషి చేస్తుందని జగ్గంపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు జగ్గంపేటలో పాత పోలీస్ స్టేషన్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే డొక్కా సీతమ్మ ఉచిత క్యాంటీన్ ను దాతల సాయంతో నిర్వహించి 500 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు.