• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఏసీబీ అధికారుల సోదాలు అప్డేట్

ప్రకాశం: కంభం వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ తన ఇంటిలో రూ.20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన విషయం తెలిసిందే. అయితే కంభం మండలం తురిమెళ్ళ గ్రామానికి చెందిన ఎరువుల దుకాణదారుడు రవీంద్ర కుమార్ వద్ద లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ ఇన్‌ఛార్జ్ డీఎస్పీ రామకృష్ణుడు తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖ కార్యాలయంలోను అధికారులు సోదాలు నిర్వహించారు.

February 20, 2026 / 05:38 PM IST

ఏజీపీగా పైడి వరహా నరసింహులు నియామకం

SKLM: ఆమదాలవలస(మం) కత్యచార్యులపేటకు చెందిన పైడి వరహా నరసింహులు ఆమదాలవలస సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టులో ప్రభుత్వం న్యాయవాది(ఏజీపీ)గా సీనియర్ న్యాయవాదిగా నియమిస్తూ ఉత్తర్వులు శుక్రవారం వెలువడ్డాయి. ఈయన పలుమార్లు ఆమదాలవలస బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. ఈయనకు పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

February 20, 2026 / 05:38 PM IST

TDP నుంచి వైసీపీలో చేరిన 20 కుటుంబాలు

KDP: నందవరం మండలంలోని మాచపురం గ్రామంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. టిడిపికి చెందిన 20 కుటుంబాలు శుక్రవారం వైసీపీ పార్టీలో చేరారు. ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో పలువురు TDP గ్రామ నాయకులు వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని తెలిపారు.

February 20, 2026 / 05:38 PM IST

‘మహిళలపై అరాచకాలకు పాల్పడితే చర్యలు తప్పవు’

W.G: మైనర్ బాలికలు, మహిళలపై దాడులు, వేధింపులకు పాల్పడే వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని నరసాపురం డీఎస్పీ డా. జి. శ్రీవేద స్పష్టం చేశారు. మహిళల రక్షణే పోలీసుల ప్రథమ ప్రాధాన్యమని, నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెడతామని ఆమె హెచ్చరించారు. మహిళలపై జరిగే నేరాల పట్ల ఏ మాత్రం రాజీ పడకుండా బాధ్యులపై కఠిన కేసులు నమోదు చేస్తామన్నారు.

February 20, 2026 / 05:36 PM IST

మూతబడిన పీఏసీఎస్ కార్యాలయం

AKP: ఉద్యోగుల సమ్మెతో కోటవురట్ల పీఏసీఎస్ కార్యాలయం మూతపడింది. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు.హెచ్ఆర్ పాలసీని, జీవో36ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాల పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2019 తర్వాత నియమితులైన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ వయసు 62కు పెంచాలని సమ్మెకు దిగారు.

February 20, 2026 / 05:32 PM IST

జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు: కలెక్టర్

BPT: జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 7,443 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్, ప్రైవేట్ షాపుల్లో నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. 45 కిలోల యూరియా బస్తా ధరను రూ. 266.50గా నిర్ణయించామని, ఎవరైనా అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

February 20, 2026 / 05:32 PM IST

‘ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి’

పార్వతీపురం ఐటీడిఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొమరాడ మండలంలో ఉన్న పలు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం పాఠశాలలో అమలవుతున్న వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు.

February 20, 2026 / 05:25 PM IST

కోట నరవ హైస్కూల్లో ‘ప్రామిస్ ఫర్ క్లీన్ వైజాగ్’

VSP: పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు జీవీఎంసీ ఆధ్వర్యంలో కోట నరవ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘ప్రామిస్ ఫర్ క్లీన్ వైజాగ్’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీ. నల్లనయ్య పాల్గొని మాట్లాడుతూ.. తడి–పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు.

February 20, 2026 / 05:24 PM IST

పెదకాకానిలో ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక

GNTR: పెదకాకాని ఎంపీడీవో కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై శుక్రవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి పనుల్లోని లోపాలు, వేతన చెల్లింపుల ప్రక్రియపై అధికారులకు, వేతనదారులకు అవగాహన కల్పించారు. ఎంపీపీ శిరీష, ఎంపీడీవో, ఈవో పీఆర్డీ, ఏపీవో మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 05:21 PM IST

రాష్ట్ర వైసీపీ బూత్ కమిటీల జనరల్ సెక్రటరీ నియామకం

VZM: మెంటాడ(మం) చింతలవలసకు చెందిన వైసీపీ నాయకులు, వైసీపీ ప్రచారవిభాగం సభ్యులు కనిమెరక త్రినాధరావును రాష్ట్ర YCP బూత్‌ కమిటీల జనరల్‌ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు వైసీపీ అదిష్టానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంపై మాజీ DCM పీడిక రాజన్నదొర తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా కనిమెరక త్రినాధరావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

February 20, 2026 / 05:20 PM IST

‘పీఎం జన్మన్ 2.0 లబ్ధిదారులకు బకాయిలు చెల్లించాలి’

ASR: గృహ లబ్ధిదారులకు బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ కోరారు. బలియగూడ పీవీటీజీ గ్రామానికి చెందిన 9 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టినా బిల్లులు రాక పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఈ అంశంపై పాడేరు ఐటీడీఏలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

February 20, 2026 / 05:20 PM IST

‘బాల్య వివాహం అనేక సమస్యల వలయం’

KKD: పిఠాపురం ICDS సీడీపీవో దుర్గాదేవి ఆధ్వర్యంలో బాల్య వివాహ్ ముక్త్ భారత్ 100 రోజుల క్యాంపెయిన్ భాగంగా రాపర్తి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత స్కూల్లో జరిగింది. చిన్న తనంలో బాల్యవివాహాల వలన శారీరకంగా, మానసికంగా పరిపక్వత చెందరని అనేక సమస్యలను ఎదుర్కొంటారని తెలిపారు. అమ్మాయికి 18 అబ్బాయికి 21 సంవత్సరాలు నిండాలని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అన్నారు.

February 20, 2026 / 05:17 PM IST

ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నీ ప్రారంభం

GNTR: మంగళగిరిలోని 6వ బెటాలియన్ APSPలో 2వ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. హోంమంత్రి అనిత అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యం ప్రజా భద్రత కోసం శ్రమించే పోలీసులకు ఇలాంటి క్రీడలు అవసరమని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌లో 6రాష్ట్రాల నుంచి మొత్తం 10 పోలీసు జట్లు పాల్గొంటున్నాయి.

February 20, 2026 / 05:06 PM IST

రేపు సగుటూరు గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ

CTR: పుంగనూరు బండ్లపల్లి గ్రామం సొసైటీ కాలనీలో సగుటూరు గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేకం శనివారం జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం సాయంత్రం గణపతి హోమంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. ఆదివారం అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ, కుంబాభిషేకము, మహా పూర్ణాహుతి, అలంకరణ పూజా అధికారి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.

February 20, 2026 / 05:04 PM IST

ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

సత్యసాయి: కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి పంచాయతీ దేవానంద్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ తల్లి ఆలయానికి డా.బత్తల హరిప్రసాద్ శుక్రవారం రూ.1,25,000 లక్షల విరాళం అందజేశారు. ఆయన వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. ఆలయ విగ్రహాలు, లోపల గ్రానైట్ బండల ఏర్పాటు కోసం ఈ విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు స్వయంగా అందజేశారు.

February 20, 2026 / 05:00 PM IST