• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తౌశిక్ కుటుంబాన్ని పరామర్శించిన కదిరి బాబురావు

ప్రకాశం: సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ సైనిక్ స్కూల్‌లో ఇటీవల మరణించిన విద్యార్థి తౌశిక్ కుటుంబ సభ్యులను మంగళవారం కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.

February 24, 2026 / 08:30 PM IST

క్రీడా పోటీల్లో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు

ATP: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ఎమ్మెల్యేల క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఉత్సాహంగా పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రజా సేవలో నిరంతరం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ పోటీలు చక్కని వేదికగా నిలిచాయి.

February 24, 2026 / 08:30 PM IST

మట్టిమిద్దే కూలి మహిళ మృతి

నంద్యాల: జిల్లా నందికొట్కూరు మండలం కొణిదెలలో మంగళవారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన లక్ష్మీ దేవమ్మ అనే మహిళ మట్టి మిద్దె కూలి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎస్సై చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

February 24, 2026 / 08:29 PM IST

‘గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం చేయాలి’

KRNL: గూడూరు మండలం నాగులాపురం పీహెచ్సీ పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ రఘు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. “జన్మనిచ్చిన తల్లి, జన్మించిన శిశువు ఎవరూ మరణించకూడదు” అనే లక్ష్యంతో సేవలు అందించాలని సూచించారు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం చేసుకునేలా ప్రోత్సహించాలని, పోషకాహారం, రక్తహీనతపై అవగాహన కల్పించాలన్నారు.

February 24, 2026 / 08:25 PM IST

రక్షణ కల్పించాలని ఎస్సైకు వినతి

KRNL: పెద్దకడబూరు మండలంలో దళితులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దళితులకు రక్షణ కల్పించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు ఆశీర్వాదం, సుమల రాజేష్ డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దకడబూరు పోలీసు స్టేషన్‌లో ఎస్సై నిరంజన్ రెడ్డికు వినతి అందజేశారు. ఇటీవల చోటుచేసుకున్న ఘటనలను ఖండిస్తూ, ప్రాణహాని ముప్పు ఉన్న నాయకులకు తగిన రక్షణ కల్పించాలని కోరారు.

February 24, 2026 / 08:24 PM IST

రోడ్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి

VZM: సీఎం నారా చంద్రబాబు నాయుడుని మంగళవారం అమరావతిలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన కలిశారు. ఈ సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా, బొబ్బిలి దాడితల్లి అమ్మవారు ఉత్సవాన్ని పురస్కరించుకుని బొబ్బిలిలో రోడ్లు అభివృద్ధి కోసం రూ2.0 కోట్లు మంజూరు చేయాలని కోరారు.

February 24, 2026 / 08:23 PM IST

వైసీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

NTR: చందర్లపాడు మండలం చింతలపాడులో ట్రాక్టర్ ప్రమాదంలో కుమారున్ని కోల్పోయిన షేక్ షాకీర్ కుటుంబానికి పట్టణ వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబ సభ్యులకు దుస్తులు, 10వేల రూపాయల నగదును అందించి ఆయన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మైనారిటీ విభాగం జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్, తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 08:23 PM IST

మీడియా అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ

అన్నమయ్య: 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఛైర్మన్ నిశాంత్ కుమార్ మంగళవారం అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ చేశారు. మొదటి సమావేశంలో ఆమోదం పొందిన 267 మంది పాత్రికేయులకు కార్డులు జారీ కాగా, మిగిలిన దరఖాస్తులను తదుపరి సమావేశంలో పరిశీలించనున్నట్లు తెలిపారు.

February 24, 2026 / 08:21 PM IST

డీవార్మింగ్ మాప్-అప్ డేను పర్యవేక్షించిన DMHO

PPM: డీవార్మింగ్ డీవార్మింగ్ మాప్-అప్ డే కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు జోగింపేట, కెజిబివి పాఠశాలలో మంగళవారం ఆర్.బి.ఎస్.కె అధికారి డా టి. జగన్ మోహనరావుతో కలిసి పర్యవేక్షణ చేశారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రోజున ఏవైనా కారణాలచే ఆల్బెండజోల్ మాత్రలు వేయబడని విద్యార్థులు ఎంత మంది ఉన్నారు, అందుకు గల కారణాలు తెలుసుకున్నారు.

February 24, 2026 / 08:20 PM IST

జిల్లా కోర్టు నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

తిరుపతి దామినేడు సమీపంలో జిల్లా కోర్టు నిర్మించనున్న ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. అలాగే మార్చి 1న నిర్మాణానికి సంబంధించి భూమి పూజ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ ముందస్తు ఏర్పాట్ల పరిశీలనలో ఎస్పీ సుబ్బారాయుడు, మూడవ అదనపు జడ్జి ఎం. గురునాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

February 24, 2026 / 08:17 PM IST

‘అర్హులకు వికలాంగుల పెన్షన్ అందించాలి’

KDP: నగరంలోని ఖలీల్ నగర్లో ఇబ్బందులు వికలాంగ చిన్నారులకు పెన్షన్ అందించాలని వైసీపీ సీనియర్ నేత సుభాన్ బాషా కోరారు. తన స్నేహితుల ద్వారా మతిస్థిమితం లేని ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని ఆయన మంగళవారం పరామర్శించ్చారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కుటుంబానికి బియ్యం, సరుకులు రూ.10 వేల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు.

February 24, 2026 / 08:17 PM IST

APT PCAకు భూమి కేటాయింపునకు వినతి

SKLM: ఏపీ టాక్స్ ప్రాక్టిషనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో ఎమ్మెల్యే, PUC ఛైర్మన్ కూన రవికుమార్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సంఘ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. సంఘ కార్యకలాపాలకు కార్యాలయ నిర్మాణం అవసరమని తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

February 24, 2026 / 08:15 PM IST

‘ప్రభుత్వ స్థలాలను అక్రమిస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకురండి’

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్మశాన వాటికలు, ప్రభుత్వ స్థలాలను ఎవరైనా కబ్జా చేస్తే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో జరుగుతున్నాయని చెప్పారు.

February 24, 2026 / 08:15 PM IST

ఉరుకుంద దేవస్థానం డైరెక్టర్‌గా జిలకర సావిత్రి

KRNL: కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థానం డైరెక్టర్‌గా పెద్దకడబూరుకు చెందిన చెందిన జిలకర సావిత్రి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. పెద్దకడబూరు మండల జనసేన పార్టీ నాయకులు జిలకర గణేష్ తల్లి జిలకర సావిత్రి జనసేన పార్టీ తరుపున ఉరుకుంద ట్రస్ట్ డైరెక్టర్ గా నియమిలయ్యారు.

February 24, 2026 / 08:14 PM IST

మదనపల్లిలో జరిగిన దారుణం బాధాకరం: మంత్రి

అన్నమయ్య: మదనపల్లిలో జరిగిన దారుణ సంఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి, ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.15 లక్షల ఆర్థిక సహాయాన్ని మంత్రి గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా జిల్లా అధికారులతో సమన్వయం చేస్తామని తెలిపారు.

February 24, 2026 / 08:12 PM IST