CTR: రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కొందరు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు కలెక్టరేట్‌లో పనిచేస్తున్న అనుపమను నగరి ఆర్డీవోగా నియమించారు. ప్రస్తుతం నగరిలో ఆర్డీవోగా ఉన్న భవాని శంకర్ రెడ్డిని పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేశారు.
TPT: తిరుపతిలోని ఆటోనగర్‌కు చెందిన అశాలత (19), ఆమె మేనవరాలు దుర్గా (2) అదృశ్యమైనట్లు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 19న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన వీరిద్దరూ తిరిగి రాలేదని తల్లి నాగరత్నం ఫిర్యాదు చేశారు. బంధుమిత్రుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితురాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మెగా కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని MLA ఆనందరావు మంగళవారం శాసనసభలో కోరారు. జిల్లాలో క్వాయర్ ఇండస్ట్రీ లేకపోవడాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రస్తావించారు. ‘వన్ ఫ్యామిలీ -వన్ ఎంట్రప్రెన్యూర్’ లక్ష్యంగా అడుగులు వేయాలని, ఉపాధి అవకాశాల కోసం మెగా పరిశ్రమలు తక్షణమే నెలకొల్పాలన్నారు.
PPM: పాలకొండ నగర పంచాయతీలోని శిర్లిపోతన్న ఆలయం వద్ద మంగళవారం జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సమీప గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయం ముందర ఉన్న పోతురాజు విగ్రహం వద్ద మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పూజలు చేశారు. సాయంత్రం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో దేవరపేట నుంచి వెంకమ్మపేట వరకు శిర్లు యాత్ర సందడి నెలకొంది.
KKD: 18వ లోక్ సభ కాలానికి సంబంధించి బల్గేరియాతో పార్లమెంటరీ ఫ్రెండ్దిప్ గ్రూప్ ఏర్పాటయింది. ఇందులో సభ్యునిగా కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్‌ను లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా మంగళవారం నామినేట్ చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలను విస్తరించేలా చర్యలు తీసుకుంటానని సానా సతీశ్ తెలిపారు.
ATP: శింగనమల నియోజకవర్గ సాగు, తాగునీటి సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యే బండారు శ్రావణి మంగళవారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. బుక్కరాయసముద్రం చెరువు ఆధునీకరణ, బీటీ రోడ్డు పనులతో పాటు నార్పల మండల గ్రామాల కోసం హెచ్‌ఎల్‌సీ నుంచి నక్కనూతి కుంటకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు.
VSP: ఆరిలోవలోని జరిగిన హత్య కలకలం రేపింది. భార్య దుర్గ (33) పై అనుమానంతో ఆమె భర్త చున్నీతో మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. లైఫ్ స్టైల్‌లో ఉద్యోగం చేసే నిందితుడు, హత్య అనంతరం తప్పించుకోలేక ఇంట్లోనే ఉన్న ఫ్రిడ్జ్ వెనుక దాక్కున్నాడు. అయితే, ఇంటి బయట నిలిపి ఉన్న బైక్ ఆధారంగా అనుమానం వచ్చిన పోలీసులు లోపల వెతకగా అసలు విషయం బయటపడింది.
VZM: ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం మెరకముడిదాం మండల కమిటీ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. ఈ ఎన్నికల అధికారిగా స్దానిక MRO సులోచన రాణి వ్యవహరించారు. మండల అధ్యక్షుడిగా తిరుపతిరావు, ఉపాధ్యక్షుడిగా ఆదినారాయణ, కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి శ్రీలత, సంయుక్త కార్యదర్శి సావిత్రీని ఎన్నుకున్నారు. VRO హక్కుల కోసం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.
అన్నమయ్య: కొత్తకోట మండలం రంగనాథపురంలో వృద్ధ దంపతులపై హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీధిలో గొర్రెలను తోలుకురావడంపై తలెత్తిన వివాదంలో కృష్ణప్ప, కృష్ణమ్మలపై అదే గ్రామానికి చెందిన ఆరుగురు కర్రలతో దాడి చేశారు. బాధితుల కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కాండ్లమడుగు క్రాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.
SKLM: జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల సమస్యలు, పరిష్కారాల పై మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం రాత్రి తన క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎస్ ఈ కేవీవీ సుబ్రహ్మణ్యంతో సమీక్ష నిర్వహించారు. కొండ పేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను రూ.4 కోట్ల అంచనాతో పూర్తి చేసి, 2,500 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
CTR: చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంను ఉదయం 6:20 గంటలకు మూసివేస్తున్నట్లు ఈవో వెంకట కిషోర్ తెలిపారు. సాయంత్రం 6:47కు గ్రహణం ఉండటంతో 9 గంటల ముందుగానే ఆలయం మూసివేస్తున్నారు. 4వ తేదీ ఉదయం నుంచి దర్శనాలు, సేవలు యథావిధిగా జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.
CTR: చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంను ఉదయం 6:20 గంటలకు మూసివేస్తున్నట్లు ఈవో వెంకట కిషోర్ తెలిపారు. సాయంత్రం 6:47కు గ్రహణం ఉండటంతో 9 గంటల ముందుగానే ఆలయం మూసివేస్తున్నారు. 4వ తేదీ ఉదయం నుంచి దర్శనాలు, సేవలు యథావిధిగా జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.
W.G: పాలకొల్లులోని ఛాంబర్స్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చెన్నైకు చెందిన జియల్ కంపెనీ బుధవారం జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.డీ.వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ కంపెనీలో పనిచేయడానికి అర్హులని, అర్హత కలిగిన వారు కళాశాలలో జరిగే జాబ్ మేళాకు విద్యార్హత ధ్రువపత్రాలతో నేరుగా హాజరుకావచ్చన్నారు.
ASR: సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్ అరుదైన ఘనత సాధించారు. 2026 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయనకు చోటు లభించింది. 4బీ పెన్సిల్ ముల్లుపై కేవలం 4 మి.మీ వెడల్పు, పొడవుతో అతి సూక్ష్మ తాజ్‌మహల్‌ను 6 గంటల శ్రమతో రూపొందించారు. నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్‌కు రికార్డు పత్రాన్ని మంగళవారం పోస్టల్ ద్వారా పంపారు.
AKP: రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ దారులు ఈనెల 28వ తేదీలోగా జీవన ప్రమాణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలని జిల్లా ఖజానా అధికారిణి సుభాషిణి మంగళవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.పెన్షన్ దారులు జీవన ప్రమాణ యాప్ లేదా సమీప పోస్ట్ ఆఫీస్ లో బ్యాంకులో సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో వీటిని సమర్పించాలన్నారు.