ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలోనే యాడ్స్ రానున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న ఈ విధానాన్ని వచ్చే ఏడాది నాటికి భారత్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇకపై మూవీలు, షోలు చూస్తున్న సమయంలో ఈ యాడ్స్ దర్శనమివ్వనున్నాయి. ఇతర వేదికల కంటే ఇందులో యాడ్స్ తక్కువగానే ఉంటాయని అమెజాన్ తెలిపింది. ఒకవేళ యాడ్ ఫ్రీ కంటెంట్ కావాలనుకునేవారికి ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ప్లాన్ను తీసుకురానున్నట్లు పేర్కొంది.