»Zen Micro Pod Ev Launched In India Claims Over 120 Km Range
Zen Micro Pod EV: ఎలక్ట్రిక్ త్రీ వీలర్..ఫీచర్లు అదిరాయి..!
ఈరోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. మార్కెట్లోకి కూడా కొత్త రకం ఎలక్ట్రిక్ వాహనాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటి వరకు మనకు కార్లు, స్కూటర్లు మాత్రమే తెలుసు. తాజాగా ఎలక్ట్రిక్ త్రీవీలర్ వాహనం కూడా అడుగుపెట్టింది.
జెన్ మొబిలిటీ కంపెనీ జెన్ మైక్రో పాడ్ పేరుతో కార్గో ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ను లాంచ్ చేసింది. గురుగ్రామ్‌కు చెందిన ఈవీ స్టార్టప్ కంపెనీ అయిన జెన్ మొబిలిటీ ఈ వాహనాన్ని అనేక రెంటల్, లీజింగ్ సంస్థలతోపాటు థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కలిసి రూపొందించింది. లీజు రకాన్ని బట్టి వారికి వాహనాన్ని నెలకు రూ.9,999 అద్దెపై అందించనున్నది. ఈ వాహనం దాదాపు 150 కేజీల బరువును మోస్తుందట.
దీనికి కరెంట్ ఛార్జ్ కూడా ఎక్కువ అవసరం లేదట. కేవలం నాలుగు యూనిట్ల కరెంటును మాత్రమే వినియోగించుకొంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 120 కిలోమటర్ల వరకు ప్రయాణించవచ్చట. ఈ వాహనం ఆర్5ఎక్స్, ఆర్10ఎక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీనికంటూ స్పెషల్ గా కార్గోబాక్స్ కూడా ఉంటుంది. ఇందులో షెల్ఫ్‌లు, రిఫ్రిజిరేటర్ బాక్స్‌లు, ఓపెన్ టబ్‌లు ఉంటాయి. దీన్ని అవసరానికి తగ్గట్టు కస్టమైజ్ చేయించుకోవచ్చు.