»Yatra Ipo Launch September 15th 2023 Available One Lot At Rs 149 10
Yatra IPO: ప్రారంభం..రూ.14 వేలకే లభ్యం
ప్రముఖ ఆన్ లైన్ ట్రావెల్ కంపెనీ యాత్రా ఆన్లైన్ ఐపీఓ నేటి నుంచి మొదలైంది. తక్కువ ధరల్లో ఒక లాట్ తీసుకునేందుకు కేవలం 14 వేల రూపాయలు చేల్లిస్తే సరిపోతుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఇవి తీసుకునేందుకు చివరి తేదీ ఎప్పటివరకు ఉంది? ఎప్పుడు లిస్ట్ అవుతాయనే విషయాలు ఇప్పుడు చుద్దాం.
Yatra IPO launch september 15th 2023 Available one lot at Rs 149 10
ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ అయిన యాత్రా(Yatra) ఆన్లైన్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ఈరోజు(సెప్టెంబర్ 15న) నుంచి సబ్స్క్రిప్షన్ ప్రారంభమైంది. యాత్ర IPOలో రూ.602 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ చేస్తున్నారు. పెట్టుబడిదారులు సెప్టెంబర్ 20 వరకు IPOకి సభ్యత్వాన్ని పొందవచ్చు. అయితే వారాంతంలో మార్కెట్ మూసివేయనున్న నేపథ్యంలో కేవలం మూడు రోజులు మాత్రమే వీటిని తీసుకునేందుకు అవకాశం ఉంది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం ఈ IPO బిడ్డింగ్ చివరి రోజున అంటే సెప్టెంబర్ 20న కట్-ఆఫ్ సమయం 05:00 PMగా పేర్కొన్నారు. పెట్టుబడిదారులు కనీసం ఒక బిడ్ కూడా చేయవచ్చు. ఒక బిడ్ కు 105 ఈక్విటీ షేర్లు వస్తాయని కంపెనీ తెలిపింది. అందుకు గాను రూ.14,910 చెల్లించాల్సి ఉంటుంది. 2005లో స్థాపించబడిన ఈ కంపెనీ ఈక్విటీ షేరుకు రూ.135-142గా IPO ధరను నిర్ణయించింది. ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ తన ప్రమోటర్ THCL ట్రావెల్ హోల్డింగ్ సైప్రస్ లిమిటెడ్‌కు హక్కుల ఇష్యూ ద్వారా రూ.62.01 కోట్ల విలువైన షేర్లను 10 డిసెంబర్ 2022న ఒక్కొక్కటి రూ.236 ఇష్యూ ధరకు విక్రయించింది. IPOలో రూ.602 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల జారీ ద్వారా 12,183,099 షేర్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ చేయనున్నారు.
IPO ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 15, 2023
IPO ముగింపు తేదీ – సెప్టెంబర్ 20, 2023
షేర్ల కేటాయింపు – సెప్టెంబర్ 25, 2023
రీఫండ్ల ప్రారంభం – సెప్టెంబర్ 26, 2023,
డీమ్యాట్ ఖాతాకు షేర్ల బదిలీ – సెప్టెంబర్ 27, 2023