Telsa cars: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టెస్లా (Telsa) ప్రస్తుతం భారత్ మార్కెట్ పై దృష్టి పెట్టింది. వీలైనంత త్వరగా ఇండియా గడ్డపై అడుగుపెట్టేందుకు ఎలక్ట్రానిక్ కార్ల దిగ్గజం టెస్లా ప్రయత్నాలను వేగవంతం చేసింది. మనదగ్గర కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు అనేక కథనాలు వెలువడుతున్నాయి. ప్రతీ సంవత్సరం దాదాపు 5 లక్షల ఎలాక్ట్రానిక్ వెహికిల్స్లను (Electric Vehicles) ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ప్లాంట్ను ఏర్పాటు చేయాలని టెస్లా కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. మన దేశం నంచే ఇండో-పసిఫిక్ దేశాలకు కార్లను ఎగుమితి చేయాలని ఎలన్ మస్క్ (Elon Musk) కంపెనీ ప్రణాళికలు చేస్తోందని తెలుస్తుంది.
ఇండియాలో ఈ వాహనాల ప్రారంభ ధర రూ.20 లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. గత నెల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత్ లో టెస్లా వీలైనంత తొందరగా ప్రారంభమౌతుందని, దీనిపై త్వరలోనే అధికార ప్రకటన ఉంటుందని మస్క్ తెలిపారు. ఈ భేటీ తరువాతే భారత్ ప్రభుత్వంతో ఈ కంపెనీ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
భారత మార్కెట్లోకి (Indian Market) టెస్లా ప్రవేశంపై చర్చ చాలా కాలంగా సాగుతోంది. అయితే, భారత్లోకి దిగుమతి చేసుకునే కాస్ట్లీ కార్లపై గవర్నమెంట్ భారీ సుంకం విధిస్తోంది. కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రెయిట్ విలువ 40,000 డాలర్లు దాటిన కార్లపై 100 శాతం సుంకం వర్తిస్తోంది. అయితే టెస్లా (Tesla) కార్లన్నీ దాదాపు ఈ కేటగిరీలోకే వస్తున్నాయి. దీంతో పన్నులను తగ్గించాలని ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రభుత్వాన్ని కోరారు. మార్కెట్ విక్రయాలను బట్టి ఇక్క మ్యాన్ఫ్యాక్చరింగ్ ఏర్పాటుపై తరువాత ఆలోచిద్దాం అన్నారు. దీనికి ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. భారత్ లోనే తయారు చేయడం మూలనా ఖర్చు చాలా తగ్గుతుందని, కార్లకు డిమాండ్ ఉంటుందని చెప్పింది. లేదంటే విడి భాగాలుగా తీసుకొచ్చి భారత్లో అసెంబుల్ చేసే విధానంపై దృష్టి నెట్టాలని టెస్లా (Tesla)కు భారత ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం టెస్లా ఈ విధానాన్ని అమలు పరిచేదిశగా చర్చలు జరపుతున్నట్లు తెలుస్తుంది.