»Four Indian Mujahideen Terrorists Jailed Nia Court Verdict
NIA: నలుగురు IM ఉగ్రవాదులకు జైలుశిక్ష
భారత్ అంతటా బాంబు పేలుళ్లకు పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు పన్నిన కుట్రకు సంబంధించిన ఇండియన్ ముజాహిదీన్ (IM) కుట్ర కేసులో నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎన్ఐఏ(NIA) ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.
దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్ల కుట్రకు పాల్పడ్డ పాక్ మద్దతుగల ఉగ్రవాదులు ప్రణాళికకు సంబంధించిన ఇండియన్ ముజాహిదీన్ కుట్ర కేసులో నలుగురు వ్యక్తులకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రత్యేక కోర్టు(special court) జూలై 12న తీర్పునిచ్చింది. వీరిలో పాకిస్థాన్‌కు చెందిన కీలక నిందితులు రియాజ్ భత్కల్, ఇండియాలో ఉన్న యాసిన్ భత్కల్ సహా IM సభ్యులతో వీరు సన్నిహితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నిందితులు హైదరాబాదు, ఢిల్లీతో సహా ముఖ్యమైన ప్రదేశాలలో తనిఖీలు చేశారని, పేలుడు పదార్థాలతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా సేకరించారని ఉగ్రవాద నిరోధక సంస్థ తెలిపింది.
నలుగురు నిందితులు హైదరాబాదు, ఢిల్లీతో సహా ముఖ్యమైన ప్రదేశాలలో తనిఖీలు చేశారని, పేలుడు పదార్థాలతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా సేకరించారని ఉగ్రవాద నిరోధక సంస్థ తెలిపింది. నిందితులు డానిష్ అన్సారీ (దర్భంగా, బీహార్) అఫ్తాబ్ ఆలం (పూర్నియా, బీహార్), ఇమ్రాన్ ఖాన్ (నాందేడ్, మహారాష్ట్ర), ఒబైద్-ఉర్-రెహ్మాన్ (హైదరాబాద్, తెలంగాణ) చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) కింద జూలై 7న దోషులుగా నిర్ధారించబడ్డారు. బుధవారం ప్రకటించిన శిక్ష ప్రకారం ప్రత్యేక న్యాయమూర్తి నిందితుడు డానిష్ అన్సారీకి రూ.2,000, అఫ్తాబ్ ఆలమ్‌కు రూ. 10,000 జరిమానా విధించారు.
ప్రత్యేక కోర్టు ఈ ఏడాది మార్చి 31న నలుగురితో పాటు మరో ఏడుగురిపై అభియోగాలు మోపింది. మిగిలిన ఏడుగురిని యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్, జియా-ఉర్-రెహ్మాన్, తెహ్సిన్ అక్తర్, హైదర్ అలీగా గుర్తించారు. వారిపై విచారణ కొనసాగుతోంది. మార్చి 2006 నాటి వారణాసి పేలుళ్లు, జూలై 2006 ముంబై వరుస పేలుళ్లు, వారణాసి, ఫైజాబాద్‌లోని యూపీ కోర్టుల వరుస పేలుళ్లతో సహా దేశంలో వివిధ పేలుళ్లకు కారణమైన ఇండియన్ ముజాహిదీన్(IM) సభ్యులు పన్నిన కుట్రకు సంబంధించినది ఈ కేసు. నవంబర్ 2007లో లక్నో, ఆగస్టు 2007లో హైదరాబాద్ జంట పేలుళ్లు, జైపూర్ వరుస పేలుళ్లు, ఢిల్లీ వరుస పేలుళ్లు, 2008లో అహ్మదాబాద్ వరుస పేలుళ్లతో పాటు. 2010లో జరిగిన చిన్నస్వామి, బెంగళూరు స్టేడియం పేలుడు, 2013లో హైదరాబాద్ జంట పేలుళ్ల వెనుక కూడా ఐఎం హస్తం ఉందని ఎన్ఐఏ పేర్కొంది.