»Service Providers Are Responsible For Blocking Promotional Calls Trai
TRAI: అవాంఛిత కాల్స్ విషయంలో కస్టమర్ల పర్మిషన్ తప్పనిసరి!
TRAI:టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం కంపెనీ(telecom company)లను 2 నెలల్లోపు డిజిటల్ ప్లాట్‌ఫారమ్(Digital platform)ను అభివృద్ధి చేయాలని ఆదేశించింది. తద్వారా అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్(SMS)లను అడ్డుకోవాలని సూచించింది.
TRAI:టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం కంపెనీ(telecom company)లను 2 నెలల్లోపు డిజిటల్ ప్లాట్‌ఫారమ్(Digital platform)ను అభివృద్ధి చేయాలని ఆదేశించింది. తద్వారా అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్(SMS)లను అడ్డుకోవాలని సూచించింది. ప్రమోషనల్ కాల్స్(promotional message), మెసేజ్‌లు తమకు కావాలా? వద్దా? అన్న ఆప్షన్‌ను ఎంచుకునే విధంగా వినియోగదారుల కోసం ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయాలని సర్వీస్ ప్రొవైడర్ల(sevice providerds)కు సూచించింది. యూనిఫైడ్ డిజిటల్ వేదికను రెండు నెలల్లో తీసుకురావాలని టెల్కోలకు ట్రాయ్ స్పష్టం చేసింది. ఈ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయి, ప్రమోషనల్ కాల్స్‌కు అనుమతి తీసుకోవడం/నిరాకరించడానికి వీలు కల్పించాలని ట్రాయ్ సూచించింది.
ముందుగా ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్లను అందుకోవడానికి సబ్‌స్ర్కైబర్లు(sibcribers) తమ సంసిద్ధతను తెలియజేయాల్సి ఉంటుందని, ఆ తర్వాతే బ్యాంకులు, బీమా-ఆర్థిక సంస్థలు, వాణిజ్య-వ్యాపార, రియల్ ఎస్టేట్(Real estate) తదితర కంపెనీలు ఆయా కస్టమర్లను సంప్రదించి వారి అంగీకారం మేరకు అడ్వైర్టెజ్‌మెంట్ కాల్స్, సందేశాలను పంపడం ఆరంభిస్తాయంటూ డిజిటల్ వేదికగా జరిగే ప్రక్రియను శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ట్రాయ్(Trai) వివరించింది. ప్రస్తుతం ప్రమోషనల్ సందేశాలను పొందడం కోసం కస్టమర్ల సమ్మతిని తెలుసుకొనే ఎటువంటి వ్యవస్థ కూడా లేదు. దీంతో సమయం, సందర్భం లేకుండా అవాంఛిత మొబైల్ కాల్స్, మెసేజ్‌లు అందరికీ ఎడాపెడా వచ్చేస్తున్నాయి. దీనిపై ట్రాయ్‌కి వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టెలికం సంస్థలకు పైవిధంగా ట్రాయ్ ఆదేశించింది.