»Trai Asks Telecom Providers Consent Before Sending Promotional Calls And Messages
TRAI: ఇకనుంచి ప్రమోషనల్ మెసేజ్ పంపాలంటే కంపెనీలు పర్మీషన్ తీసుకోవాల్సిందే
లోన్లు, స్కీములు అంటూ వచ్చే మెసేజ్ లకు ఇక నుంచి చెక్ పడనుంది. ఇలాంటి వాటికి ముకుతాడు వేస్తూ ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. చాలాసార్లు రెగ్యులర్ కాల్స్, మెసేజులు కంటే ప్రమోషనల్ కాల్స్, మెసేజులే ఎక్కువగా వస్తుంటాయి.
TRAI: లోన్లు, స్కీములు అంటూ వచ్చే మెసేజ్ లకు ఇక నుంచి చెక్ పడనుంది. ఇలాంటి వాటికి ముకుతాడు వేస్తూ ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. చాలాసార్లు రెగ్యులర్ కాల్స్, మెసేజులు కంటే ప్రమోషనల్ కాల్స్, మెసేజులే ఎక్కువగా వస్తుంటాయి. దేశ వ్యాప్తంగా ఒక్కో యూజర్ రోజుకు సగటున 12 మెసేజులను స్పామ్ మెసేజ్ లు అందుకుంటున్నారని ఓ నివేదిక తెలిపింది. ఇలాంటి తరుణంలో ట్రాయ్ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇలాంటి సందేశాలు పంపే యూజర్లు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలంటూ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రమోషనల్ సందేశాలను అరికట్టడానికి డిజిటల్‌గా అనుమతి పొందేందుకు డీసీఏ పేరిట ప్రోగ్రాంను ఇటీవల ట్రాయ్(TRAI) తీసుకొచ్చింది.
మరోవైపు లోన్లు, స్కీములు అంటూ బ్యాంకులు,ఫ్లాట్లు ఇళ్లు అంటూ రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రమోషనల్ మెసేజులు పంపించాలంటే తప్పకుండా యూజర్ అనుమతి తీసుకొనే చర్యలను చేపట్టనున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ యూజర్ కు ఏదైనా కంటెంట్ ను పంపించాలని భావిస్తే ముందుగా టెలికాం ఆపరేటర్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. తర్వాత టెలికాం ఆపరేటర్ 127*** షార్ట్ కోడ్ తో కూడిన ఓ ఎస్సెమ్మెస్ ను పొందాల్సి ఉంటుంది. ఇక ఆ మెసేజ్ కు యూజర్ అనుమతి ఇవ్వొచ్చు. లేదంటే నిరాకరించవచ్చు. ఒకవేళ యూజర్ నిరాకరిస్తే టెలికాం కంపెనీ సదరు ఏజెన్సీనికి ఆ యూజర్ కు ఇకపై మెసేజ్ లు పంపకుండా నిలువరించాల్సి ఉంటుంది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు ట్రాయ్ స్పష్టం చేసింది.