»Telangana Congress Declared Minority Declaration By Salman Khurshid
Minority declaration: ప్రకటించిన కాంగ్రెస్..పెళ్లైన కొత్త జంటకు లక్షా 60 వేలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ(telangana congress) మైనారిటీ డిక్లరేషన్ ను ప్రకటించింది. అయితే దీనిని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్(salman khurshid) విడుదల చేయగా..దీనికి మైనారిటీ వర్గాలకు కీలకమైన హామీలను ప్రకటించారు.
telangana-congress-declared-minority-declaration by salman khurshid
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్(telangana congress) కీలకమైన ‘మైనారిటీ డిక్లరేషన్’ను ఎట్టకేలకు ప్రకటించింది. దీనిని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్(salman khurshid) విడుదల చేశారు. దీనిలో ఆర్థిక అభ్యున్నతితోపాటు సాధికారత, 6 నెలల్లోపు కుల గణన నిర్వహించి, మైనారిటీలకు ఉద్యోగాలు, విద్య, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. దీంతోపాటు మైనారిటీల సంక్షేమ బడ్జెట్‌ను రూ.4,000 కోట్లకు పెంచుతామని స్పష్టం చేశారు.
– నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలను అందించడానికి సంవత్సరానికి రూ.1,000 కోట్ల బడ్జెట్
– విద్య, ఉపాధి ఈక్విటీకి నిబద్ధత
-అబ్దుల్ కలాం తౌఫా-ఇ-తలీమ్ పథకం ద్వారా రూ.5 లక్షల సాయం. ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు M.Phil, Ph.D పూర్తిచేసే ఇతర మైనారిటీ యువతకు ఆర్థిక సహాయం అందజేత
-ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం
-ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇళ్లులేని మైనారిటీ కుటుంబాలకు ఇళ్ల స్థలం
– ముస్లిం, క్రైస్తవ, సిక్కు సహా ఇతర మైనారిటీలకు చెందిన కొత్త పెళ్లైన జంటలకు రూ.1,60,000 సాయం
– అదనంగా రూ.1 లక్ష పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత, గ్రాడ్యుయేషన్‌కు రూ.25,000/- ఇంటర్మీడియట్‌కు రూ.15,000/- మరియు 10వ తరగతికి రూ.10,000/-.
– తెలంగాణ సిక్కు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి మైనారిటీ సంస్థల్లో ఖాళీలను భర్తీ
– ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ
– మతపరమైన హక్కులు, సంస్కృతికి రక్షణ
– ఇమామ్‌లు, మ్యూజిన్లు, ఖాదీమ్‌లు, పాస్టర్లు, గ్రంథిలతో సహా అన్ని మతాల పూజారులకు రూ.10,000 – 12,000 నెలవారీ గౌరవ వేతనం
– ‘తెలంగాణ రాష్ట్ర మైనారిటీల కమిషన్ చట్టం 1998’ని శాశ్వత సంస్థగా మార్చేందుకు సవరించి, మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన విధానాలకు తగిన మార్పులు చేసేందుకు రాష్ట్ర శాసన సభలో వార్షిక నివేదికను సమర్పణ.