NRPT: మక్తల్ పట్టణంలోని న్యూ మారుతి నగర్లో తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని సంతోష్‌కుమార్ ఆదివారం అత్తగారింటికి వెళ్లగా సోమవారం సాయంత్రం వచ్చి చూసేసరికి ఇంటి తాళం, బీరువా తాళం పగలగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉన్న ఐదున్నర తులాల బంగారం, రూ. 1లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.